ప్రస్తుతం టీమిండియా ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ 2022లో ఆడుతున్న టైమ్‌లోనే.. వరల్డ్ కప్ తర్వాత ఆడే సిరీస్‌ల కోసం సెలెక్టర్లు జట్లను ప్రకటించారు. ఈ వరల్డ్ కప్ ముగిసిన వెంటనే టీమిండియా ఆస్ట్రేలియా పక్కనే ఉన్న న్యూజిలాండ్‌తో మూడు టీ20లు, మూడు వన్డే మ్యాచ్‌ల సిరీస్‌లు ఆడనుంది. ఈ సిరీస్ తర్వాత బంగ్లాదేశ్ వెళ్లి వాళ్లతో మూడు వన్డేలు, రెండు టెస్టులు ఆడనుంది. ఈ నాలుగు సిరీస్‌లకు ఒకే సారి జట్లను ఎంపిక చేశారు. న్యూజిలాండ్‌తో సిరీస్‌లకు టీమిండియా సీనియర్ ఆటగాళ్లకు రెస్ట్ ఇచ్చిన సెలెక్టర్లు.. టీ20లకు హార్దిప్ పాండ్యా, వన్డేలకు శిఖర్ ధావన్‌లకు సారథ్య బాధ్యతలు అప్పగించారు. యువ క్రికెటర్లతో కూడిన ఈ జట్లలో మరికొంత మంది టాలెంటెడ్ యంగ్ క్రికెటర్ల చోటు దక్కకపోవడం చర్చనీయాంశంగా మారింది.
ముఖ్యంగా టీమిండియా యంగ్ ప్లేయర్ పృథ్వీ షాకు న్యూజిలాండ్‌తో వన్డే, టీ20, అలాగే బంగ్లాదేశ్‌తో వన్డే సిరీస్‌లకు జట్టులో స్థానం దక్కకపోవడంపై క్రికెట్ అభిమానులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. దేశవాళీ టోర్నీ ముస్తక్ అలీ ట్రోఫీ 2022లో పృథ్వీ షా అద్భుతంగా రాణించాడు. పైగా అతను పవర్ ప్లేలో అగ్రెసివ్ బ్యాటింగ్‌తో భారీగా పరుగులు రాబట్టగలడు. అయినా కూడా సెలెక్టర్లు పృథ్వీ షాపై దయచూపలేదు. కొంతకాలం దేశవాళీ క్రికెట్లో మంచి ప్రదర్శన కనబరుస్తున్నా.. పృథ్వీ షా టీమిండియా స్థానంలో కోసం ఎదురుచూస్తున్నాడు. కొన్ని సార్లు కచ్చితంగా స్థానం దక్కుతుందని ఆశపడి భంగపడ్డాడు. ఈ సారి కూడా న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కు జట్టులో స్థానం దక్కుతుందని భావించి.. దక్కకపోవడంతో ఎంతో ఆవేదనతో సోషల్ మీడియాలో ఒక పోస్టు చేశాడు.
సాయిబాబా ఫొటో పెట్టి.. ‘సాయి బాబా మీరంతా చూస్తున్నారని అనుకుంటున్నాను’ అని పేర్కొన్నాడు. దీంతో జట్టులో చోటు దక్కకపోవడం బాగా హర్ట్ అయిన పృథ్వీ షా బీసీసీఐపై, సెలెక్టర్లలను దేవుడు చూసుకుంటాడని శపిస్తున్నాడంటూ నెటిజన్లు సెలైర్లు పేల్చుతున్నారు. కాగా పృథ్వీ షాను ఎంపిక చేయకపోవడంపై సెలెక్షన్ కమిటీ చైర్మన్ చేతన్ శర్మ స్పందిస్తూ.. పృథ్వీ షాపై నిరంతరం పరిశీలిస్తున్నామని, భవిష్యత్తులో అతనికి అవకాశం కచ్చితంగా లభిస్తుందని అన్నారు. జట్టు కూర్పులో ఇప్పటికే మంచి ప్రదర్శన కనబరుస్తున్న ఆటగాళ్లకు అవకాశాలు కల్పించడం చాలా ముఖ్యమని అన్నారు. పృథ్వీ షాతో పాటు మరో యంగ్ ప్లేయర్ నితీష్ రాణా సైతం ‘హోప్’ అని ఆసక్తి కర పోస్టుపెట్టాడు. కాగా.. ఇప్పటికే ఫేలవ ఫామ్‌లో ఉన్న దీపక్ హుడాను టీ20, వన్డే సిరీస్‌లకు ఎంపిక చేయడంపై విమర్శలు వస్తున్నాయి.
The Instagram story of Prithvi Shaw. pic.twitter.com/wAT0vRp3vQ
— Johns. (@CricCrazyJohns) October 31, 2022