న్యూజిలాండ్ సీనియర్ క్రికెటర్ రాస్ టేలర్ అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ కానున్నట్లు ఇటివల ప్రకటించారు. ప్రస్తుతం బంగ్లాదేశ్‌తో జరుగుతున్న టెస్టు మ్యాచ్‌లో టేలర్ ఆడుతున్నారు. ఆదివారం ప్రారంభమైన టెస్టులో బంగ్లాదేశ్ మొదటి ఇన్నింగ్స్‌లో 126 పరుగులకే కుప్పకూలింది. న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్‌లో 6 వికెట్లకు 521 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. కాగా మ్యాచ్ ప్రారంభానికి ముందు రెండు జట్లు జాతీయ గీతం ఆలపించాయి. ఆ సమయంలో న్యూజిలాండ్ దిగ్గజ ఆటగాడు రాస్ టేలర్ కన్నీళ్లు పెట్టుకున్నాడు.
Ross Taylor is trying to control his tears during national anthem. Ross Taylor will be out there one last time for New Zealand in red-ball cricket.
Test cricket will miss you legend 😢 pic.twitter.com/du4v3paBJk
— Raja Sekhar Cricket (@CricketWithRaju) January 9, 2022
టేలర్‌కు ఇదే చివరి అంతర్జాతీయ మ్యాచ్. దీంతో తీవ్ర భావోద్వేగానికి గురైన టేలర్ కన్నీళ్లు పెట్టుకున్నారు. క్రికెట్‌కు దూరం అవుతున్నాననే కారణంగానే టేలర్ ఇలా కన్నీటి పర్యంతమైనట్లు సమాచారం. కాగా ఈ మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్‌లో టేలర్ 28 పరుగులు చేశాడు. ఇప్పటి వరకు 112 టెస్టులు ఆడిన టేలర్ 196 ఇన్నింగ్స్‌లలో 7684 పరుగులు చేశాడు. అందులో 3 డబుల్ సెంచరీలు, 19 సెంచరీలు, 35 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. మరి టేలర్ కెరీర్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: న్యూజిలాండ్ డ్రెస్సింగ్‌రూమ్‌లో చిన్నారి! ఎవరతను? ఎందుకున్నాడు?