భారత్ -పాకిస్తాన్ క్రికెట్ బోర్డుల మధ్య ముదిరిన వైరం శ్రీలంక క్రికెట్ బోర్డుకు తలనొప్పిగా మారింది. ఒకరికి మద్దతివ్వడం మరొకరికి నచ్చడం లేదు. ఈ క్రమంలో శ్రీలంక క్రికెట్ బోర్డుకు బెదిరింపులు వస్తున్నాయి.
‘ఆసియా కప్ 2023‘ నిర్వహణపై సందిగ్ధత వీడడం లేదు. వాస్తవానికి ఈ టోర్నీ పాకిస్తాన్ వేదికగా జరగాల్సి ఉన్నా.. భద్రతా కారణాల రీత్యా పాక్ లో పర్యటించడం కుదరదని భారత్ చెప్పడంతో ఈ వివాదం మొదలయింది. అందుకు అంగీకరించని పాక్, అదే జరిగితే త్వరలో భారత్ వేదికగా జరగబోయే వన్డే వరల్డ్ కప్ 2023లో పాల్గొనబోమని స్పష్టం చేసింది. ఆనాటి నుంచి ఇరుదేశాల క్రికెట్ బోర్డుల మధ్య వైరం మరింత పెరిగింది. దీనికితోడు శ్రీలంక, బంగ్లాదేశ్ కూడా పాక్ పర్యటనకు అభ్యంతరం చెప్పడంతో టోర్నీ ఉనికి ప్రశ్నార్థకంగా మారింది. ఈ పరిస్థితులలో బీసీసీఐకి మద్దతు ఇచ్చిన శ్రీలంక క్రికెట్ బోర్డు పట్ల పాక్ క్రికెట్ బోర్డు(పీసీబీ) బెదిరింపుల ధోరణి అవలంబిస్తోంది.
ఆసియా కప్ 2023ను ఎలాగైనా తమ దేశంలో నిర్వహించేందుకు విశ్వ ప్రయత్నం చేస్తున్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) హైబ్రిడ్ మోడల్ ప్రతిపాదనను తెచ్చింది. దీని ప్రకారం భారత్ ఆడబోయే మ్యాచులన్నీ యూఏఈ వేదికగా నిర్వహిస్తామని తెలిపింది. అయితే అందుకు శ్రీలంక, బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డులు అంగీకరించలేదు. సెప్టెంబరులో యుఎఈలో తీవ్రమైన వేసవి పరిస్థితులు ఉంటాయి కనుక శ్రీలంక ఈ ప్రతిపాదనను తిరస్కరించింది. దీంతో పీసీబీకి ఏం చేయాలో అర్థమవ్వడం లేదు. ఇక ఏసీసీ, బీసీసీఐలను బెదిరించినా లాభం లేదనుకున్నా పీసీబీ, శ్రీలంక క్రికెట్ బోర్డుకు ధమ్కీ ఇచ్చినట్లు వార్తలొస్తున్నాయి. ఒకవేళ తాము ప్రతిపాదించిన హైబ్రిడ్ మోడల్ ను అంగీకరించకుంటే ఈ ఏడాది జులైలో శ్రీలంక పర్యటనకు రాబోమని పీసీబీ వర్గాలు తేల్చి చెప్పినట్టు సమాచారం.
Asia Cup 2023 current situation 😅#AsiaCup2023 #AsiaCup pic.twitter.com/vb2C4feFDP
— Ashutosh Srivastava (@imAshutosh08) May 10, 2023
“ఒకవేళ శ్రీలంక జట్టు ఆసియా కప్ 2023 నిర్వహణకై తాము ప్రతిపాదించిన హైబ్రిడ్ మోడల్ ను తిరస్కరిస్తే, పాక్ జట్టు జూలైలో లంక పర్యటనకు రాబోదని పీసీబీ వర్గాలు శ్రీలంక క్రికెట్ బోర్డుకు చెప్పినట్లు పాక్ మీడియా కథనాన్ని ప్రచురించింది. ఐసీసీ ఫ్యూచర్ టూర్ ప్రోగ్రామ్ లో భాగంగా.. పాకిస్తాన్ జట్టు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2023-2025 సైకిల్ లో శ్రీలంకతో రెండు టెస్టులు ఆడాల్సి ఉంది. ఆ సిరీస్ ను బహిష్కరిస్తామని చెప్తోంది. ఈ వార్తలపై శ్రీలంక క్రికెట్ బోర్డు స్పందించాల్సి ఉంది. పీసీబీ మాదిరిగానే లంక క్రికెట్ పరిస్థితి కూడా అంతంత మాత్రమే. దేశంలో ఆర్థిక అత్యవసర పరిస్థితి నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ఆ దేశం.. పీసీబీ బెదిరింపులను ఎలా ఎదుర్కుంటున్నదన్నది తెలియాల్సి ఉంది. పాక్ బెదిరింపులపై, మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
The Pakistan cricket team has issued a threat to boycott the upcoming two-match Test series against Sri Lanka in July. The boycott is contingent upon Sri Lanka Cricket’s opposition to the hybrid model proposed by the Pakistan Cricket Board for the Asia Cup in 2023. pic.twitter.com/OPEZufc61T
— Startup Pakistan (@PakStartup) May 16, 2023