టీమిండియా ప్రస్తుత కెప్టెన్ రోహిత్ శర్మ.. కెప్టెన్సీ విషయంలో రోహిత్ శర్మను ఫాలో అవుతున్నాడని టీమిండియా మాజీ ఆటగాడు గౌతమ్ గంభీర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ముఖ్యంగా ఆ విషయంలో విరాట్ ను రోహిత్ ఫాలో అవుతున్నాడని అన్నాడు.
ప్రస్తుతం టీమిండియా ఫుల్ జోష్ లో ఉంది. వరుసగా సిరీస్ లు గెలుస్తూ.. 2023 వరల్డ్ కప్ గెలవడమే ధ్యేయంగా ముందుకు సాగుతోంది. అలాగే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ను కూడా గెలిచేందుకు ఉవ్విళ్లూరుతోంది. ప్రస్తుతం ఉన్న టీమిండియా జట్టు అన్ని జట్లలో కెల్లా అత్యుత్తమ జట్టుగా మాజీలు అభిప్రాయపడుతున్నారు. అయితే జట్టు కూర్పు విషయంలో రోహిత్ శర్మ.. విరాట్ కోహ్లీని ఫాలో అవుతున్నాడు అని టీమిండియా మాజీ ఆటగాడు, బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ అన్నాడు. రోహిత్ శర్మ అద్భుతమైన కెప్టెన్ అయినప్పటికీ కోహ్లీ బాటలో నడుస్తున్నాడు అని చెప్పుకొచ్చాడు. ఈ వార్తకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..
విరాట్ కోహ్లీ.. రికార్డులనే తన ఇంటి పేరుగా మార్చుకుని వరల్డ్ క్రికెట్ ను ఏలుతున్నాడు. అయితే ఇటు రన్ మెషిన్ గానే కాకుండా గతంలో టీమిండియా సారథిగా కూడా అద్భుతమైన ట్రాక్ రికార్డు విరాట్ సొంతం. కోహ్లి కెప్టెన్ గా చేసింది కొద్ది కాలమే అయినప్పటికీ.. టీమిండియా క్రికెట్ పై చెరగని ముద్రను వేశాడు. జట్టు కూర్పులో విరాట్ కోహ్లీది ఓ వైవిధ్యమైన ఎంపిక. ఎలాంటి ఆటగాడినైనా షైన్ చేసి రాటుతేలుస్తాడు. అలాగే రాటుతేలి ప్రస్తుతం వరల్డ్ నెం. 1 బౌలర్ గా ఎదిగాడు సిరాజ్. యంగ్ ప్లేయర్స్ కు ఎక్కువ అవకాశాలు ఇస్తూ.. వారిలోని ప్రతిభను వెలికితీశాడు. ఇప్పుడు ఇదే ఫార్ములాను ఫాలో అవుతున్నాడు రోహిత్ శర్మ అని అంటున్నాడు టీమిండియా మాజీ ఆటగాడు గౌతమ్ గంభీర్.
ఈ క్రమంలోనే విరాట్ కోహ్లీ సారథ్యంలో టీమ్ అప్పట్లో ఎలా ఉండేదో.. ప్రస్తుతం రోహిత్ శర్మ సారథ్యం వహిస్తున్న టెస్ట్ టీమ్ కూడా అలాగే ఉందని గంభీర్ అన్నాడు. జట్టు కూర్పులో విరాట్ కోహ్లీని రోహిత్ శర్మ ఫాలో అవుతున్నాడు అని గంభీర్ పేర్కొన్నాడు. అయితే రోహిత్ శర్మ గొప్ప కెప్టెన్ అనడంలో ఎలాంటి సందేహం లేదని గౌతమ్ గంభీర్ పేర్కొన్నాడు. ఇక వీరిద్దరి కెప్టెన్సీలో ఎక్కువగా తేడాలు లేవని, ఇద్దరు దాదాపుగా ఒకే విధంగా జట్టును నడిపిస్తున్నారని ఈ సందర్భంగా గంభీర్ చెప్పుకొచ్చాడు. ఇక ఎప్పుడూ కోహ్లీని తిట్టే గంభీర్ ఈసారి మాత్రం పొగిడినట్లే అనిపించింది. మరి కెప్టెన్ గా విరాట్ కోహ్లీని రోహిత్ ఫాలో అవుతున్నాడు అన్న గంభీర్ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Gautam Gambhir said, “Virat Kohli has captained exceptionally this Test team and Rohit is probably following that template only. I’ve always believed that Rohit is an amazing captain, but there is not much difference between Virat and Rohit’s captaincy”.
— Mufaddal Vohra (@mufaddal_vohra) February 20, 2023