శుక్రవారం జరిగిన బంగ్లాదేశ్- పాకిస్తాన్ మ్యాచ్ లో ఒక అద్భుతం జరిగింది. హసన్ అలీ ఫస్ట్ ఓవర్ లో 219 కిలోమీటర్స్ పర్ ఓవర్ స్పీడ్ తో బౌలింగ్ చేశాడు. ఈ స్పీడ్ ను చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ట్విట్టర్ వేదికగా హసన్ అలీ సపోర్టర్స్ అయితే రచ్చ రచ్చ చేశారు. హసన్ అలీ రావల్‌పిండి ఎక్స్ ప్రెస్ రికార్డులు బద్దలు కొట్టాడు. అత్యంత వేగంవంతమైన బాల్ హసన్ అలీ బౌల్ చేశాడు అంటూ సంబరాలు చేసుకున్నారు కూడా.
#BANvsPAK
Fine and sunny conditions again today. Make or break time for @BCBtigers to keep the series alive. Remarkable comeback from 4/24 PP1 yesterday by @TheRealPCB to claim victory. Can Hasan Ali repeat this amazing feat.
(Was shown on TV) pic.twitter.com/5CktCofEw0— Farong (@thundhaa) November 20, 2021
ఇంకే ముంది షోయబ్ అక్తర్ రికార్డులు మొత్తం తుడిచిపెట్టుకు పోయాయి అంటూ అందరూ అనుకున్నారు. కానీ, అక్కడ జరిగింది వేరు. ఆ సమయంలో స్పీడోమీటర్ సరిగ్గా పనిచేయక అలా 219 కిలో మీటర్స్ పర్ అవర్ అంటూ చూపించింది. అది టెక్నికల్ ఎర్రర్ అని తర్వాత వెల్లడించారు. ఈలోపే సంబరాలు చేసుకున్న హసన్ అలీ అభిమానులు మాత్రం డీలా పడిపోయారు. కొందరైతే క్యాచ్ వదిలినందుకు ట్రోలింగ్ చేశారు. ఇప్పుడు హసన్ అలి కంబ్యాక్ చూసి ఏమంటారు అంటూ ట్వీట్లు చేశారు.
🇵🇰|
Nov 11 – Hasan Ali was brutally trolled and abused by Pakistanis after he dropped an important catchNov 19 – He came back with a lightning fast 219 kph ball
Comeback king Hasan for you👑 pic.twitter.com/2gT8PJ3qxU
— Titu Mama™🦁 (@TituTweets_) November 19, 2021
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. బంగ్లాదేశ్- పాకిస్తాన్ 3 టీ2ల సిరీస్ లో భాగంగా జరిగిన మొదటి టీ20లో పాక్ విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ కేవలం 127 పరుగులే చేయగలిగింది. బంగ్లా బ్యాట్స్ మన్లను కట్టడి చేయడంలో పాక్ బౌలర్లు విజయం సాధించారు. ముఖ్యంగా హసన్ అలీ 4 ఓవర్లు వేసి 3 వికెట్లు పడగొట్టాడు. తర్వాత బ్యాటింగ్ చేసిన పాక్ సునాయాసంగా లక్ష్యాన్ని ఛేదించింది.