టీమిండియా యువ క్రికెటర్ సంజు శాంసన్ మూడేళ్ల గ్యాప్ తర్వాత సాంప్రదాయ క్రికెట్లోకి రీఎంట్రీ ఇస్తున్నాడు. టీ20 క్రికెట్‌పై ఎక్కువగా ఫోకస్ పెట్టిన సంజు.. చాలా కాలంగా టెస్టు ఫార్మాట్‌కు దూరంగా ఉంటున్నాడు. దేశవాళీ క్రికెట్లో రంజీలకు దూరంగా ఉంటున్న సంజు.. ఐపీఎల్‌పై మాత్రమే దృష్టి పెట్టాడు. అయితే ఇప్పుడు మనసు మార్చుకున్న సంజు ఇకపై సాంప్రదాయ క్రికెట్లో సైతం తన సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నాడు. ఐపీఎల్ ప్రదర్శన ఆధారంగా భారత జాతీయ జట్టులో చోటు కోసం ఎదురు చూసిన సంజు శాంసన్‌కు ప్రతిసారీ నిరాశే ఎదురవుతోంది. కచ్చితంగా జట్టులో ఉంటాడని భావించినా కూడా అతనికి మొండి చేయి ఎదురవుతోంది.
సంజును ఇటివల ఆస్ట్రేలియా వేదికగా జరిగిన టీ20 వరల్డ్ కప్ 2022 కోసం ఎంపిక చేయకపోవడంపై కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. ఏడాది కాలంగా టీ20 క్రికెట్లో దారుణంగా విఫలం అవుతున్న రిషభ్ పంత్‌కు భారీగా అవకాశాలు ఇస్తున్నారని కానీ.. టీ20ల్లో మెరుగైన రికార్డు ఉన్న సంజు శాంసన్‌ను మాత్రం పక్కనపెడుతూ వచ్చాడు. వరల్డ్ కప్ తర్వాత.. న్యూజిలాండ్‌తో జరిగిన మూడు టీ20లు, మూడు వన్డేల సిరీస్‌లోనూ సంజు శాంసన్‌కు అన్యాయమే జరిగిందని చెప్పాలి. వరల్డ్ కప్ తర్వాత రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీకి రెస్ట్ ఇవ్వడంతో తాత్కాలిక కెప్టెన్లు హార్దిక్ పాండ్యా, శిఖర్ ధావన్ న్యూజిలాండ్‌తో సిరీస్‌లలో జట్టును నడిపించారు.
మూడు టీ20ల సిరీస్‌లో తొలి మ్యాచ్ వర్షార్పాణం అయింది. రెండో మ్యాచ్‌లో టీమిండియా గెలిచింది. మూడో మ్యాచ్‌లో సగం మ్యాచ్ జరిగి నిలిచిపోయింది. అయితే.. ఈ సిరీస్‌లో సంజుకు అసలు అవకాశామే ఇవ్వలేదు పాండ్యా. వన్డే సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో ధావన్ సంజుకు తుది జట్టులో స్థానం ఇచ్చినా.. మళ్లీ రెండో వన్డేలో పక్కనపెట్టాడు. తొలి మ్యాచ్‌లో సంజు 36 పరుగులు చేసి.. మంచి పార్ట్నర్షిప్ నెలకొల్పాడు. అయినా కూడా అతన్ని ఆడించలేదు. ఇక ప్రస్తుతం బంగ్లాదేశ్‌తో జరుగుతున్న వన్డే సిరీస్‌లోనూ సంజు లేడు. ఆ తర్వాత జరిగే టెస్టు సిరీస్‌కు సైతం సంజును ఎంపిక చేయలేదు. దీంతో.. ప్రస్తుతం ఖాళీగా ఉన్న సంజు.. దేశవాళీ టోర్నీల్లో ప్రతిష్టాత్మకమైన రంజీ ట్రోఫీలో ఆడేందుకు సిద్ధమవుతున్నాడు. రేపటి(డిసెంబర్ 13, ఆదివారం) నుంచి ప్రారంభం కానున్న రంజీలో కేరళ జట్టు కెప్టెన్‌గా సంజు బరిలోకి దిగనున్నాడు. దాదాపు మూడేళ్ల తర్వాత సంజు రంజీ మ్యాచ్‌లు ఆడటం విశేషం.
Sanju Samson will be captaining Kerala in the first two matches of Ranji Trophy 🏏#RanjiTrophy #Kerala #SanjuSamson pic.twitter.com/r4LleCnxGK
— CricketGully (@thecricketgully) December 8, 2022