న్యూజిలాండ్ దిగ్గజ ఆటగాడు రాస్ టేలర్ ఇటివల క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన విషయం తెలిసిందే. బంగ్లాదేశ్‌తో జరిగిన టెస్ట్ మ్యాచ్ టేలర్ కెరీర్లో చివరి మ్యాచ్. ఈ మ్యాచ్‌లో టేలర్ అద్భుతం చేశాడు. క్రికెట్ చరిత్రలో ఏ క్రికెటర్‌కు లభించని ముగింపు టేలర్‌కు దక్కింది. ఎవరైన తమ క్రికెట్ కెరీర్లో చివరి మ్యాచ్‌లో మంచి ప్రదర్శన కనబర్చాలని భావిస్తున్నారు. కానీ టేలర్ ఏకంగా మ్యాచ్‌ను తన బౌలింగ్‌తోనే ముగించి గెలుపుతోనే గుడ్‌బై చెప్పాడు. స్వదేశంలో బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో టెస్టులో న్యూజిలాండ్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌తో రాస్ టేలర్ తన అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలకనున్నట్లు ముందే ప్రకటించాడు.
Ross Taylor leaves the Test arena for the final time – a @Blackcaps legend 🙌 #NZvBAN pic.twitter.com/idVcc2mahk
— ESPNcricinfo (@ESPNcricinfo) January 11, 2022
బ్యాటింగ్‌లో అంతగా రాణించకపోయినా.. కెరీర్లో చివరి మ్యాచ్‌ను గుర్తుండిపోయేలా చేసుకున్నాడు. ఫాలోఆన్ ఆడిన బంగ్లాదేశ్ చివరి బ్యాట్స్‌మెన్ ఇబాదత్ హుస్సేన్‌ను అవుట్ చేసి మ్యాచ్‌ను తన బౌలింగ్‌తోనే ముగించాడు. తన కెరీర్లో చివరి బంతికి వికెట్ తీసుకోవడం ఏ క్రికెటర్‌కైనా గొప్ప విషయమే. ఇప్పటి వరకు 112 టెస్టులు ఆడిన టేలర్ 196 ఇన్నింగ్స్‌లలో 7684 పరుగులు చేశాడు. అందులో 3 డబుల్ సెంచరీలు, 19 సెంచరీలు, 35 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. మరి టేలర్‌కు దక్కిన ఈ అరుదైన ఘనతపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
🏏 7683 runs in 112 Tests
🌟 19 hundreds and 35 fifties
🏆 2021 World Test ChampionThanks for all the memories, Ross Taylor! ❤️ pic.twitter.com/jpTjoDWkd4
— ICC (@ICC) January 12, 2022
ఇదీ చదవండి: మైదానంలోనే కన్నీటి పర్యంతమైన న్యూజిలాండ్ దిగ్గజ క్రికెటర్ టేలర్