టీమిండియా వికెట్ కీపర్ డాషింగ్ బ్యాటర్ రిషబ్ పంత్ గతేడాది రోడ్డు ప్రమాదంలో గాయపడిన సంగతి తెలిసిందే. ఉత్తరాఖండ్ నుంచి ఢిల్లీ వస్తుండగా కారు డివైడర్ ని ఢీకొనడంతో పంత్ కి తీవ్ర గాయాలయ్యాయి. ఇదిలా ఉండగా.. పంత్ ఇప్పుడు ప్రాక్టీస్ కూడా మొదలు పెట్టాడు. అప్పుడే పంత్ ప్రాక్టీస్ మొదలు పెట్టడం ఏంటనుకుంటున్నారా? అయితే కింద చదివేయాల్సిందే.
టీమిండియా వికెట్ కీపర్, డాషింగ్ బ్యాటర్ రిషబ్ పంత్ గతేడాది రోడ్డు ప్రమాదంలో గాయపడిన సంగతి తెలిసిందే. ఉత్తరాఖండ్ నుంచి ఢిల్లీ వస్తుండగా కారు డివైడర్ ని ఢీకొనడంతో పంత్ కి తీవ్ర గాయాలయ్యాయి. అయితే అదృష్టం బాగుండి ప్రాణాలతో బయట పడ్డ పంత్ చికిత్స తీసుకొని వేగంగా కోలుకుంటున్నాడు. ఈ క్రమంలో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీతో పాటు ఐపీఎల్ కి కూడా దూరమయ్యాడు. అలాగే ఆసియా కప్, వరల్డ్ కప్ ఆడేది కూడా అనుమానంగా మారింది. ఇదిలా ఉండగా.. పంత్ ఇప్పుడు ప్రాక్టీస్ కూడా మొదలు పెట్టాడు. అప్పుడే పంత్ ప్రాక్టీస్ మొదలు పెట్టడం ఏంటనుకుంటున్నారా? అయితే కింద చదివేయాల్సిందే.
పంత్ కి గాయాలైన ఆ బాధ కళ్ళల్లో ఎప్పుడూ కనిపించలేదు. ఎప్పుడూ నవ్వుతూ కనిపిస్తూ చాలా ప్రశాంతంగా కనిపిస్తాడు. అందుకేనేమో పంత్ చాలా వేగంగా కోలుకుంటున్నాడు. గాయమైనా.. ఎప్పటికప్పుడు తన హెల్త్ అప్ డేట్ ఎలా ఉందో సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకుంటున్నాడు యంగ్ ప్లేయర్. చాలాసార్లు ఇంస్టాగ్రామ్, ట్విట్టర్ లో సందడి చేసిన పంత్ తాజాగా ఇప్పుడు ప్రాక్టీస్ చేస్తూ కనిపించాడు. అయితే పంత్ ప్రాక్టీస్ చేసేది గ్రౌండ్ లో అనుకుంటే పొరబాటే అవుతుంది. బెంగళూరులోని NCA లో టేబుల్ టెన్నిస్ ఆడుతూ కనిపించాడు. నవ్వుతూ చాలా సరదాగా పంత్ ఇలా ఆడడం చూస్తుంటే ఎలాంటి గాయాలు లేకుండా చాలా నార్మల్ గా ఉన్నట్లుగా అనిపిస్తుంది. ప్రస్తుతం ఈ వీడియోని ట్విట్టర్లో పోస్ట్ చేయగా వైరల్ అవుతుంది. మరి పంత్ త్వరలోనే పూర్తిగా కోలుకొని టీమిండియాకు ఆడాలని కోరుకుందాం. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలపండి.