బంగ్లాదేశ్ తో జరిగిన వన్డే మ్యాచ్ లో గాయపడిన రోహిత్ శర్మ ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నాడు. బంగ్లాతో జరిగిన వన్డే మ్యాచ్ లో చేతి వేలి ఎముక పక్కకు తొలగడంతో శ్రీలంక తో జరిగే టీ20 సిరీస్ కు దూరం అయ్యాడు హిట్ మ్యాన్. దాంతో సారథ్య బాధ్యతలను హార్దిక్ పాండ్యాకు అప్పగించింది బీసీసీఐ. చికిత్స అనంతరం ఫిట్ నెస్ పై దృష్టి పెట్టాడు రోహిత్ శర్మ. మరికొన్ని రోజుల్లోనే శ్రీలంకతో వన్డే సిరీస్ ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రాక్టీస్ ప్రారంభించాడు. అందులో భాగంగానే జిమ్ లో కసరత్తులు చేస్తూ.. చెమటలు చిందిస్తున్నాడు. దానికి సంబంధించిన వీడియోను తన ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేశాడు రోహిత్.
బంగ్లాతో వన్డే మ్యాచ్ సందర్భంగా గాయపడ్డ రోహిత్ శర్మ కోలుకున్నాడు. మరికొన్ని రోజుల్లో జనవరి 10 నుంచి శ్రీలంకతో వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలోనే ఫిట్ నెస్ పై దృష్టి పెట్టాడు టీమిండియా సారథి, హిట్ మ్యాన్ రోహిత్ శర్మ. వన్డే సిరీస్ ప్రారంభానికి కొద్ది రోజులే ఉండటంతో జిమ్ లో చెమటలు కక్కిస్తున్నాడు. జిమ్ లో కసరత్తులు చేస్తున్న వీడియోను తన ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ చేశాడు హిట్ మ్యాన్. బరువులు ఎత్తుతూ.. డ్యాన్స్ చేస్తూ.. నవ్వుతూ.. చెమటలు చిందిస్తున్నాడు రోహిత్ శర్మ. ఇక వీడియో కింద క్యాప్షన్ గా.. మీరు ఏపని చేస్తే సంతోషంగా ఉంటారో అదే చేయండి అంటూ రాసుకొచ్చాడు. ఇక ఈ వీడియోపై కామెంట్ చేసింది రోహిత్ భార్య రితికా సజ్దే. ఇక గాయం నుంచి పూర్తిగా కోలుకున్న రోహిత్ బరిలోకి దిగేందుకు సిద్దం అవుతుండటంతో.. ఫ్యాన్స్ సంతోషంలో ఉన్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.