టీమిండియా-ఆస్ట్రేలియా మధ్య 2వ టీ20 విదర్భ క్రికెట్ స్టేడియం, నాగపూర్ లో జరగాల్సి ఉంది. ఈ క్రమంలోనే ముందు రోజు అక్కడ వర్షం పడటంతో ఇక మ్యాచ్ జరగదు అని అంతా అనుకున్నారు. దానికి తగ్గట్లు గానే టాస్ వేసే సమయం అవుతున్నప్పటికీ ఫీల్డ్ తడిగా ఉండటంతో అంపైర్లు.. మైదానంలోకి రాలేదు. మ్యాచ్ రెండున్నర గంటల ఆలస్యం తర్వాత ప్రారంభం అయ్యింది. దాంతో అందరు ఊపిరి పీల్చుకున్నారు. కానీ ఈ మ్యాచ్ జరగడానికి గ్రౌండ్ సిబ్బంది ఎంత కష్టపడ్డారో ఎవరికీ తెలిదు. వారి కష్టం ఫలితమే తాజాగా జరిగిన మ్యాచ్ అని టీమిండియా కోచ్ రాహుల్ ద్రవిడ్ అన్నారు. మైదానంలోకి వచ్చి మరీ వారిని అభినందించాడు. ప్రస్తుతం గ్రౌండ్ స్టాఫ్ ను అభినందిస్తున్న ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఈ వార్తకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..
మైదానంలో ఒక క్రికెట్ మ్యాచ్ జరగాలి అంటే దానికి ఎంతో మంది శ్రమ అవసరం. ఆ స్టేడియాన్ని అందంగా ముస్తాబు చేయడంతో పాటు.. అందులో ఆటకు తగ్గట్లుగా అన్ని పరికరాలు, రూంలు, తదితర సౌకర్యాలను జగ్రత్తగా పరిశీలించాలి. ఎక్కడ ఏ చిన్న తేడా వచ్చిన మ్యాచ్ ఆగిపోయే పరిస్థితులు ఏర్పడతాయి. ఈ క్రమంలోనే మైదానం సిబ్బంది పనిని గుర్తించిన టీమిండియా కోచ్ ద్రవిడ్ వారిని పేరు పేరునా గ్రౌండ్ లో అభినందించారు. దానికి కారణం.. ముందు రోజు వర్షం కారణంగా అందరు మ్యాచ్ జరగదు అనుకున్నారు.కానీ స్టేడియం సిబ్బంది రాత్రనకా.. పగలనకా కష్టపడి గ్రౌండ్ ను ఆటకు సిద్ధం చేశారు. మైదానాన్ని నీటిగా చెత్తా చెదారం లేకుండా తీసేశారు. అయితే ఒక్కసారి స్టేడియంలో మ్యాచ్ జరింది.. అంటే ఇక ఆ స్టేడియం డంప్ యార్డ్ లా మారిపోవడం ఖాయం. మరి అలాంటి డంప్ యార్డ్ ను క్లీన్ అండ్ గ్రీన్ గా ఉంచడంలో గ్రౌండ్ స్టాఫ్ సిబ్బంది కీలకంగా వ్యవహరిస్తారు.
ఇక టీమిండిమా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా సైతం తన ట్వీటర్ ఖాతాలో సిబ్బంది గొప్పతనాన్ని ప్రశంసిస్తూ.. ఫొటోలు షేర్ చేశాడు. అందులో సిబ్బంది మైదానాన్ని ఆటకు సిద్దం చేసే పనిలో నిమగ్నమై ఉన్నారు. అయితే ఏదైనా ఒక పెద్ద పని జరగాలి అంటే దాని వెనుక ఎన్నో చేతుల కష్టం ఉంటుందని.. గ్రహించిన టీమిండియా కోచ్ రాహులు ద్రవిడ్ వారికి థ్యాక్స్ చెప్పాడు. మీ వల్లే ఈ రోజు ఈ మ్యాచ్ జరిగింది. మీరు లేక పోతే ఈ మ్యాచ్ జరిగి ఉండేది కాదు అంటూ వారిని మైదానంలోనే ప్రశంసించాడు. ప్రస్తుతం ద్రవిడ్ వారిని అభినందిస్తున్న పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ ఫొటోలపై నెటిజన్స్ స్పందిస్తూ.. “మూలాలను మర్చిపోకుండా గుర్తుపెట్టుకొని.. గుర్తించినందుకు మీకు ధన్యవాదాలు సర్” అని రాసుకొచ్చారు. మరికొందరు.. “గొప్ప వారికే గొప్ప మనసు ఉంటుంది” అని కామెంట్స్ చేశారు. మరి ద్రవిడ్ చేసిన ఈ గొప్ప పనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Nice gesture by rahul dravid to ground staff👏👏. #IndVsAus #BCCI #RahulDravid pic.twitter.com/VMbONDHC5w
— Ankit joshi (@CrickInformer) September 23, 2022
Nice gesture from Rahul Dravid to applaud the ground staff ❤️#RahulDravid #RohitSharma𓃵 #DineshKarthik #INDvsAUS pic.twitter.com/J0zvCHTVdJ
— Oh My Cricket (@OhMyCric) September 23, 2022
A big thank you to the ground staff for all their efforts in making tonight’s match happen 🙏 🤗 pic.twitter.com/42bTSJxSCI
— hardik pandya (@hardikpandya7) September 23, 2022