బర్మింగ్‌హామ్ వేదికగా ఇటివల ముగిసిన కామన్వెల్త్ గ్రేమ్స్ 2022లో భారత మహిళల క్రికెట్ జట్టు సిల్వర్ మెడల్ సాధించిన విషయం తెలిసిందే. వారి ప్రదర్శనపై దేశవ్యాప్తంగా ప్రశంసల వర్షం కురిసింది. కానీ.. బీసీసీఐ అధ్యక్షుడిగా ఉన్న టీమిండియా మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలీ ఉమెన్స్ టీమ్ గురించి చేసిన ఒక ట్వీట్‌పై సోసల్ మీడియాలో తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. దాదా వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. కాగా.. కామన్వెల్త్ గేమ్స్‌లో ఆస్ట్రేలియాతో ఫైనల్ మ్యాచ్‌లో తలపడిన టీమిండియా 9 పరుగుల స్వల్ప తేడాతో ఓడి గోల్డ్ మెడల్‌ను తృటిలో చేజార్చుకుంది. దీంతో సిల్వర్ మెడల్‌తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అయినా కూడా ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ హర్మన్ సేనపై ప్రశంసలు కురిపించారు. చాలా బాగా పోరాడారు అంటూ మద్దతుగా నిలిచారు. ఈ క్రమంలో బీసీసీఐ బాస్ గంగూలీ కూడా భారత బృందాన్ని అభినందిస్తూ ఓ ట్వీట్ చేశాడు. అందులో టీమిండియాను అభినందిస్తూనే, చురకలంటించే వ్యాఖ్యలు కూడా చేశాడు. "సిల్వర్ గెలిచినందుకు ఇండియన్ ఉమెన్స్ టీమ్‌కు అభినందనలు.. కానీ.. వాళ్లు మాత్రం ఇంటికి అసంతృప్తిగానే వస్తారు.. ఎందుకంటే అది గెలిచే మ్యాచ్’ అంటూ దాదా కొంచెం అసంతృప్తితో అభ్యంతరకరంగా ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్‌పై ప్రస్తుతం సోషల్ మీడియాలో మంటలు రాజేసుకున్నాయి. క్రికెట్ అభిమానులు దాదాపై మండిపడుతున్నారు. ‘బీసీసీఐ అధ్యక్షుడి హోదాలో ఉండి.. జట్టుకు మద్దతుగా ఉండాల్సింది పోయి వారిని మరింత కుంగదీసేలా ట్వీట్ చేయడం ఏంటని’ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘ఇలా మాట్లాడినందుకు దాదా సిగ్గుపడాలని’ ఘాటుగా స్పందిస్తున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి. Congratulations to the Indian women's team for winning silver ..But they will go home disappointed as it was their game tonite ..@BCCIWomen — Sourav Ganguly (@SGanguly99) August 7, 2022 This guy is an absolute Shame that he is the president of World's most powerful board https://t.co/slQz1drjPI — Harsh Deshwal (@IamHarshDeshwal) August 8, 2022 ఇది కూడా చదవండి: ఎంతో మందికి లైఫ్ ఇచ్చిన గంగూలీ ఈ ఆటగాడిని తొక్కేశాడా?