ప్రపంచ క్రికెట్‌లో పెద్ద జట్టుగా ఉన్న టీమిండియా కొన్నేళ్ల నుంచి ఐసీసీ మెగా ఈవెంట్లలో స్థాయి తగ్గ ప్రదర్శన చేయడం లేదు. 2011 వన్డే వరల్డ్ కప్, 2013లో ఛాంపియన్స్ ట్రోఫీ విజయం తర్వాత భారత్ ఒక్కటంటే ఒక్క ఐసీసీ ట్రోఫీ కూడా గెలవలేదు. 2014 టీ20 వరల్డ్ కప్‌లో శ్రీలంక జరిగిన ఫైనల్‌లో ఓటమి, 2015 వన్డే వరల్డ్ కప్ సెమీస్‌లో ఆసీస్ చేతిలో ఓటమి, 2016 టీ20 వరల్డ్ కప్‌లో వెస్టిండీస్‌తో సెమీఫైనల్‌లో ఓటమి, 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో పాక్ చేతిలో ఓటమి, 2019 వన్డే వరల్డ్ కప్ సెమీస్‌లో న్యూజిలాండ్ చేతితో ఓటమి.. తాజాగా 2021 టీ20 వరల్డ్ కప్‌లో లీగ్ దశలోనే టీమిండియా ఇంటి దారి పట్టింది.
ఇలా అన్ని మెగా ఈవెంట్స్‌లో ఫైనల్స్, సెమీఫైనల్స్ వరకు వెళ్లిన టీమిండియా టైటిల్ మాత్రం గెలవలేదు. 2021లో మరీ దారుణంగా టీ20 వరల్డ్ కప్ లీగ్ దశలోనే నిష్క్రమించింది. ఆ సమయంలో టీమిండియాపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. అదే సమయంలో విరాట్ కోహ్లీ కెప్టెన్సీ నుంచి తప్పుకోవడంతో రోహిత్ శర్మను టీమిండియా కెప్టెన్‌గా బీసీసీఐ నియమించింది. 2021 టీ20 వరల్డ్ కప్‌లో ఎదురైన ఓటమితో జట్టులో ఎలాంటి మార్పులు అవసరమో తాము గుర్తించినట్లు రోహిత్ శర్మ తాజాగా వెల్లడించాడు.
ప్రస్తుతం టీమిండియా దృష్టి మొత్తం ఏడాది అక్టోబర్‌లో జరిగే టీ20 వరల్డ్ కప్‌పైనే ఉంది. ఈ సారి ఎలాగైన కప్ సాధించాలనే కసితో కెప్టెన్ రోహిత్ శర్మ, కోచ్ రాహుల్ ద్రవిడ్ ఉన్నారు. ఈ క్రమంలో జట్టులో ప్రయోగాలు చేస్తున్నారు. టీ20 వరల్డ్ కప్ కోసం ఒక పటిష్టమైన టీమ్‌ను తయారు చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రస్తుత జట్టు పరిస్థితిపై స్పందించిన రోహిత్ శర్మ.. 2021 టీ20 వరల్డ్ కప్ ఓటమి తర్వాత జట్టు యాటిట్యూడ్, అప్రోచ్‌లో మార్పు రావాలని ఆ రోజే జట్టు మొత్తం బలంగా ఫిక్స్ అయినట్లు వెల్లడించాడు. అగ్రెసివ్ అప్రోచ్‌తో ఆడుతున్నట్లు పేర్కొన్నాడు.
టీ20 వరల్డ్ కప్‌లోనూ దూకుడే మంత్రంగా ముందుకెళ్తామని రోహిత్ స్పష్టం చేశాడు. అందుకే జట్టులో యువ ఆటగాళ్లకు భారీగా అవకాశాలు ఇస్తున్నట్లు సమాచారం. అయితే ఇప్పటివరకైతే రోహిత్ చెప్తున్న అగ్రెసివ్ అప్రోచ్ మంచి ఫలితాలనే ఇచ్చింది. ఇంగ్లండ్‌పై వన్డే, టీ20 సిరీస్ విజయం, తాజాగా వెస్టిండీస్‌పై వన్డే, టీ20 సిరీస్ విజయాలు సాధించింది టీమిండియా. మరి రోహిత్ శర్మ అనుసరిస్తున్న ఎటాకింగ్ ప్లే, అగ్రెసివ్ అప్రోచ్ స్ట్రాటజీపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Rohit Sharma claims India have made a conscious effort to play a more attacking brand of cricket since last year’s @T20WorldCup.
More 👉 https://t.co/1E2nJVpUtu pic.twitter.com/gXvCIrHtbe
— ICC (@ICC) August 10, 2022
ఇది కూడా చదవండి: ఉమెన్స్ టీమ్‌పై దాదా అభ్యంతరకర ట్వీట్! నెటిజన్లు ఫైర్