ప్రస్తుత జనరేషన్ లో బెస్ట్ క్రికెటర్ ఎవరు కోహ్లీ? రోహిత్ శర్మ?.. మీరు ఎవరికి ఓటేస్తారు అంటే ఇద్దరిలో ఎవరో ఒకరి పేరు కచ్చితంగా చెబుతారు. గత కొన్నాళ్ల నుంచి అంటే కెప్టెన్ అయిన తర్వాత రోహిత్ పూర్తిగా తడబడుతున్నాడు. కోహ్లీ మాత్రం గతేడాది జరిగిన ఆసియాకప్ నుంచి తిరిగి ఫామ్ లోకి వచ్చేశాడు. అడపాదడపా సెంచరీలు చేస్తూ ఫ్యాన్స్ కి కిక్ ఇస్తున్నాడు. ఇలాంటి టైంలో పాక్ క్రికెటర్.. కోహ్లీ-రోహిత్ ల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇప్పుడవి కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారి, హాట్ టాపిక్ అయ్యాయి.
ఇక విషయానికొస్తే.. ఒక్కసారి గతంలోకి వెళ్లి గత పదేళ్లలో టీమిండియా జట్టుని పరిశీలిస్తే ధోనీ లాంటి కెప్టెన్ గా మనం చూశాం. అలానే కోహ్లీ లాంటి అద్భుతమైన బ్యాటర్, రోహిత్ లాంటి అదిరిపోయే ఓపెనర్ భారత జట్టుకు వరంలా దొరికారు. ధోనీ రిటైర్మెంట్ తర్వాత కోహ్లీ కెప్టెన్ అయ్యాడు. విరాట్ కూడా కెప్టెన్సీలో తడబడేసరికి రోహిత్ కు పగ్గాలు అప్పగించారు. సారథ్యం గురించి పక్కనబెడితే.. ఎవరు బెస్ట్ అనేది ఎప్పటికీ తెగని ప్రాబ్లమే. ఎందుకంటే ఒకరు కోహ్లీ తోపు అంటే మరొకరు రోహిత్ తురుము అని అంటారు.
అయితే పాక్ తరఫున పలు మ్యాచులాడిన బౌలర్ సొహైల్ ఖాన్ మాత్రం.. ‘విరాట్ కోహ్లీ గ్రేట్ బ్యాటర్. కానీ రోహిత్ శర్మ అతడి కంటే అద్భుతమైన బ్యాటర్. టెక్నికల్ గా రోహిత్ చాలా బెటర్. ఎందుకంటే 10-12 ఏళ్ల నుంచి వరల్డ్ క్రికెట్ ని రూల్ చేశాడు. ఇంకా చాలా టైం కూడా ఉంది.’ అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం టీమిండియాలో కీలక ఆటగాళ్లయిన ఈ ఇద్దరికీ.. ఈ ఏడాది ఆస్ట్రేలియాతో బోర్డర్ గావస్కర్ ట్రోఫీ, ఆసియాకప్, వన్డే వరల్డ్ కప్ చాలా కీలకం. ఎందుకంటే జట్టులోకి కొత్త కుర్రాళ్లు చాలామంది వస్తున్నారు. ఒకవేళ కోహ్లీ, రోహిత్ ఏ మాత్రం విఫలమైనా సరే.. కుర్రాళ్లు వాళ్ల ప్లేసుల్లో సెటిలైపోవడం గ్యారంటీ. ఈ మధ్యే న్యూజిలాండ్ తో టీ20, వన్డేలాడిన మన జట్టు.. ఫిబ్రవరి 9 నుంచి మార్చి 22 మధ్య ఆస్ట్రేలియాతో నాలుగు టెస్టులు, మూడు వన్డేలు ఆడనుంది. మరి ఈ సిరీసుల్లో కోహ్లీ, రోహిత్ ఎలా ఫెర్ఫార్మ్ చేస్తారనేది చూడాలి. సరేగానీ కోహ్లీ, రోహిత్ లలో ఎవరు బెస్ట్ బ్యాటర్ అని మీరనుకుంటున్నారు. కింద కామెంట్స్ లో మీ అభిప్రాయాన్ని పోస్ట్ చేయండి.
“Virat Kohli is a great batter, but Rohit Sharma is even better than Kohli. Rohit is technically better, he plays late and has a lot of time. Rohit ruled world cricket for 10-12 years,” Pakistan bowler Sohail Khan.
— Farid Khan (@_FaridKhan) February 2, 2023