ఆస్ట్రేలియా వేదికగా జరిగిన టీ20 వరల్డ్ కప్ 2022లో అదృష్టం కొద్ది సెమీస్ చేసిన పాకిస్థాన్.. సెమీస్‌లో న్యూజిలాండ్‌పై మంచి విజయం సాధించి ఫైనల్ వెళ్లింది. కానీ.. ఫైనల్లో ఇంగ్లండ్ చేతిలో చిత్తుగా ఓడి.. రెండో టీ20 వరల్డ్ కప్ సాధించాలనుకుని భంగపడింది. వరల్డ్ కప్ తర్వాత ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌కు సిద్ధమైంది పాకిస్థాన్. దాదాపు 17 ఏళ్ల తర్వాత పాక్ గడ్డపై అడుగుపెట్టింది ఇంగ్లండ్. బెన్ స్టోక్స్ కెప్టెన్సీలోని ఇంగ్లీష్ టీమ్.. పాక్‌తో మూడు టెస్టుల సిరీస్ ఆడేందుకు ఇప్పటికే పాక్‌కు చేరుకుంది. డిసెంబర్ 1 నుంచి పాక్-ఇంగ్లండ్ మధ్య తొలి టెస్టు రావాల్పిండి వేదికగా ప్రారంభం కానుంది.
అయితే పటిష్టమైన ఇంగ్లండ్ జట్టును పాకిస్థాన్ ఎదుర్కొవడం అంత సామన్యమైన విషయం కాదు. అగ్రెసివ్ బ్రాండ్ ఆఫ్ క్రికెట్‌తో ఇంగ్లండ్ జట్టు టెస్టు క్రికెట్‌ను నెక్ట్స్ లెవెల్‌కు తీసుకెళ్తోంది. కొత్త కెప్టెన్ బెన్ స్టోక్స్-కొత్త కోచ్ బ్రెండన్ మెక్‌కల్లమ్ బజ్‌బాల్ స్ట్రాటజీతో ముందుకు వెళ్తున్నారు. పాకిస్థాన్‌కు ఉన్న ఒకే ఒక అడ్వాంటేజ్ సిరీస్ తమ దేశంలో జరగడం. అంతేకానీ.. ఇంగ్లండ్ జట్టును పాకిస్థాన్ ఓడిస్తుందనే నమ్మకం ఎవరీలో లేదు. కేవలం ఓపెనర్లు, ఇద్దరు బౌలర్లపై ఆధారపడే పాకిస్థాన్ జట్టు.. జట్టు మొత్తం మ్యాచ్ విన్నర్లతో నిండి ఉన్న ఇంగ్లండ్‌కు కనీసం పోటీ ఇచ్చినా గొప్పే. పైగా ఇటివల టీ20 వరల్డ్ కప్‌లో ఫైనల్లో పాకిస్థాన్ ఓడింది ఇంగ్లండ్ చేతుల్లోనే.
ఇలాంటి పరిస్థితుల్లోనూ.. పాకిస్థాన్ ఆటగాళ్లు ఏ మాత్రం చీకూచింతా లేకుండా ప్రాక్టీస్ మానేసి ఏవో పిచ్చి ఆటలు ఆడుకుంటున్నారు. ఐదారుగురు కలిసి.. బ్యాట్లు పట్టుకుని.. గో అనగానే తమ వద్ద ఉన్న బ్యాట్‌ను అక్కడే నిలబెట్టి.. పక్కన ఉన్న మరో ఆటగాడు వదిలేసిన బ్యాట్‌ను పట్టుకోవాలి. ఆ బ్యాట్ కిందపడిపోకముందే ఆ బ్యాట్‌ను పట్టుకోవాలి. ఇలా చివరి ఒక్కరు మిగులుతారు. ఈ ఆటను పాక్ కెప్టెన్ బాబర్ అజమ్‌తో పాటు మరికొంతమంది ఆటగాళ్లు ఆడారు. ప్రస్తుతం ఈ ఆటకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోపై స్పందిస్తున్న పాకిస్థాన్ క్రికెట్ అభిమానులు ఇప్పుడు ఏ ఆటలైన ఆడండి.. మ్యాచ్ ఓడితే అప్పుడు చెప్పాం మీ సంగతి అంటూ కామెంట్ చేస్తున్నారు.
Game 🔛 – a bit of fun and banter at our training session 🏏😄#PAKvENG | #UKSePK pic.twitter.com/bSNo5CveZE
— Pakistan Cricket (@TheRealPCB) November 29, 2022