క్రికెట్ లో రికార్డులు సృష్టించడం.. వాటిని తిరగరాయడం.. భారత ఆటగాళ్లకు కొత్తేమీకాదు. అదీ కాక క్రీడాలోకంలో రికార్డులకు ఆయుష్షు తక్కువ.. అన్న సామెత మనకు తెలియంది కాదు. ఈ క్రమంలోనే టీమిండియా కెప్టెన్ హిట్ మ్యాన్ రోహిత్ శర్మ.. తాజాగా మరో రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పటికే అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక పరుగుల రికార్డును తన పేరిట లిఖించుకున్న రోహిత్.. తాజాగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లో న్యూజిలాండ్ ఓపెనర్ మార్టిన్ గప్టిల్ రికార్డును బద్దలు కొట్టాడు. ఈ వార్తకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..
రోహిత్ శర్మ.. హిట్ మ్యాన్ గా ప్రపంచ క్రికెట్లో తన పేరును చిరస్మరణియంగా లిఖించుకున్నాడు. తన కెరీర్ లో అనేక రికార్డులను నెలకొల్పిన రోహిత్ తాజాగా మరో సరికొత్త రికార్డును ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లో నెలకొల్పాడు. ఈ మ్యాచ్ లో రోహిత్ కేవలం 20 బంతుల్లోనే 4 ఫోర్లు, 4 సిక్స్ లతో 46 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. దాంతో భారత్ తొలి టీ20 ఓటమికి ప్రతీకారం తీర్చుకుంది. ఇక ఈ మ్యాచ్ లో రోహిత్ 4 సిక్స్ లు కొట్టడం ద్వారా న్యూజిలాండ్ ఓపెనర్ మార్టిన్ గప్టిల్ రికార్డ్ ను బద్దలు కొట్టాడు. గుప్టిల్ 121 అంతర్జాతీయ టీ20ల్లో 172 సిక్సర్లు బాది.. ఇప్పటి వరకు అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. ప్రస్తుతం రోహిత్ శర్మ 137 మ్యాచ్ ల్లో 176 సిక్సర్లు బాది అగ్రస్థానానికి వచ్చాడు.
అయితే అత్యధిక సిక్సర్లు బాదిన వరుసలో యునివర్సల్ బాస్ క్రిస్ గేల్ 124 సిక్స్ లతో 3వ స్థానంలో ఉన్నాడు. ఇక టీమిండియా రన్ మెషిన్ కింగ్ కోహ్లీ 104 సిక్స్ లు బాది వంద సిక్సర్లు కొట్టిన రెండో ఇండియన్ బ్యాటర్ గా ఉన్నాడు. అయితే రోహిత్ కు రికార్డులు కొత్తేమీ కాదు ఇప్పటికే అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక రన్స్ చేసిన జాబితాలో అగ్రస్థానంలో కొనసాగుతున్న విషయం మనకు తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మరో రికార్డును కూడా తన ఖాతాలో వెసుకోవడం విశేషం. మరి వరుసగా పలు రికార్డులను తన ఖాతాలోతో వేసుకుంటున్న హిట్ మ్యాన్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Rohit Sharma moves to the 🔝
The India captain has overtaken Martin Guptill to notch up another achievement 👊https://t.co/JGBgvcv7Tx
— ICC (@ICC) September 24, 2022