న్యూజిలాండ్ దిగ్గజ క్రికెటర్ రాస్ టేలర్ నెదర్లాండ్స్‌తో వన్డే మ్యాచ్ సందర్భంగా జాతీయ గీతం ఆలపిస్తున్న సమయంలో కన్నీళ్లు పెట్టుకున్నాడు. టేలర్ అంతర్జాతీయ కెరీర్లో ఇదే చివరి మ్యాచ్. దీంతో కొంత భావోద్వేగానికి గురైన టేలర్ గ్రౌండ్‌లోనే ఏడ్చేశాడు. జాతీయ గీతం పాడడం అయిన వెంటనే తన పిల్లలు ముద్దాడుతూ కన్నీటి పర్యంతమయ్యాడు.
జట్టు సభ్యులు ఆ సమయంలో టేలర్ భుజం తట్టారు. కాగా ఈ మ్యాచ్‌లో టేలర్ కేవలం 14 పరుగుల మాత్రమే చేశాడు. జట్టు మాత్రం భారీ స్కోర్ చేసింది. 300 పైచిలుకు పరుగులు చేసింది. మార్టిన్ గుప్టిల్, విల్ యంగ్ సెంచరీలతో కదంతొక్కారు. కాగా తన కెరీర్లో 236 వన్డేలు ఆడిన టేలర్ 8602 పరుగులు చేశాడు. అందులో 21 సెంచరీలు, 51 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. మరి టేలర్ వన్డే కెరీర్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Ross Taylor got emotional during national anthem. pic.twitter.com/KfaKnaVr8i
— Mufaddal Vohra (@mufaddal_vohra) April 4, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.