ప్రస్తుతం ప్రపంచ క్రికెట్‌లో విరాట్ కోహ్లీ గొప్ప క్రికెటర్‌గా ఉన్నాడు. చాలా మంది యువ క్రికెటర్లకు అతనో క్రికెట్ టెక్ట్స్‌బుక్. అనేక మంది క్రికెటర్లు కోహ్లీలా ఆడాలని, అతనిలా అవ్వాలని కలలు కంటూ ఉంటారు. అయితే ఎవరికి వారు అలా అనుకోవడంలో తప్పులేదు. కానీ.. రవిచంద్రన్ అశ్విన్ లాంటి స్టార్ క్రికెటర్, మరో క్రికెటర్‌ను చూసి.. ఇతను విరాట్ కోహ్లీ అంత గొప్ప ప్లేయర్ అవుతాడని అనుకోవడం నిజంగా విశేషమే. అది కూడా తన తొలి మ్యాచ్‌లోనే అశ్విన్ లాంటి మాస్టర్ మైండ్ క్రికెటర్‌కు అలా అనిపించాడంటే కచ్చితంగా అతనిలో విషయం ఉండే తీరాలి. మరి ఆ విషయం ఉన్న క్రికెటర్ ఎవరో మీకూ తెలుసుకోవాలని ఉంది కదూ.. ఆ ప్లేయర్ ఎవరో కాదు.. బంగ్లాదేశ్ పరిమిత ఓవర్ల కెప్టెన్, ఓపెనర్ లిట్టన్ దాస్.
ఈ బంగ్లాదేశీ ఓపెనర్‌ను అతని డెబ్యూ టెస్టులో ఆడిన ఆటను చూసిన అశ్విన్.. ఇతను విరాట్ కోహ్లీ, స్టీవ్ స్మిత్, జో రూట్, కేన్ విలియమ్సన్ అంతటి గొప్ప క్రికెటర్‌గా ఎదిగి, బంగ్లాదేశ్ క్రికెట్‌ను మరింత ముందుకు నడిపిస్తాడని అనిపించిందంటా.. ఈ విషయాన్ని అశ్వినే స్వయంగా తన య్యూటూబ్ ఛానెల్‌లో వెల్లడించాడు. ఇటివల బంగ్లాదేశ్‌తో టీమిండియా మూడు వన్డేలు, రెండు టెస్టు మ్యాచ్‌లు ఆడిన విషయం తెలిసిందే. వన్డే సిరీస్‌ను 1-2తో కోల్పోయిన టీమిండియా.. టెస్ట్ సిరీస్‌లో బంగ్లాను వైట్‌వాష్ చేసింది. అయితే రెండో టెస్టులో 145 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు టీమిండియా తీవ్రంగా శ్రమించిన విషయం తెలిసిందే. శ్రేయస్ అయ్యర్ మినహా బ్యాటర్లంతా విఫలమైనా.. రవిచంద్ర అశ్విన్ 42 పరుగులతో విరోచితంగా పోరాడి టీమిండియాను గెలిపించాడు.
అయితే.. అశ్విన్ బ్యాటింగ్‌కు రావడానికి ముందు మూడో రోజు ఆట ముగిసిన తర్వాత.. హోటల్‌లో జరిగిన సంఘటన గురించి చెబుతూ.. ‘స్వింగ్‌ఫూల్ వద్దకు వెళ్లినప్పుడు అక్కడ లిట్టన్ దాస్, మెహిదీ హసన్ స్విమ్ చేస్తున్నారు. వాళ్లు బెంగాళీలో నన్ను ఏదో ఒకటి అంటారని అనుకున్నా.. కానీ వారిద్దరూ ఎంతో మంచిగా వెల్‌కమ్ అశ్ భాయ్ అంటూ పలకరించారు. అయితే.. మూడో రోజే నైట్ వాచ్‌మెన్‌గా బ్యాటింగ్‌కు వస్తావని అనుకున్నాం. కానీ నువ్వు రాలేదు.. సరే నాలుగో రోజైనా వస్తావుగా అంటూ నన్ను మెల్లగా స్లెడ్జ్ చేయడం మొదలుపెట్టారు. మీర్‌పూర్ పిచ్‌పై చిన్న లక్ష్యమైనా ఛేజ్ చేయడం చాలా కష్టమని అన్నారు. దానికి నేను 35 ఓవర్లు గడిస్తే.. బ్యాటింగ్ చేయొచ్చులే అని చెప్పా. అయినా.. మాపై టెస్ట్ గెలిచి చరిత్ర సృష్టించబోతున్నారుగా.. కంగ్రాట్స్ అని చెప్పా. దానికి వాళ్లు.. లేదులే అశ్ భాయ్ మీ బ్యాటింగ్ లైనప్ పటిష్టంగా ఉంటుంది ఆ విషయం మాకు తెలుసు.. మీపై గెలవడం అంత సులవైన విషయం కాదు అన్నారు.’ అని అశ్విన్ వెల్లడించాడు. ఈ సంభాషన గురించి చెబుతూ.. లిట్టన్ దాస్‌తో నువ్వు.. విరాట్ కోహ్లీ, స్టీవ్ స్మిత్, జో రూట్, కేన్ విలియమ్సన్ అంతటి గొప్ప క్రికెటర్‌గా ఎదుగుతావు అనుకున్నా.. కానీ నువ్వు నిరాశ పరుస్తున్నావ్ అని చెప్పినట్లు పేర్కొన్నాడు. మరి అశ్విన్ లిట్టన్ దాస్‌పై పెట్టుకున్న నమ్మకంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Ashwin got second here, dangerous looking Litton Das gone, good to see Ashwin is atleast now getting wickets, we need him to be at his absolute best come BGT #CricketTwitter #BANvIND
— Yashraj (@Yashrbh) December 22, 2022