ఓ వైపు వర్షం.. మరో వైపు సమయం గడుస్తోంది.. దీంతో తొలి మ్యాచ్ పరాభవానికి ప్రతీకారం తీర్చుకోవాలనుకున్న.. టీమిండియా ఆశ నెరవేరుతుందా? అని ప్రేక్షకులు ఆశగా ఎదురుచూస్తున్నారు. ముందు రోజు వర్షం కారణంగా మైదానం అంతా తడిగా మారింది. దాంతో మ్యాచ్ కాస్తా ఆలస్యం అయ్యింది. అదీ కాక మ్యాచ్ ను 8 ఓవర్లకు కుదించారు. ఈ ధనాధన్ మ్యాచ్ లో భారత్ 6 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాను ఓడించింది. రోహిత్ ‘థండర్’ ఇన్నింగ్స్ కు తోడు దినేశ్ కార్తీక్ లాస్ట్ లో ఫినిషింగ్ టచ్ ఇవ్వడంతో సిరీస్ 1-1తో సమం అయ్యింది. ఈ మ్యాచ్ కు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..
తొలి టీ20లో పరాభవానికి టీమిండియా ప్రతీకారం తీర్చుకుంది. తాజాగా జరిగిన 2వ టీ20లో పుంజుకుని ఆస్ట్రేలియాను 6 వికెట్ల తేడాతో చిత్తు చేసింది. మైదానం తడిగా ఉండటంతో మ్యాచ్ ను అంపైర్లు 8 ఓవర్లకు కుదించారు. ఇక టాస్ గెలిచిన భారత్ మెుదట ఫీల్డింగ్ ను ఎంచుకుంది. ఈ మ్యాచ్ కు యార్కర్ల స్పెషలిష్ట్ బూమ్రా అందుబాటులోకి వచ్చాడు. గత మ్యాచ్ విన్నర్ గ్రీన్ ఈ మ్యాచ్ లో త్వరగానే అవుట్ అయ్యాడు. అక్షర్ పటేల్ వేసిన 2వ ఓవర్లో గ్రీన్ ఇచ్చిన క్యాచ్ ను కోహ్లీ జారవిడిచాడు. కానీ అదే ఓవర్లో కోహ్లీ గ్రీన్(5) ను రనౌట్ చేసి బదులు తీర్చుకున్నాడు. మరో వైపు ఆసిస్ కెప్టెన్ ఫించ్ తన దూకుడును కొనసాగిస్తున్నాడు. ఈ క్రమంలో మరో సారి అక్షర్ భారత్ బ్రేక్ త్రూ ఇచ్చాడు. తన వరుస ఓవర్లలో మాక్స్ వెల్(0), టీమ్ డేవిడ్(2) ను అద్బుతమైన బాల్స్ తో బౌల్డ్ చేశాడు.
మరో వైపు ప్రమాదకరంగా మారుతున్న ఫించ్ 15 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్ తో 31 పరుగులు చేయగా.. బుమ్రా అద్భుతమైన యార్కర్ తో అతడిని బోల్తా కొట్టించాడు. ఈ మ్యాచ్ కు ఈ బాలే హైలెట్ అని చెప్పాలి. ఫించ్ పెవిలియన్ కు చేరే టైమ్ కి ఆసిస్ స్కోర్ 5 ఓవర్లకు 46/4 తో నిలిచింది. మిగిలింది 3 ఓవర్లే కాబట్టి జట్టు స్కోరు 70 పరుగులు చేరుతుందని అందరూ అనుకున్నారు. కానీ గత మ్యాచ్ ఫినిషర్ మాథ్యూ వేడ్ కేవలం 20 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్ లతో 43 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. చివరి బంతికి స్మిత్(8) రనౌట్ గా వెనుదిరిగాడు. దీంతో నిర్ణీత 8 ఓవర్లలో ఆసిస్ 5 వికెట్ల నష్టానికి 90 పరుగులు చేసింది. భారత బౌలర్లలో అక్షర్ పటేల్ 2 వికెట్లు తీయగా.. బుమ్రా ఒక వికెట్ పడగొట్టాడు.
అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన భారత ఓపెనర్లు రోహిత్-రాహులు తమ దూకుడును కొనసాగించారు. ముఖ్యంగా రోహిత్ శర్మ తొలి ఓవర్ లోనే హెజిల్ వుడ్ కు చుక్కలు చూపించాడు. వరుసగా రెండు సిక్సర్లు బాది.. తన స్ట్రాటజీ ఏంటో ప్రత్యర్థి బౌలర్ కు తెలియజేశాడు. రాహుల్ కూడా ఈ ఓవర్ లో ఓ కళాత్మకమైన సిక్స్ బాదాడు. దాంతో తొలి ఓవర్ లోనే టీమిండియా 20 పరుగులు పిండుకుంది. మంచి జోరుమీందుంది ఈ జోడీ అనుకునే లోపే జంపా అద్భుతమైన బాల్ తో కేఎల్ రాహుల్ (10) ను బౌల్డ్ చేశాడు. అనంతరం క్రీజ్ లోకి వచ్చిన కింగ్ కోహ్లీ సైతం 11 పరుగులకే జంపా బౌలింగ్ లో వెనుదిరిగాడు. అయినప్పటికీ రోహిత్ తన జోరును కొనసాగిస్తూనే జంపా, కమిన్స్ బౌలింగ్ లో సిక్స్ లు కొట్టాడు. సూర్య కుమారు(0), పాండ్య(9) తక్కువ పరుగులకే అవుట్ అయ్యారు. ఈ క్రమంలోనే మ్యాచ్ చివరి దశకు వచ్చింది.
ఈ దశలోనే టీమిండియా విజయానికి చివరి ఓవర్లో 9 పరుగులు అవసరం కాగ డాషింగ్ ఫినిషర్ డీకే డానియల్ సామ్స్ బౌలింగ్ లో తొలి రెండు బంతులను 6, 4 గా మలిచి టీమిండియాకు విజయాన్ని అందించాడు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ హీరో రోహిత్ శర్మ.. కేవలం 20 బంతుల్లోనే 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 46 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఆసిస్ బౌలర్లలో అడమ్ జంపా 3 వికెట్లతో సత్తా చాటాడు. ఇక నిర్ణయాత్మకమైన 3వ టీ20 హైద్రాబాద్ లో జరిగనుంది. మరి తుపాన్ ఇన్నింగ్స్ తో టీమిండియాకు విజయాన్ని అందించిన రోహిత్ శర్మపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
For his match-winning knock in the chase in the second #INDvAUS T20I, #TeamIndia captain @ImRo45 bags the Player of the Match award. 👏 👏
Scorecard ▶️ https://t.co/LyNJTtl5L3 pic.twitter.com/xihAY6wCA3
— BCCI (@BCCI) September 23, 2022
Captain @ImRo45‘s reaction ☺️
Crowd’s joy 👏@DineshKarthik‘s grin 👍
🎥 Relive the mood as #TeamIndia sealed a series-levelling win in Nagpur 🔽 #INDvAUS | @mastercardindia
Scorecard ▶️ https://t.co/LyNJTtl5L3 pic.twitter.com/bkiJmUCSeu
— BCCI (@BCCI) September 23, 2022