SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » sports » Rishabh Pant Created 6 New Records By Century Against England

Rishabh Pant: ఇంగ్లండ్‌పై సెంచరీతో రికార్డుల పంట పండించిన రిషభ్‌ పంత్‌!

  • Written By: Sayyad Nag Pasha
  • Published Date - Sat - 2 July 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Rishabh Pant: ఇంగ్లండ్‌పై సెంచరీతో రికార్డుల పంట పండించిన రిషభ్‌ పంత్‌!

బర్మింగ్‌హామ్‌ వేదికగా భారత్‌-ఇంగ్లండ్‌ మధ్య జరుగుతున్న టెస్టులో రిషభ్‌పంత్‌ అద్భుతమైన ఇన్నింగ్స్‌ ఆడాడు. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ను ఆరంభంలో ఇంగ్లండ్‌ బౌలర్లు కట్టడి చేశారు. వారి ధాటికి టీమిండియా 98 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో మునిగిపోయింది. ఈ దశలో రిషభ్‌ పంత్‌-జడేజా టీమిండియాను ఆదుకున్నారు. ముఖ్యంగా పంత్‌ తన ఎటాకింగ్‌ ప్లేతో ఇంగ్లండ్‌ బౌలర్లకు చుక్కలు చూపించాడు. 111 బంతుల్లో 20 ఫోర్లు, 4 సిక్సులతో 146 పరుగులు చేసి దుమ్ములేపాడు. దీంతో టీమిండియా తొలి రోజు ఆట ముగిసే సమయానికి 7 వికెట్లు కోల్పోయి 336 పరుగులు చేసి పటిష్టంగా నిలిచింది. రెండు రోజు మరిన్ని పరుగులు జోడిస్తే.. మ్యాచ్‌ను శాసించే స్థాయి చేరుకుంటుంది.

ఇక మ్యాచ్‌లో అసాధారణ ఆటతీరుతో సెంచరీ సాధించిన పంత్‌ పలు రికార్డులను కొల్లగొట్టాడు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా అరడజన్‌పైగా రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. టెస్టుల్లో 2000 పరుగులు పూర్తి చేసుకున్న యంగెస్ట్‌ వికెట్‌ కీపర్‌గా నిలిచాడు. అలాగే అవుట్‌ సైడ్‌ ఆఫ్‌ ఆసియా దేశాల్లో అత్యధిక సెంచరీలు చేసిన వికెట్‌ కీపర్‌గా పంత్‌ రికార్డు సృష్టించాడు. పంత్‌ మొత్తం 5 సెంచరీలు టెస్టుల్లో చేయగా.. వాటిలో నాలుగు ఆసియేతర దేశాల్లో చేసినవే. ఫాస్టెస్ట్‌ సెంచరీ చేసిన వికెట్‌ కీపర్‌గా పంత్‌ కొత్త చరిత్రను లిఖించాడు. టెస్టుల్లో వేగంగా 2000 పరుగులు పూర్తి చేసిన ఇండియన్‌ వికెట్‌ కీపర్‌ కూడా పంతే. అలాగే ఇండియా తరపున ఆసియేతర దేశాల్లో వేగవంతమైన సెంచరీ చేసిన క్రికెటర్‌గా పంత్‌ నిలిచాడు. అలాగే ఎడ్జ్‌బాస్టన్‌లో వేగవంతమైన సెంచరీ రికార్డు కూడా పంత్‌ పేరిట లిఖించబడింది. ఇలా ఇంగ్లండ్‌పై చేసిన సెంచరీతో పంత్‌.. టీమిండియాను రక్షించడమే కాకుండా తన ఖాతాలో కూడా అరుదైన రికార్డులు నమోదు చేసుకున్నాడు.

 

Pant

ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాకు శుభారంభం దక్కలేదు. జేమ్స్ అండర్సన్ ధాటికి ఓపెనర్లు శుభ్‌మన్ గిల్(17), చతేశ్వర్ పుజారా(13)లు క్యాచ్‌ ఔట్‌గా వెనుదిరిగారు. అనంతరం క్రీజులోకి హనుమ విహారి, విరాట్ కోహ్లీ రాగా.. మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించింది. దాంతో అంపైర్లు ఆటను నిలిపేసి నిర్ణీత సమయం కన్నా ముందుగానే లంచ్ బ్రేక్‌ను ప్రకటించారు. దాంతో భారత్ 20.1 ఓవర్లలో 53/2 స్కోర్‌తో లంచ్ బ్రేక్‌కు వెళ్లింది. వర్షం ఆగిపోయిన అనంతరం ఆట మొదలైంది. వర్షం కారణంగా వృథా అయిన 40 నిమిషాలను అంపైర్లు పొడిగించారు.

