టీమిండియా స్టార్ క్రికెటర్, వరల్డ్ నంబర్ వన్ టెస్ట్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా ఒక ఆసీస్ క్రికెటర్ కోసం తన రూల్స్‌ను బ్రేక్ చేశాడు. తొలి ఒక వ్యక్తిని ఫాలో అవుతున్నాడు.
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భారత స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా జోరు ఓ రేంజ్‌లో ఉంది. గాయం నుంచి కోలుకున్న తర్వాత జట్టులోకి వచ్చి అంచనాలకు మించి రాణిస్తున్నాడు. బౌలింగ్, బ్యాటింగ్‌లో అదరగొడుతూ కంగారుల కంటి మీద కునుకు లేకుండా చేశాడు. తన ప్రదర్శనతో మైదానంలోనే కాదు సోషల్ మీడియాలో కూడా జడేజా ఇప్పుడు ట్రెండ్ అవుతున్నాడు. ఆస్ట్రేలియన్ స్పిన్నర్ నాథన్ లయన్ కూడా ఈ ట్రెండింగ్లో భాగమయ్యాడు. అతని కోసం జడేజా తన రూల్స్‌ను పక్కనపెట్టి మరీ.. లయన్ కోరిక తీర్చాడు.
సోషల్ మీడియాలో జడేజాకు ఫాలోయింగ్ మాములుగా లేదు. ఇన్‌స్టాగ్రామ్‌లో దాదాపు 5 మిలియన్ల మంది జడేజాను ఫాలో అవుతున్నారు. కానీ జడేజా మాత్రం తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక్కరిని కూడా ఫాలో చేయకపోవడం విశేషం. వినడానికి విడ్డూరంగా ఉన్నా ఈ విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. వివరాల్లోకి వెళ్తే.. ఢిల్లీలో జరిగిన రెండో టెస్టు సందర్భంగా జడేజా తో లయన్ మాట్లాడుతూ “నువ్వు ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక్కర్ని కూడా ఫాలో అవ్వట్లేదు అని నాకు తెలుసు. అయినా కూడా నువ్వు నన్ను ఫాలో అవుతావని వెయిట్ చేస్తున్నా. నువ్వు నన్ను ఫాలో చేస్తావా”? అని అడిగాడు. వీరి మాటలు కాస్త స్టంప్ మైకులో రికార్డ్ అయ్యాయి. అయితే మ్యాచ్ ముగిసిన అనంతరం జడేజా.. లయన్ కోరిక తీర్చాడు. ఇన్‌స్టా నాథన్ లయన్‌ను ఫాలో చేసి అందర్నీ ఆశ్చర్యపరిచాడు.
దీనితో ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో అవుతున్న తొలి వ్యక్తిగా లయన్ నిలిచాడు. అయితే అతన్ని కేవలం 24 గంటలే ఫాలో అవుతున్నాను చెప్పి అని అందరికి షాక్ ఇచ్చాడు జడేజా. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట్లో వైరల్ గా మారింది. లయన్ కోరిక మేరకు అతన్ని కొన్ని గంటలు ఫామ్ చేయడం చేసి ఆ తర్వాత ఎవరిని ఫాలో కావద్దు అనే తన నిబంధనకు కట్టుబడి ఉన్నాడు జడేజా.ఈ సంగతి అటుంచితే.. ఢిల్లీలో జరిగిన టెస్టులో జడేజా రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 10 వికెట్లు తీసుకున్నాడు. ఒక్క రెండో ఇన్నింగ్స్‌లోనే ఏకంగా 7 వికెట్లతో చెలరేగి.. కేవలం ఒక్క వికెట్ కోల్పోయి 61 పరుగుల ఓవర్‌నైట్ స్కోర్‌తో మూడో రోజు ప్రారంభించిన ఆసీస్‌ను 113 పరుగులకే కుప్పకూల్చాడు. ఈ ప్రదర్శనతో తన కెరీర్లో అత్యుత్తమ గణాంకాలను నమోదు చేసుకున్నాడు. మరి రెండు టెస్టులో జడేజా ప్రదర్శనతో పాటు.. జడేజా-లయన్ మధ్య ఈ ఇన్‌స్టాగ్రామ్ వ్యవహారంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Ravindra Jadeja is only following Nathan Lyon for 24 hours. pic.twitter.com/tAbAyI8LjZ
— Mufaddal Vohra (@mufaddal_vohra) February 19, 2023