తిరువనంతపురం వేదికగా జరుగుతున్న చివరిదైన మూడో వన్డేలో మంచి బ్యాటింగ్ చేస్తున్న టీమిండియా సిరీస్ క్లీన్‌స్వీప్ దిశగా దూసుకెళ్తోంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా.. ఓపెనర్లు రోహిత్ శర్మ, శుబ్‌మన్ గిల్ రాణించడంతో తొలి వికెట్‌కు శుభారంభం అందించింది. కెప్టెన్ రోహిత్ 49 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సులతో 42 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఆ తర్వాత.. విరాట్ కోహ్లీ-గిల్ జోడీ ఇన్నింగ్స్‌ను అద్భుతంగా ముందుకు నడిపిస్తోంది. ప్రస్తుతం గిల్ 75 రన్స్‌తో, కోహ్లీ 34 పరుగులతో క్రీజ్‌లో ఉంది. ప్రస్తుతం ఇదే బ్యాటింగ్ రన్‌రేట్‌ను కొనసాగిస్తే.. టీమిండియా సులువుగా 320 పైచిలుకు స్కోర్ సాధించే అవకాశం ఉంది.
అయితే.. ఈ వన్డే కంటే ముందే తొలి రెండు వన్డేలు నెగ్గిన టీమిండియా.. ఇప్పటికే సిరీస్‌ను సొంతం చేసుకుంది. ఇక లాస్ట్ వన్డేలోనూ గెలిచి సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేయాలనే పట్టుదలతో ఉంది. సిరీస్‌లో నామమాత్రంగా మారిన ఈ మ్యాచ్‌లో టీమిండియా రెండు మార్పులతో బరిలోకి దిగింది. తొలి రెండు వన్డేలు ఆడిన హార్దిక్ పాండ్యా, ఉమ్రాన్ మాలిక్‌లను ఈ మ్యాచ్‌కు రెస్ట్ ఇచ్చి.. వారి స్థానంలో సూర్యకుమార్ యాదవ్, వాషింగ్టన్ సుందర్‌లను జట్టులోకి తీసుకున్నారు. హార్దిక్ పాండ్యాకు రెస్ట్ ఇచ్చినా.. ఉమ్రాన్ మాలిక్‌ను పక్కనపెట్టడంపై మాత్రం విమర్శలు వస్తున్నాయి. ఈ యువ పేసర్‌కు రెగ్యులర్‌కు ఆడిస్తూ.. అతన్ని మరింత పదును పెట్టాల్సింది పోయి.. రెండు మ్యాచ్‌లకే పక్కన పెట్టడం సరికాదని క్రికెట్ అభిమానులు పేర్కొంటున్నారు.
ఉమ్రాన్ మాలిక్‌ను పక్కన పెట్టడంపై టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ.. టాస్ సమయంలో స్పందించాడు. వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్‌లో భాగంగానే హార్దిక్ పాండ్యా, ఉమ్రాన్ మాలిక్‌లకు రెస్ట్ ఇచ్చినట్లు పేర్కొన్నాడు. అలాగే తిరువనంతపురం పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండటంతో.. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నట్లు రోహిత్ వెల్లడించాడు. ఇప్పటికే ఈ సిరీస్‌ను కైవసం చేసుకున్నా.. టీమ్‌లో మెరుగవ్వాల్సిన విషయాలు చాలా ఉన్నాయని రోహిత్ పేర్కొన్నాడు. ఈ రోజు వందశాతం ప్రదర్శన ఇచ్చేందుకు రెడీగా ఉన్నట్లు చెప్పాడు. తిరువనంతపురంలో వాతావరణం పూర్తిగా శ్రీలంకలో ఉన్నట్లే ఉందని.. లంక కెప్టెన్ డసన్ షనక పేర్కొన్నాడు. మరి ఈ మ్యాచ్‌లో ఉమ్రాన్ మాలిక్‌ను పక్కనపెట్టడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
India won the toss and decided to bat first. Sundar and Suryakumar yadav replaces Hardik and Umran in the playing 11. #INDvSL pic.twitter.com/mFL9EkHnmP
— Cricket With Laresh (@Lareshhere) January 15, 2023