కెప్టెన్ రోహిత్ శర్మ.. గత కొంత కాలంగా సహనం కోల్పోతూ.. ఇతర ఆటగాళ్లపై నోరు పారేసుకుంటున్నాడు. తాజాగా తన అసహనాన్ని మరోసారి చూపించాడు. మైదానంలోకి వాటర్ ఇవ్వడానికి వచ్చిన ఇషాన్ కిషన్ ను కొట్టబోయాడు రోహిత్.
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా.. అహ్మదాబాద్ వేదికగా భారత్-ఆసిస్ మధ్య నాలుగో మ్యాచ్ ప్రారంభం అయింది. తొలిరోజు మ్యాచ్ లో ఆసిస్ పూర్తిగా ఆధిపత్యం చెలాయించింది. భారత బౌలర్లు ఎంతగా ప్రయత్నించినప్పటికీ వికెట్లు మాత్రం తీయలేకపోయారు. దాంతో తీవ్ర అసహనానికి లోనైన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ.. తన అసహనాన్ని ఇషాన్ కిషన్ పై చూపించాడు. మైదానంలోకి వాటర్ ఇవ్వడానికి వచ్చిన ఇషాన్ కిషన్ ను కొట్టబోయాడు రోహిత్. ప్రస్తుతం ఆ వీడియో వైరల్ గా మారింది. మరిన్ని వివరాల్లోకి వెళితే..
కెప్టెన్ రోహిత్ శర్మ.. గత కొంత కాలంగా సహనం కోల్పోతూ.. ఇతర ఆటగాళ్లపై నోరు పారేసుకుంటున్నాడు. గతంలో వాషిగ్టన్ సుందర్ ను బూతులు తిట్టిన రోహిత్.. అర్షదీప్, భువనేశ్వర్, డీకేలపై తన ఆగ్రహాన్ని చూపెట్టాడు. మరోసారి తన అసహనాన్ని చూపాడు రోహిత్. తాజాగా ఆసిస్ తో జరుగుతున్న కీలకమైన నాలుగో టెస్ట్ మెుదటి రోజులు ఈ సంఘటన జరిగింది. ఈ మ్యాచ్ లో ఇన్నింగ్స్ 60వ ఓవర్ ముగిసిన తర్వాత ఇషాన్ కిషన్ ఆటగాళ్ల కోసం వాటర్ బాటిల్స్ ను పట్టుకుని గ్రౌండ్ లోకి వచ్చాడు.
ఈ క్రమంలోనే ఓ బాటిన్ ను తీసుకుని రోహిత్ తాగుతుండగా.. మరికొన్ని బాటిల్స్ ను స్లిప్ లో ఉన్న ఫీల్డర్స్ కు పరిగెత్తుకెళ్లి ఇచ్చాడు ఇషాన్. తర్వాత అన్ని బాటిల్స్ ని కలెక్ట్ చేసుకున్న ఇషాన్.. వేగంగా పరిగెత్తుకు వచ్చి రోహిత్ దగ్గర బాటిల్ ను అందుకోబోయాడు. కానీ వేగం కారణంగా బాటిల్ చేతిలో చిక్కక కింద పడింది. దాంతో మళ్లీ వేగంగా వెనక్కి వచ్చిన ఇషాన్ కింద పడ్డ బాటిల్ ను అందుకుంటుండగా రోహిత్ అతడిని కొట్టేందుకు చేయి లేపాడు. ఇది గమనించిన ఇషాన్ తప్పించుకుని వేగంగా పరిగెత్తాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ప్రస్తుతం రోహిత్ వ్యవహరించిన తీరుపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
గతంలోనూ ఇలాగే రూడ్ గా బిహేవ్ చేశాడంటూ.. ఇంక మారవా? అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలిరోజు ఆధిపత్యం చెలాయించిన ఆసిస్.. ఆటముగిసే సమయానికి 4 వికెట్ల నష్టానికి 255 పరుగులు చేసింది. జట్టులో స్టార్ ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా సెంచరీతో కదం తొక్కాడు. 251 బంతులు ఎదుర్కొన్న ఖవాజా 15 ఫోర్లతో 104 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అతడికి తోడు గ్రీన్ 49 పరుగులతో క్రీజ్ లో ఉన్నాడు. భారత బౌలర్లలో షమీ రెండు వికెట్లు తీయగా.. అశ్విన్, జడేజాలు తలా ఓ వికెట్ పడగొట్టారు.
Indian Captain Rohit Sharma’s abusive behaviour with team mates is seen very frequently now, which was very rare under Virat’s Captaincy pic.twitter.com/OznrIB9GzC
— B` (@Bishh04) March 9, 2023