టీమిండియా 421 పరుగుల వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసిన సంగతి తెలిసిందే. అయితే దీనికి అసలు కారణం కెప్టెన్ రోహిత్ శర్మ తెలియజేశాడు.
వెస్టిండీస్ తో జరిగిన తొలి టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించింది. 2 వికెట్లకు 312 పరుగులతో మూడో రోజు ఆట ప్రారంభించిన రోహిత్ సేన 5 వికెట్ల నష్టానికి 421 వద్ద తొలి ఇన్నింగ్స్ ని డిక్లేర్ చేసింది. ఓపెనర్ జైస్వాల్ 171 పరుగులు చేసి డబుల్ సెంచరీ మిస్ చేసుకోగా.. విరాట్ కోహ్లీ 76 పరుగులు చేసి ఔటయ్యాడు. జడేజా 37 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. ఇక అనంతరం రెండో ఇన్నింగ్స్ ని ప్రారంభించిన వెస్టిండీస్ జట్టు కేవలం 130 పరుగులకే కుప్ప కూలింది. అశ్విన్ 7 వికెట్లతో మరోసారి విండీస్ జట్టు పతనాన్ని శాసించాడు. ఇక ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ రోహిత్ డిక్లేర్ చేయడానికి అసలు కారణాన్ని తెలియజేశాడు.
తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా చాలా స్లో గా బ్యాటింగ్ చేసిన సంగతి తెలిసిందే. జట్టులో ఏ ఒక్కరి స్ట్రైక్ రేట్ 50 కి పైగా లేదు. పరుగులు చేయడానికి బాగా ఇబ్బందిగా ఉన్న పిచ్ మీద భారత బ్యాటర్లు చాల ఓపిగ్గా బ్యాటింగ్ చేశారు. అయితే మూడో రోజు కూడా భారత్ తీరు మారలేదు. దీనికి తోడు బ్యాట్ ఝళిపిస్తాడనుకున్న కిషన్ కూడా తొలి పరుగు కోసం ఏకంగా 19 బంతులు ఎదుర్కోవాల్సి వచ్చింది. దీంతో భారీ ఆధిక్యం ఉందని భావించి కెప్టెన్ రోహిత్ శర్మ ఇన్నింగ్స్ ని డిక్లేర్ చేద్దామని భావించాడట. అయితే రోహిత్ శర్మ కాస్త ఆలస్యంగా డిక్లేర్ ఇవ్వడానికి అసలు కారణం ఇషాన్ కిషన్ అని చెప్పేసాడు.
రోహిత్ శర్మ మాట్లాడుతూ ” లంచ్ తర్వాత కాసేపటికీ నేను మా బ్యాటర్లతో మాట్లాడా. ఒకటి రెండు ఓవర్లలో డిక్లేర్ చేస్తామని చెప్పా. ఇక కిషన్ తొలి పరుగు చేయడానికి బాగా ఇబ్బంది పడ్డాడు. ఈ సమయంలో కిషాన్ 15 బంతులు ఆడిన తర్వాత నువ్వు తొలి పరుగు చేస్తేనే ఇన్నింగ్స్ ని డిక్లేర్ చేస్తాం. అని చెప్పుకొచ్చాడు. కిషాన్ సింగల్ తీయగానే తాము డిక్లేర్ చేస్తున్నట్లు కెప్టెన్ రోహిత్ ముందుగానే హింట్ ఇచ్చాడట. మొత్తానికి కిషాన్ టెస్టు క్రికెట్ లో తన మొదటి పరుగు పూర్తి చేసుకొని భారత్ ఇన్నింగ్స్ డిక్లేర్ చేయడానికి కారణమయ్యాడని తెలుస్తుంది. ఇక ఈ రెండు జట్ల మధ్య రెండో టెస్టు ఈ నెల 20 నుంచి స్టార్ట్ అవుతుంది. మరి రోహిత్ కిషన్ విషయంలో చేసిన పని మీకేవిధంగా అనిపించిందో కామెంట్ల రూపంలో తెలపండి.
— Nihari Korma (@NihariVsKorma) July 15, 2023