గత 10 సంవత్సరాలనుంచి టీమిండియాకు ఐసీసీ ట్రోఫీ అందని ద్రాక్షాలాగే ఉంది. అద్భుత ప్రదర్శనతో ఐసీసీ నాకౌట్ కి చేరడం.. తుది మెట్టుపై బోల్తా పడడం ఇదంతా ఒక అలవాటుగా మారిపోయింది. ప్రతిసారి ఇలాగే జరగడంతో ఫ్యాన్స్ ఇప్పుడు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇక ఈ మ్యాచ్ అనంతరం రోహిత్ శర్మ చేసిన వ్యాఖ్యలకు ఆసీస్ కెప్టెన్ కమ్మిన్స్ కౌంటర్ ఇవ్వడం గమనార్హం.
డబ్ల్యూటీసీ ఫైనల్లో టీమిండియా ఘోర పరాజయం చవి చూసింది. ఏ మాత్రం పోరాడకుండానే చేతులెత్తేసింది. 444 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రోహిత్ సేన నాలుగవ రోజు ముగిసేసరికి 3 వికెట్లను 164 పరుగులు చేసి మ్యాచ్ పై ఆశలు అలాగే ఉంచారు. విరాట్ కోహ్లీ, రహానే గ్రీజ్ లో కుదురుకోవడంతో అభిమానులు వీరిద్దరి మీద భారీగానే ఆశలు పెట్టుకున్నారు. కానీ అనుకున్నదేమి జరగలేదు. ఐదవ రోజు ఒక్క సెషన్ లోనే ఒకరి తర్వాత మరొకరు పెవిలియన్ కి చేరారు. దీంతో వరుసగా రెండోసారి డబ్ల్యూటీసీ ఫైనల్ చేజార్చుకుంది. ఇక ఈ మ్యాచ్ అనంతరం రోహిత్ శర్మ చేసిన వ్యాఖ్యలకు ఆసీస్ కెప్టెన్ కమ్మిన్స్ కౌంటర్ ఇవ్వడం గమనార్హం.
గత 10 సంవత్సరాలనుంచి టీమిండియాకు ఐసీసీ ట్రోఫీ అందని ద్రాక్షాలాగే ఉంది. అద్భుత ప్రదర్శనతో ఐసీసీ నాకౌట్ కి చేరడం.. తుది మెట్టుపై బోల్తా పడడం ఇదంతా ఒక అలవాటుగా మారిపోయింది. ప్రతిసారి ఇలాగే జరగడంతో ఫ్యాన్స్ ఇప్పుడు జీర్ణించుకోలేకపోతున్నారు. రోహిత్ రాకతో మన తలరాత మారుతుంది అని ఆశించినవారికి నిరాశ తప్పలేదు. ఇక ఈ మ్యాచ్ ఓడిపోవడంతో రోహిత్ మీద విమర్శలు ఎక్కువవుతున్నాయి. ఓటమి అనంతరం మీడియాతో మాట్లాడిన రోహిత్ శర్మ.. రెండేళ్ల పాటు సాగే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ విజేతను ఒక్క మ్యాచ్‌తో తేల్చడం సరికాదన్నాడు. మూడు మ్యాచ్‌ల సిరీస్‌తో విజేతను తేల్చడం ఆదర్శంగా ఉంటుందని ప్రతిపాదించాడు. అయితే ఈ ప్రతిపాదనను ప్యాట్ కమిన్స్ ముందు ప్రస్తావించగా.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘మేం ఇప్పటికే డబ్ల్యూటీసీ ట్రోఫీని గెలుచుకున్నాం. డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్‌ను 3 మ్యాచ్‌ల సిరీస్‌తో కాకపోతే 16 మ్యాచ్‌ల సిరీస్‌తో నిర్వహించవచ్చు. ఒలింపిక్స్ ఫైనల్లో కూడా ఒకే మ్యాచ్‌తో ఆటగాళ్లు పతకాలు సాధిస్తారు.’అని కమిన్స్ చెప్పుకొచ్చాడు.
అయితే డబ్ల్యూటీసీ ఫైనల్‌ను మూడు మ్యాచ్‌ల సిరీస్ ఫార్మాట్‌లో నిర్వహించాలనే ప్రతిపాదన రావడం ఇదే తొలిసారి కాదు. డబ్ల్యూటీసీ 2019-21 ఫైనల్లో న్యూజిలాండ్ చేతిలో టీమిండియా ఓడిన తర్వాత అప్పటి కెప్టెన్ విరాట్ కోహ్లీ, రవి శాస్త్రి ఇవే వ్యాఖ్యలు చేశారు. కానీ ఐసీసీ పట్టించుకోలేదు. ఆ దిశగా బీసీసీఐ కూడా ఒత్తిడి చేయలేదు. దాంతో అంతా మరిచిపోయారు. మొత్తానికి ఐసీసీ ట్రోఫీ ఓడిపోవడం వలనే రోహిత్ ఇలాంటి వ్యాఖ్యలు చేసాడనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. మరి రోహిత్ శర్మ ప్రతిపాదించినట్లుగా ఐసీసీ ఈ విషయంలో ఏమైనా ఆలోచిస్తుందేమో చూడాలి. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలపండి.