పాకిస్తాన్ గురించి… అక్కడి మాజీ కెప్టెన్లు, పీసీబీ ఛైర్మన్లు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అవసరం, ఆస్కారం లేకపోయినా కూడా టీమిండియాపై అక్కసు వెళ్లగక్కుతూనే ఉంటారు. సందర్భంతో సంబంధం లేకుండా భారత్, టీమిండియా పేర్లను తీసుకొచ్చి వారి కడుపు మంట చల్లార్చుకుంటూ ఉంటారు. అలాంటి వారి పేర్లు తీస్తే జాబితా చాలా పెద్దగానే ఉంటుంది. అయితే ఇప్పుడు ఆ లిస్టులోకి ఒక కొత్త పేరు వచ్చి చేరింది. అతను మరెవరో కాదు… పాకిస్తాన్ కు కొద్దిరోజులు కెప్టెన్ గా వ్యవహరించిన రషీద్ లతీఫ్. టీమిండియా, రన్స్ మెషిన్ విరాట్ కోహ్లీపై తన పిచ్చి కామెంట్లతో నోరుపారేసుకున్నాడు.
బంగ్లాదేశ్ పై జరిగిన మూడో వన్డేలో కోహ్లీ శతకం నమోదు చేసిన విషయం తెలిసిందే. వన్డేల్లో కోహ్లీకి అది 44వ శతకం. ఓవరాల్ గా చూసుకుంటే అన్ని ఫార్మాట్లలో కలిపి కోహ్లీకి 72వ శతకం. 71 శతకాలతో ముందున్న రిక్కీ పాంటింగ్ ని వెనక్కి నెట్టి కోహ్లీ రికార్డు సృష్టించాడు. ఇంక 100 శతకాలతో అందరికంటే ముందుంది సచిన్ టెండూల్కర్ అని తెలిసిందే. అయితే కోహ్లీ రికార్డు సృష్టించిన సందర్భంగా రషీద్ లతీఫ్ కొన్ని వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. కోహ్లీ వంద శతకాలు నమోదు చేసినా కూడా వేస్ట్ అంటూ ఎద్దేవా చేశాడు.
“టీమిండియా ఐసీసీ టైటిళ్లు గెలిచి చాలాకాలం అవుతోంది. కోహ్లీ వ్యక్తిగత రికార్డుల కోసం ఎవరూ ఎదురుచూడటం లేదు. టీమిండియా టైటిళ్లు గెలవకుండా.. కోహ్లీ 200 శతకాలు నమోదు చేసిన కూడా అది వృథా అనే చెప్పాలి. అభిమానులు టీమిండియా ఐసీసీ టైటిళ్లు ఎప్పుడు కొడుతుందా అని కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు” అంటూ రషీద్ లతీవ్ అక్కసు వెళ్లగక్కాడు. ఇంక విరాట్ కోహ్లీ రికార్డుల విషయానికి వస్తే.. వన్డేల్లో ఇంకో 6 శతకాలు నమోదు చేస్తే ఆ ఫార్మాట్ లో అతనే అందరి కంటే ఎక్కువ శతకాలు నమోదు చేసిన ఆటగాడు అవుతాడు. ఇంక పాకిస్తాన్ మాజీల విషయానికి వస్తే.. వాళ్లు టీమిండియాని విమర్శించడం కొత్తేం కాదు. వాళ్లు పొగిడితేనే ఆశ్చర్యపోవాల్సి ఉంటుంది.
Ex-Pak Skipper Rashid Latif speaks.#ViratKohli #RashidLatif #Cricket #CricketTwitter pic.twitter.com/yqOIOpO63J
— RVCJ Sports (@RVCJ_Sports) December 12, 2022