ఇక సెకండ్ సెషన్‌ ప్రారంభంలోనే భారత్‌కు గట్టి షాక్ తగిలింది. మ్యాటీ పోట్స్ తన వరుస ఓవర్లలోనే భారత్‌కు దిమ్మతిరిగే షాకిచ్చాడు. క్రీజులో సెట్ అయినట్లు కనిపించిన హనుమ విహారి(20)ని వికెట్ల ముందు బోల్తా కొట్టించిన మ్యాటీ.. ఆ మరుసటి ఓవర్‌‌లోనే విరాట్‌ కోహ్లీని క్లీన్ బౌల్డ్ చేశాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన శ్రేయస్ అయ్యర్ బౌండరీలతో దూకుడు కనబర్చాడు. కానీ అండర్సన్ బౌలింగ్‌లో కీపర్ క్యాచ్‌గా 15 పరుగులు చేసి ఔటయ్యాడు. దాంతో 98 పరుగులకే టీమిండియా ఐదు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చిన రిషభ్ పంత్.. రవీంద్ర జడేజాతో కలిసి జట్టును ఆదుకున్నాడు. తొలుత కాస్త నిదానంగా ఆడిన ఈ ద్వయం అనంతరం జోరు పెంచింది. పంత్ తనదైన శైలిలో బౌలర్లపై విరుచుకుపడి స్కోర్ బోర్డును పరుగెత్తించాడు.

Pant

పంత్ సూపర్ బ్యాటింగ్‌తో భారత్ 44 ఓవర్లలో 174/5 స్కోర్‌తో సెకండ్ సెషన్ ముగించింది. ఆ తర్వాత మరింత ధాటిగా ఆడగా.. జడేజా అతనికి అండగా నిలుస్తూ స్ట్రైక్ రొటేట్ చేశాడు. పంత్ 89 బంతుల్లో సెంచరీ మార్క్ అందుకున్నాడు. బ్రాడ్ వేసిన 58వ ఓవర్ తొలి బంతికి క్విక్ సింగిల్ తీసిన పంత్.. టెస్ట్ క్రికెట్‌ కెరీర్‌లో నాలుగో సెంచరీ తన ఖాతాలో వేసుకున్నాడు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్‌ 73 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 338 పరుగులు చేసింది. క్రీజ్‌లో జడేజా 83, మొహమ్మద్‌ షమీ(0) క్రీజ్‌లో ఉన్నారు. ఇంగ్లండ్‌ బౌలర్లలో జేమ్స్‌ అండర్సన్‌ 3, మ్యాటీ పోట్స్ 2, బెన్‌స్టోక్స్‌, జో రూట్‌ తలో వికెట్‌ తీసుకున్నారు. మరి పంత్‌ బ్యాటింగ్‌పై, నమోదు చేసిన రికార్డులపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

𝐀𝐮𝐝𝐚𝐜𝐢𝐨𝐮𝐬. 𝐑𝐞𝐜𝐨𝐫𝐝-𝐛𝐫𝐞𝐚𝐤𝐞𝐫. 𝐏𝐢𝐨𝐧𝐞𝐞𝐫 💪🏼#ENGvIND @RishabhPant17 pic.twitter.com/4Gyj4hy2BT

— Delhi Capitals (@DelhiCapitals) July 2, 2022

Tags :

  • England
  • India
  • Latest Cricket News
  • Rishabh Pant
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

జయహో భారత్.. జాబిల్లిని ముద్దాడిన చంద్రయాన్ 3

జయహో భారత్.. జాబిల్లిని ముద్దాడిన చంద్రయాన్ 3

  • Harry Brook: హ్యారీ బ్రూక్ విధ్వంసకర శతకం! ఇప్పుడు బాధపడి ఏం లాభం..?

    Harry Brook: హ్యారీ బ్రూక్ విధ్వంసకర శతకం! ఇప్పుడు బాధపడి ఏం లాభం..?

  • Rishabh Pant: రీ ఎంట్రీకి సిద్ధమైన పంత్! టీమిండియాలోకి అడుగు పెట్టేది ఎప్పుడంటే..?

    Rishabh Pant: రీ ఎంట్రీకి సిద్ధమైన పంత్! టీమిండియాలోకి అడుగు పెట్టేది ఎప్పుడంటే..?

  • World Cup 2023: వరల్డ్ కప్ ముందు ఇంగ్లాండ్ కి గ్రేట్ న్యూస్! రిటైర్మెంట్ వెనక్కి తీసుకున్న స్టార్ ప్లేయర్

    World Cup 2023: వరల్డ్ కప్ ముందు ఇంగ్లాండ్ కి గ్రేట్ న్యూస్! రిటైర్మెంట్ వెనక్కి తీసుకున్న స్టార్ ప్లేయర్

  • ‘హర్ ఘర్ తిరంగ’ కార్యక్రమంలో సీమా హైదర్.. పాకిస్తాన్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు

    ‘హర్ ఘర్ తిరంగ’ కార్యక్రమంలో సీమా హైదర్.. పాకిస్తాన్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam