క్రీడల్లో రాణించిన వారందరూ బాగా సెటిల్ అవుతారని ఓ అపోహ ఉంది. ప్లేయర్ల దగ్గర డబ్బు, ఐశ్వర్యం ఉంటుందని అనుకుంటారు. అయితే అంతర్జాతీయ స్థాయిలో నిలకడగా రాణిస్తే తప్ప ఆటగాళ్లు బాగా సెటిల్ అవుతారని చెప్పలేం. కొందరు ప్లేయర్లు లీగ్స్‌లో ఆడి బాగా సంపాదిస్తున్నారు. ఇంకొందరు జాతీయ స్థాయిలో రాణించి, ఉద్యోగం తెచ్చుకుని జీవితంలో సెటిలవుతున్నారు. కానీ కొందరి విషయంలో మాత్రం ఏదీ కలసి రాదు. ఎంత బాగా ఆడినా ఉద్యోగం రాక.. చివరికి ఏదో ఒక పని చేసుకుని బతుకు బండిని లాగుతున్నారు. అలాంటి ఆటగాడే పంజాబ్ హాకీ ప్లేయర్ పరమ్‌జీత్. రాష్ట్రస్థాయిలో పంజాబ్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన పరమ్‌జీత్ ప్రస్తుతం దీనస్థితిలో జీవనం గడుపుతున్నాడు. జాతీయ మీడియా ద్వారా ఈ విషయం వెలుగులోకి రావడంతో పంజాబ్ సీఎం భగవంత్ మాన్ స్పందిచారు. పరమ్‌జీత్‌కు ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని ఆయన హామీ ఇచ్చారు.
పంజాబ్ హాకీ జట్టుకు 2004 నుంచి 2015 వరకు ఆడిన పరమ్‌జీత్.. 11 ఏళ్ల కెరీర్‌లో ఎన్నో సక్సెస్‌లను రుచిచూశాడు. అద్భుతమైన ఆటతీరుతో జట్టుకు మర్చిపోలేని విజయాలను అందించాడు. అయితే, మణికట్టు గాయంతో అతడు ఆటకు దూరమయ్యాడు. ఆ తర్వాత ఆర్థిక సమస్యలు చుట్టుముట్టడంతో కుటుంబాన్ని పోషించడానికి రోజువారీ కూలీగా మారాడు. గోధుమ బస్తాలు మోస్తూ జీవనోపాధి పొందుతున్నాడు పరమ్‌జీత్. ఇటీవల ఓ నేషనల్ మీడియా అతడి దీనగాథను వెలుగులోకి తీసుకొచ్చింది. ఇది తన దృష్టికి రావడంతో సీఎం భగవంత్ మాన్ స్పందించారు. పరమ్‌జీత్‌కు గవర్నమెంట్ జాబ్ ఇస్తామని ఆయన హామీ ఇచ్చారు. అతడ్ని దగ్గరకు పిలిపించుకుని భరోసానిచ్చారు.
గత ప్రభుత్వాలు పరమ్‌జీత్‌కు అండగా ఉండలేదని పంజాబ్ సీఎం భగవంత్ మాన్ అన్నారు. ఇక నుంచి అతడి కష్టాలు తొలగిపోతాయన్నారు. క్రీడా శాఖలో పరమ్‌జీత్‌కు ఉపాధి కల్పిస్తామని చెప్పారు. క్రీడల్లో పంజాబ్‌ను మళ్లీ నంబర్ వన్ చేయడమే తమ లక్ష్యమని భగవంత్ మాన్ పేర్కొన్నారు. ఇక, సీఎం హామీపై పరమ్‌జీత్ స్పందించారు. కోచ్‌గా జాబ్ చేసే చాన్స్ రావడం తనకు లభించిన గొప్ప అవకాశమని, ఇది తన జీవితాన్ని మార్చే అంశమని హర్షం వ్యక్తం చేశాడు. ప్రతిభ ఉన్న యువ ఆటగాళ్లను సానబెడతానని.. హాకీని మెరుగుపర్చడమే ధ్యేయంగా పెట్టుకున్నానని వివరించాడు. మరి.. దీనస్థితిలో ఉన్న ఓ ఆటగాడికి స్వయంగా సీఎం పిలిచి ఉద్యోగం ఇస్తానని హామీ ఇవ్వడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ਫ਼ਰੀਦਕੋਟ ਜ਼ਿਲ੍ਹੇ ਦੇ ਨੈਸ਼ਨਲ ਹਾਕੀ ਖਿਡਾਰੀ ਪਰਮਜੀਤ ਸਿੰਘ,ਜੋ ਸਰਕਾਰਾਂ ਦੀ ਅਣਗਹਿਲੀ ਦਾ ਸ਼ਿਕਾਰ ਨੇ ਤੇ ਹੁਣ ਮਜ਼ਦੂਰੀ ਕਰਕੇ ਗੁਜ਼ਾਰਾ ਕਰ ਰਹੇ ਨੇ…ਪਰਮਜੀਤ ਨੂੰ ਮਿਲਣ ਲਈ ਸੱਦਿਆ ਤੇ ਹਾਕੀ ਦੇ ਕੋਚ ਵਜੋਂ ਭਰਤੀ ਕਰਨ ਦਾ ਭਰੋਸਾ ਦਿੱਤਾ…ਜਲਦ ਹੀ ਕਾਗਜ਼ੀ ਕੰਮ ਪੂਰਾ ਕਰਕੇ ਨੌਕਰੀ ਦੇਵਾਂਗੇ…ਖਿਡਾਰੀਆਂ ਦਾ ਮਾਣ-ਸਨਮਾਨ ਕਰਨਾ ਸਾਡਾ ਫ਼ਰਜ਼ ਹੈ… pic.twitter.com/XDSxx92Gwu
— Bhagwant Mann (@BhagwantMann) February 2, 2023