“మంచి శత్రువు చేసినా అభినందించాలి.. శత్రువు శత్రువే గానీ.. మంచెప్పుడు శత్రువు కాదు..” ఇది అలనాటి కాకతీయుల పరిపాలనా సూత్రం. ఇదే సూత్రం భారత్-ఆసిస్ మ్యాచ్ లో స్పష్టంగా కనిపించింది. క్రికెట్ లో ఎవరైనా ఆటగాడు అవుట్ అయితే.. అతడికి బౌలర్ పై కోపం రావడం సహజం. కానీ తాజాగా టీమిండియా-ఆస్ట్రేలియాల మధ్య జరిగిన ఈ మ్యాచ్ లో దీనికి రివర్స్ గా జరిగింది. ఇక ఈ మ్యాచ్ లో ఆసిస్ కెప్టెన్ ఆరోన్ ఫించ్ దూకుడుమీదున్నాడు. ఓ వైపు సహచర ఆటగాళ్లు అవుట్ అవుతున్నా గానీ అతడి జోరు మాత్రం తగ్గలేదు. అయితే ఈ క్రమంలోనే టీమ్ లో కమ్ బ్యాక్ అయిన యార్కర్ల స్పెషలిస్ట్ బుమ్రా.. ఈ మ్యాచ్ లో కూడా ఓ అద్భుతమైన యార్కర్ వేశాడు. ఆ యార్కర్ కు ఫించ్ ఫిదా అయ్యాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఈ వార్తకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..
బుమ్రా.. బుమ్రా.. “భారత జట్టు వరుస వైఫల్యాలకు అతడు జట్టులో లేకపోవడమే కారణం” ఇది చాలా మంది మాజీ క్రికెటర్ల మాట. గాయాల కారణంగా బుమ్రా ఆసియా కప్ లో ఆడలేకపోయాడు. దాంతో టీమిండియా ఆసియా కప్ లో ఘోరంగా ఓడిపోయింది. ఆ టోర్నీలో భాతర బౌలింగ్ వైఫల్యం కొట్టోచ్చినట్లు కనపడింది. దాంతో అందరు బుమ్రా జట్టులోకి రావాలని అభిమానులు కోరుకున్నారు. దాంతో ఉమేశ్ యాదవ్ స్థానంలో బుమ్రా బరిలోకి దిగాడు. అయితే చాలా కాలం తర్వాత బరిలోకి దిగాడు మునపటిలా బౌలింగ్ వేయడులే.. అని అందరు అనుకున్నారు. వారు అనుకున్నట్లుగానే 5వ ఓవర్ వేయడానికి బరిలోకి దిగిన బుమ్రా తన తొలి ఓవర్ తొలి బంతిని వైడ్ గా వేశాడు. తొలి 5 బంతులకు 11 పరుగులు సమర్పించుకున్నాడు.
అప్పటికి బ్యాటింగ్ ఎండ్ లో ఫించ్ ఉండగా.. ఆరో బంతిని అద్బుతమైన యార్కర్ గా వదిలాడు. ఆ బాల్ ని ఎలా ఆడాలో అర్దం కాని ఫించ్ బౌల్డ్ అయ్యాడు. బంతి లో ఫుల్ టాస్ లో వచ్చి లెగ్ వికెట్ ను కింద కూల్చింది. దాంతో ఒక్క సారిగా కంగు తిన్న ఫించ్.. బుమ్రాను అభినందించలేకుండాపోయాడు. తన బ్యాట్ తో చప్పట్లు కొడుతూ.. ప్రశంసించాడు. అద్భుతమైన బాల్ వేశావ్ అన్నట్లు తన ఫేస్ తో రియాక్షన్ ఇచ్చాడు. ఇక ఈ బాల్ కు ఎవరైనా అవుట్ కావాల్సిందే.. అంటూ ఈ వీడియో చూసిన నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ వీడియోని బీసీసీఐ తన ట్వీటర్ ఖాతో పోస్ట్ చేసింది. ఇది క్రాకర్ యార్కర్ అంటూ కితాబిచ్చింది. మరికొందరు ఇది బాల్ ఆఫ్ ది సెంచరీ అంటూ రాసుకొస్తున్నారు. అయితే బుమ్రా గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అతడు డెత్ ఓవర్ల స్పెషలిస్ట్ గా ఇప్పటికే ప్రపంచ క్రికెట్లో ముద్ర వేసుకున్న సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే మరో సారి తన అవసరం ఏంటో.. తన యార్కర్ల సత్తా ఏంటో నిరూపించాడు. మరి ప్రత్యర్థి ఆటగాడు అయిన ఆరోన్ ఫించ్.. బుమ్రాను అభినందించడం పట్ల మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
B. O. O. M! ⚡️ ⚡️@Jaspritbumrah93 strikes to dismiss Aaron Finch with a cracker of a yorker. 👍 👍#TeamIndia are chipping away here in Nagpur! 👏 👏
Follow the match ▶️ https://t.co/LyNJTtkxVv
Don’t miss the LIVE coverage of the #INDvAUS match on @StarSportsIndia pic.twitter.com/omG6LcrkX8
— BCCI (@BCCI) September 23, 2022
For his match-winning knock in the chase in the second #INDvAUS T20I, #TeamIndia captain @ImRo45 bags the Player of the Match award. 👏 👏
Scorecard ▶️ https://t.co/LyNJTtl5L3 pic.twitter.com/xihAY6wCA3
— BCCI (@BCCI) September 23, 2022