బంగ్లాదేశ్‌తో ఢాకా వేదికగా జరిగిన రెండో వన్డేలో గాయపడిన రోహిత్ శర్మ.. చివరి వన్డేతో పాటు తొలి టెస్టు సైతం దూరం అయ్యాడు. రెండో వన్డేలో టీమిండియా తొలుత బౌలింగ్ చేయగా.. స్లిప్‌లో ఫీల్డింగ్ చేస్తూ.. క్యాచ్ అందుకో బోయి రోహిత్ గాయపడిన విషయం తెలిసిందే. అతని బొటన వేలికి గాయమైంది. వెంటనే మైదానం వీడిన రోహిత్.. ఆస్పత్రికి వెళ్లి స్కానింగ్ తీయించుకుని, చేతి కట్టుతో స్టేడియానికి వచ్చాడు. తర్వాత కూడా ఫీల్డింగ్ దిగలేదు. అయితే.. బ్యాటింగ్‌కు మాత్రం తప్పని పరిస్థితుల్లో 9వ స్థానంలో వచ్చి అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. కానీ.. విజయానికి 5 పరుగుల దూరంలో నిలిచిపోయాడు. అయితే.. రోహిత్ చూపించిన స్పిరిట్‌కు మాత్రం ప్రశంసలు దక్కాయి. ఇక ఆ మ్యాచ్ తర్వాత మెరుగైన వైద్యం కోసం.. బంగ్లాదేశ్ నుంచి ముంబై వచ్చేసిన రోహిత్ శర్మ. ఇక్కడ చికిత్స తీసుకుని.. మళ్లీ ఫిట్‌నెస్‌పై ఫోకస్‌పెట్టాడు.
అయితే.. శుక్రవారం రోహిత్ శర్మ జింబాబ్వే అండర్-19తో ఉన్న ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గాయంతో జట్టుకు దూరమైన రోహిత్.. జింబాబ్వే టీమ్‌తో ఏం చేస్తున్నాడంటూ క్రికెట్ అభిమానులు తలలు గొక్కుంటున్నారు. అయితే.. ముంబైలో ఉన్న జింబాబ్వే అండర్-19 టీమ్‌కు రోహిత్ శర్మ మోటివేషనల్ క్లాస్ ఇచ్చాడు. కెరీర్‌ను ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఎలాంటి మైండ్‌సెట్ కలిగి ఉండాలి.. వంటి విషయాలపై జింబాబ్వే యువ క్రికెటర్లకు రోహిత్ పలు సూచనలు, సలహాలు ఇచ్చాడు. ఈ క్లాస్ తర్వాత రోహిత్ శర్మతో కలిసి జింబాబ్వే ఆటగాళ్లు ఫొటోలకు ఫోజులు ఇచ్చారు. ఆ ఫొటోలే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
కాగా.. గాయంతో తొలి టెస్టుకు దూరమైన రోహిత్ శర్మ.. రెండో టెస్టుకు అందుబాటులో ఉండే అవకాశం ఉంది. రోహిత్ లేకపోవడంతో టీమిండియాను తొలి టెస్టులో కేఎల్ రాహుల్ కెప్టెన్‌గా నడిపిస్తున్నాడు. ప్రస్తుతం చిట్టగాంగ్‌లో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా పటిష్ట స్థితిలో ఉంది. తొలి ఇన్నింగ్స్‌లో 404 పరుగులు చేసిన భారత్.. బంగ్లాదేశ్‌ను తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 150 పరుగులకే ఆలౌట్ చేసింది. మూడో రోజు ఆట తొలి సెషన్‌లో టీమిండియా 15 ఓవర్లలో 36 పరుగులు చేసి వికెట్ కోల్పోకుండా ఆడుతోంది. దీంతో టీమిండియాకు 290 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఈ టార్గెట్‌కు మరో 100 పరుగులు జోడించి టీమిండియా రెండో ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసే అవకాశం ఉంది. మరి రోహిత్ శర్మ జింబాబ్వే అండర్ 19 ప్లేయర్లకు మోటివేషనల్ క్లాస్ ఇవ్వడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Rohit Sharma advising Zimbabwe under-19 team regarding mindset🏏#RohitSharma𓃵 pic.twitter.com/NzQkDaRcXg
— crickaddict45 (@crickaddict45) December 15, 2022
Rohit Sharma with the Zimbabwe U-19 team at MCA. pic.twitter.com/liybEbVnHM
— Johns. (@CricCrazyJohns) December 15, 2022