భారత్-దక్షిణాఫ్రికా మధ్య కేప్ టౌన్ వేదికగా జరుగుతున్న చివరి టెస్టు ఉత్కంఠభరితంగా మారింది. నాలుగో రోజు మ్యాచ్ ఫలితం తేలనుంది. కాగా ఆట మూడో రోజు ఒక ఫన్నీ అండ్ ఫ్రస్టెటెడ్ ఘటన ఒకటి చోటు చేసుకుంది. దక్షిణాఫ్రికా యువ పేసర్ మార్కో జాన్సన్ టీమిండియా బ్యాట్స్‌మెన్‌ను ఇబ్బంది పెట్టాడు. అయితే భారత్ నుంచి యువ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ రిషభ్ పంత్ కూడా ఈ లిస్టులో ఉన్నాడు. దక్షిణాఫ్రికా బౌలింగ్‌ను ధీటుగా ఎదుర్కొన్నాడు. ఈ సమయంలో, జాన్సన్, పంత్ చాలాసార్లు ముఖాముఖిగా తలపడ్డారు. ఇద్దరూ తమ సామర్థ్యాలను చూపించారు.
పంత్‌పై జాన్సన్ అతి కోపాన్ని ప్రదర్శించిన సందర్భం ఒకటి సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. దానికి పంత్ ‘ఒకే బంతిపై రెండు షాట్లు’ ఆడటం ద్వారా గట్టిగా సమాధానమిచ్చాడు. భారత ఇన్నింగ్స్‌లో అది 50వ ఓవర్. ఈ ఓవర్‌లో తొలి ఐదు బంతులను పంత్ సులువుగా ఆడాడు. ఆ తర్వాత ఓవర్ చివరి బంతికి పంత్ బౌలర్ వైపు తిరిగి డిఫెన్సివ్ పంచ్ ఆడాడు. ఈ సమయంలో, పంత్ తన షాట్ ఆడిన తర్వాత డిఫెన్సివ్ పొజిషన్‌లో ఉన్నాడు. క్రీజులో ఉన్నాడు. అయినా కూడా జాన్సన్ బంతిని పట్టుకున్న వెంటనే, కోపంతో పంత్ వైపు విసిరాడు. పంత్ కూడా తగిన సమాధానమిచ్చి, మళ్లీ ఆ బంతిని స్ట్రెయిట్ డ్రైవ్ ఆడాడు. పంత్ రియక్షన్‌పై వ్యాఖ్యాతలు కూడా నవ్వడం ప్రారంభించారు. భారత బ్యాట్స్‌మెన్‌ను ప్రశంసించారు.
కాగా 198 పరుగులకు భారత్ ఆలౌట్ అయింది. దీంతో సౌతాఫ్రికా ముందు 212 పరుగుల టార్గెట్ ఉంది. భారత ఇన్నింగ్స్‌లో రిషభ్ పంత్ 100* నాటౌట్‌గా నిలిచి కీలక ఇన్నింగ్స్ ఆడాడు. పంత్ దక్షిణాఫ్రికాలో తన తొలి సెంచరీని నమోదు చేసుకున్నాడు.
Well Played Rishabh Pant❤️🔥 #Rishabpant #SAvIND what a 💯🔥.The Best Wk Batsmen in The World Cricket Right Now🔥 @RishabhPant17 pic.twitter.com/m2T0rPsYJz
— Rishabh VIJAY✨️ (@VJ__416) January 13, 2022