ఈ మద్య కాలంలో పలు చిత్రపరిశ్రమల్లో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. తాము ఎంతగానో అభిమానించే నటీనటులు కన్నుమూసిన వార్త తెలిసిన అభిమానులు దుఖఃసాగరంలో మునిగిపోతున్నారు.
దేశ రాజకీయాల్లో విషాదం నెలకొంది. రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కన్నుమూశారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం తుదిశ్వాస విడిచారు. ఆయన మృతిపట్ల ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా ఉన్న రాజకీయ నాయకులు, ప్రముఖులు, ముఖ్యమంత్రులు సంతాపం తెలియజేశారు.
ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కూతురు సహా పలువురు భారతీయ విద్యార్థులకు బెదిరింపులు వెళ్లాయి. స్టూడెంట్స్‌ను చంపేస్తామంటూ ఒక గ్రూప్ వార్నింగ్ ఇచ్చింది. పూర్తి వివరాలు మీ కోసం..
క్రీడల్లో రాణించిన వారందరూ బాగా సెటిల్ అవుతారని ఓ అపోహ ఉంది. ప్లేయర్ల దగ్గర డబ్బు, ఐశ్వర్యం ఉంటుందని అనుకుంటారు. అయితే అంతర్జాతీయ స్థాయిలో నిలకడగా రాణిస్తే తప్ప ఆటగాళ్లు బాగా సెటిల్ అవుతారని చెప్పలేం. కొందరు ప్లేయర్లు లీగ్స్‌లో ఆడి బాగా సంపాదిస్తున్నారు. ఇంకొందరు జాతీయ స్థాయిలో రాణించి, ఉద్యోగం తెచ్చుకుని జీవితంలో సెటిలవుతున్నారు. కానీ కొందరి విషయంలో మాత్రం ఏదీ కలసి రాదు. ఎంత బాగా ఆడినా ఉద్యోగం రాక.. చివరికి ఏదో ఒక […]
పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ సింగ్ ఇంటి వద్ద లైవ్ బాంబు దొరకడం కలకలం రేపింది. చండీగఢ్ లోని ఆయన నివాసం వద్ద పోలీసులు ఈ బాంబును స్వాధీనం చేసుకున్నారు. మాన్ నివాసానికి దగ్గరలోనే ఉన్న హెలిపాడ్ సమీప ప్రాంతంలో ట్యూబ్ వెల్ ఆపరేటర్ ఒకరు దీన్ని గుర్తించారు. వెంటనే బాంబ్ నిర్వీర్య బృందాలతో పాటు డిజాస్టర్ మేనేజిమెంట్ సిబ్బంది అక్కడకి చేరుకొని ఆ ప్రాంతాన్ని తమ అధీనంలోకి తీసుకున్నారు. బాంబు షెల్ లైవ్‌లో ఉండటంతో దానిని […]
పెళ్లి.. రెండు మనసులను, కుటుంబాలను దగ్గర చేస్తుంది. వివాహం చేసుకునేముందు అటు ఏడు తరాలు.. ఇటు ఏడు తరాలు చూడాలంటారు. కానీ నేటి తరం యువత మాత్రం.. మనసులు కలిస్తే చాలు.. ఇంకేం అక్కర్లేదు అంటున్నారు. అంతస్తులతో సంబంధం లేదు.. అర్థం చేసుకునే భాగస్వామి అయితే చాలని భావిస్తున్నారు. నేటి కాలంలో ఆస్తిపాస్తులు లేకపోయినా పర్లేదు కానీ.. తమ ఆలోచనలని, అభిప్రాయాలని గౌరవించి.. విలువిచ్చే వారైతే చాలని భావిస్తున్నారు. ఇక వివాహ విషయంలో ఆడ పిల్లలకు కూడా […]
పంజాబ్ సీఎం భగవంత్ మాన్ ఒక్కసారిగా అస్వస్థతకు గురికావడంతో ఆయనను వెంటనే ఢిల్లీలోని అపోలో ఆస్పత్రిలో చేర్పించారు అధికారులు. భగవంత్ మాన్ కి ఉన్నట్టుండి వీపరీతమైన కడుపు నొప్పి రావడంతో పరీక్షలు చేసిన వైద్యులు ఆయనకు ఇన్‌ఫెక్షన్ సోకినట్లు నిర్ధారించారు. ఆయనకు ఇంద్రప్రస్థ ఆపోలో హాస్పిటల్ లో వైద్యం చేస్తున్నారు. సీఎం ఆస్పత్రిలో చేరడంతో.. ఆ ప్రాంతంలో పెద్ద ఎత్తున కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. అంతకుముందు అమృత్‌సర్ సమీపంలో పంజాబ్ పోలీసులతో భారీ ఎదురుకాల్పుల్లో ఇద్దరు […]
వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్.. బుధవారం పంజాబ్ పాఠశాలల్లో అడ్మిషన్ లేదా ట్యూషన్ ఫీజులను పెంచకూడదని ఆదేశించారు. సీఎం తీసుకున్న ఈ నిర్ణయం.. రాష్ట్రంలోని వందల వేలమంది విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు ఉపశమనం కలిగించనుంది. స్కూల్ ఫీజులు ఎక్కువగా ఉండటం కారణంగా పిల్లలను ఒక చోట నుండి మరో చోటుకు మార్చవలసి వస్తుంది. విద్యార్థులకు కావాల్సిన పుస్తకాలు, స్టేషనరీ సామాగ్రి, యూనిఫాంలను ఫలానా దుకాణం నుంచి కొనుగోలు చేయాలని ఏ […]
Bhagwant Mann : అధికారంలోకి వచ్చిన ఆప్ ప్రభుత్వం తమ మార్కు పాలనను చూపిస్తోంది. సరికొత్త నిర్ణయాలతో ముందుకు దూసుకుపోతోంది. కొత్తగా బాధ్యతలు చేపట్టిన ఆప్ ముఖ్యమంత్రి భగవత్ మన్న్ ఓ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. ఎమ్మెల్యేలకు షాక్ ఇచ్చేలా ‘ ఒక ఎమ్మెల్యే ఒక పింఛన్ ’ విధానాన్ని తెరపైకి తెచ్చారు. ఇకపై ఎమ్మెల్యేలకు ఒక పింఛన్ మాత్రమే వస్తుందని శుక్రవారం ప్రకటించారు. సాధారణంగా టర్ములను బట్టి ఎమ్మెల్యేల నెల పింఛన్‌లో మార్పులు ఉంటాయి. ఒక […]
స్టాండప్ కమెడియన్ టూ సీఎం పోస్ట్. పంజాబ్ ఎలక్షన్స్‌లో స్వీప్ చేసిన ఆమ్ ఆద్మీ పార్టీ..ఇక సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న భగవంత్ మాన్ గురించే ఇప్పుడు గూగుల్‌లో ఎక్కువగా సెర్చ్ చేస్తున్నారు నెటిజన్లు. ఆల్ రెడీ ఆమ్ ఆద్మీ పార్టీ తరపున ఎంపీగా ఉన్న భగవంత్ మాన్.. ఇప్పుడు పంజాబ్ సీఎం పీఠాన్ని అధిష్టించనున్నారు. మరి సామ్యానుడి స్థాయి నుంచి సీఎం స్థాయికి ఆయన జీవిత ప్రయాణం ఎలా సాగిందో తెలుసుకుందాం.. భగవత్ మాన్ పంజాబ్‌లోని […]