ఆసిస్ తో జరుగుతున్న మూడో టెస్ట్ లో టీమిండియా తడబడింది. ఇక ఈ మ్యాచ్ లో లబూషేన్ కు లైఫ్ ఇచ్చాడు రోహిత్ శర్మ. అశ్విన్ ఎంత చెప్పినా వినకుండా.. కేఎస్ భరత్ మెుత్తుకున్నా గానీ రోహిత్ శర్మ వినలేదు. అసలేం జరిగింది అంటే?
బోర్డర-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా టీమిండియా-ఆసిస్ మధ్య మూడో టెస్ట్ మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ లో తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగింది టీమిండియా. అయితే ఆసిస్ బౌలర్ల ధాటికి భారత బ్యాటర్లు పూర్తిగా చేతులెత్తేశారు. అనూహ్యంగా బాల్ బౌన్స్ కావడం, టర్న్ కావడంతో టీమిండియా బ్యాటర్లు పెవిలియన్ కు ఒకరివెంట ఒకరు క్యూ కట్టారు. దాంతో కేవలం 109 పరుగులకే భారత జట్టు కుప్పకూలింది. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన ఆసిస్ కు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మంచి అవకాశాన్ని ఇచ్చి పెద్ద తప్పు చేశాడు. ఆ అవకాశం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఇండియా-ఆసిస్ జట్ల మధ్య బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా మూడో టెస్ట్ జరుగుతోంది. ఈ మ్యాచ్ లో టీమిండియా బ్యాటర్లు ఘోరంగా విఫలం అయ్యారు. భారత ఆటగాళ్లు ఆసిస్ బౌలర్లకు దాసోహం కావడంతో 109 పరుగులకే కుప్పకూలింది. ఏ ఒక్క బ్యాట్స్ మెన్ కూడా కొద్ది సేపు క్రీజ్ లో నిలదొక్కుకోలేక పోయాడు. అనంతరం ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆసిస్ కు ఆదిలో షాక్ ఇచ్చాడు జడేజా. ఓపెనర్ ట్రావిస్ హెడ్(9) పరుగులకే అవుట్ చేశాడు. తర్వాత వచ్చిన లబూషేన్ తో కలిసి ఇన్నింగ్స్ ను చక్కదిద్దే పనిలో పడ్డాడు ఉస్మాన్ ఖవాజా. అయితే లబూషేన్ ను అవుట్ చేసే సువర్ణావకాశాన్ని చేతులారా జారవిడిచాడు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ.
అసలేం జరిగింది అంటే? రవిచంద్రన్ అశ్విన్ వేసిన ఇన్నింగ్స్ 11వ ఓవర్ లో ఈ ఘటన జరిగింది. ఈ ఓవర్ ఐదో బంతిని డిఫెన్స్ చేసే ప్రయత్నంలో బంతి మిస్ అయ్యి, అదికాస్తా ఫ్యాడ్స్ కు తాకింది. దాంతో భారత ఆటగాళ్లు ఎల్బీడబ్ల్యూ అని గట్టిగా అప్పీల్ చేశారు. కానీ అంపైర్ అవుట్ ఇవ్వలేదు. దాంతో రివ్యూ తీసుకోమని కీపర్ కేఎస్ భరత్, అశ్విన్ లు ఎంత మెుత్తుకున్నా గానీ రోహిత్ వినలేదు. రివ్యూ తీసుకోలేదు. అయితే ఆ తర్వాత రిప్లేలో అది అవుట్ అని తేలింది. దాంతో తెల్ల మెహం వేశాడు రోహిత్ శర్మ. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
అయితే లైఫ్ లభించడంతో లబూషేన్, ఉస్మాన్ ఖవాజాతో కలిసి రెండో వికెట్ కు 99 పరుగుల విలువైన భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. చివరికి జడేజా బౌలింగ్ లో 31 పరుగులు చేసి లబూషేన్ బౌల్డ్ అయ్యాడు. రోహిత్ ముందే కనుక రివ్యూ తీసుకుంటే.. ఈ 99 పరుగుల భాగస్వామ్యం నిర్మించి ఉండే వారు కాదు. ప్రస్తుతం ఆసిస్ 2 వికెట్లు కోల్పోయి 108 పరుగులు చేసింది. క్రీజ్ లో కెప్టెన్ స్టీవ్ స్మిత్(0), ఉస్మాన్ ఖవాజా(53) పరుగులతో బ్యాటింగ్ కొనసాగిస్తున్నారు. మరి రోహిత్ రివ్యూ తీసుకోకపోవడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
They say shameless I hear Rohit Sharma👎. #RohithSharma #INDvAUS pic.twitter.com/P5UzwSNDUM
— Kohlified. (@123perthclassic) March 1, 2023