టీ20 వరల్డ్ కప్ 2022లో భాగంగా బుధవారం బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ ఫేక్ ఫీల్డింగ్ చేశాడంటూ వివాదం చెలరేగిన విషయం తెలిసిందే. కోహ్లీ చేసిన ఫేక్ ఫీల్డింగ్‌ను ఫీల్డ్ అంపైర్లు గుర్తించలేదని.. వాళ్లు గుర్తించి ఉంటే తమకు ఐదు పెనాల్టీ రన్స్ వచ్చేవని.. ఆ రన్స్‌తో తాము మ్యాచ్ గెలిచే వాళ్లమని బంగ్లాదేశ్ క్రికెటర్ నూరుల్ హసన్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఈ వివాదం ఇప్పుడు మరింత ముదురుతున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై బంగ్లాదేశ్ […]
టీ20 క్రికెట్ లో ఆశించిన స్థాయిలో ప్రదర్శన కనబర్చలేకపోతున్నందుకు బంగ్లాదేశ్ వికెట్ కీపర్ – బ్యాటర్ ముష్ఫికర్ రహీమ్ తాజాగా తన రిటైర్మెంట్ ని ప్రకటించాడు. టెస్టులు, వన్డే ఫార్మాట్స్ పై దృష్టి పెట్టేందుకే తాను టీ20 ఫార్మాట్ నుండి తప్పుకుంటున్నానని ఆదివారం తన అధికారిక ఫేస్‌బుక్ పేజీలో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం జరుగుతున్న ఆసియా కప్ లో బంగ్లాదేశ్ తన మొదటి రెండు మ్యాచులు(ఆఫ్ఘనిస్తాన్, శ్రీలంక)లతో ఓడిపోయి నిష్క్రమించిన విషయం తెలిసిందే. ఆ వెంటనే ఇప్పుడు […]
బంగ్లాదేశ్ ఓపెనర్, స్టార్ బ్యాటర్ తమీమ్ ఇక్బాల్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. తాను అంతర్జాతీయ టీ20 క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్లు ఆదివారం తన అధికారిక ఫేస్ బుక్ పేజ్ ద్వారా ప్రకటించాడు. తమీమ్ ఇక్బాల్ కెప్టెన్సీలో బంగ్లాదేశ్- వెస్టిండీస్ పై మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను సునాయాసంగా గెలిచి క్లీన్ స్వీప్ చేసింది. అంతేకాకుండా తమీమ్ ఇక్బాల్ ఈ సిరీస్లో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచాడు. ఈ సిరీస్ తర్వాత తమీమ్ ఇక్బాల్ రిటైర్మెంట్ ప్రకటించాడు. […]
మైదానంలో ఓవర్ యాక్షన్ చేస్తూ, యువ క్రికెటర్లను బండబూతులు తిట్టే.. బంగ్లాదేశ్ వికెట్ కీపర్, బ్యాటర్ ముష్ఫికర్ రహీమ్ తనను తాను క్రికెట్ దిగ్గజం డాన్ బ్రాడ్‌మాన్ తో పోల్చుకున్నాడు. బంగ్లాదేశ్ తరఫున టెస్టులలో 5 వేల పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డు సాధించిన ముష్ఫికర్.. ఈ తరహా వ్యాఖ్యలు చేశాడు. టెస్టు క్రికెట్‌లో అతడో దిగ్గజం. పేరు.. ‘సర్ డాన్ బ్రాడ్‌మాన్‘. టెస్టు క్రికెట్ లో 99.94 యావరేజ్ మెయింటైన్ చేశాడంటే అతిశయోక్తి కాదు. అలాంటి […]
క్రికెట్ లో విషాద ఛాయలు అలముకున్నాయి. బ్రెయిన్ ట్యూమర్ తో భాదపడుతున్న ఇద్దరు మాజీ క్రికెటర్లు సమియుర్ రెహ్మాన్, మొషారఫ్ హుస్సేన్ ఒకే రోజు ప్రాణాలు విడిచారు. 69 ఏళ్ల సమియుర్ రెహమాన్ బంగ్లాదేశ్ తొలితరం క్రికెటర్లలో ఒకడిగా గుర్తింపు పొందారు. సమియుర్ ఆటకు రిటైర్మెంట్ పరకటించిన అనంతరం దేశవాళీ క్రికెట్ లో అంపైర్ గా కొనసాగుతున్నారు. ఇక.. మరో క్రికెటర్ మొషారఫ్ హుస్సేన్(40) లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ గా సేవలు అందించాడు. జాతీయ జట్టులో పెద్దగా […]
శుక్రవారం జరిగిన బంగ్లాదేశ్- పాకిస్తాన్ మ్యాచ్ లో ఒక అద్భుతం జరిగింది. హసన్ అలీ ఫస్ట్ ఓవర్ లో 219 కిలోమీటర్స్ పర్ ఓవర్ స్పీడ్ తో బౌలింగ్ చేశాడు. ఈ స్పీడ్ ను చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ట్విట్టర్ వేదికగా హసన్ అలీ సపోర్టర్స్ అయితే రచ్చ రచ్చ చేశారు. హసన్ అలీ రావల్‌పిండి ఎక్స్ ప్రెస్ రికార్డులు బద్దలు కొట్టాడు. అత్యంత వేగంవంతమైన బాల్ హసన్ అలీ బౌల్ చేశాడు అంటూ సంబరాలు చేసుకున్నారు […]
బంగ్లాదేశ్ క్రికెటర్లు అనగానే అందరిలో తక్కువ అంచనాలు, చిన్నచూపు ఉండేది. మమ్మల్ని తక్కువ అంచనా వేయొద్దంటూ బంగ్లాదేశ్ క్రికెటర్లు 2018 ఆసియాకప్ నుంచే అందరికీ సంకేతాలు పంపుతూనే ఉన్నారు. పాకిస్థాన్‌పై విజయం సాధించి ఆసియా కప్ ఫైనల్ చేరిన తీరు అందరినీ మంత్రిముగ్దులను చేసింది. ఆ సంయంలో బంగ్లాదేశ్‌ను పొగుడుతూ సెహ్వాగ్ చేసిన ట్వీట్ ఇప్పటికీ గుర్తుచేస్తున్నారు. ‘ఎవరినీ తక్కువ అంచనా వేయొద్దు. ఎప్పుడూ అభిమానులు కోరుకున్నట్లే జరగదు’ అంటూ సెహ్వాగ్ అప్పుడే చెప్పాడు. పొట్టి క్రికెట్ […]
క్రికెట్ అంటే కోట్లు కురిపించే ఆట మాత్రమే కాదు. ఓ ప్రొఫెషనల్ గేమ్ కూడా. గెలుపు, ఓటములను పక్కన పెడితే.., గ్రౌండ్ లో దిగాక అందరూ జెంటిల్మెన్స్ గా ప్రవర్తించాల్సిందే. ఇందుకే ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ కి ఇంత ఆదరణ దక్కుతోంది. కానీ.., ఇప్పుడు మాత్రం యావత్ క్రికెట్ సమాజం నివ్వెరపోయే ఘటన చోటుచేసుకుంది. కోపాన్ని కంట్రోల్ చేసుకోలేకపోయిన బంగ్లా స్టార్ క్రికెటర్ షకీబ్ అల్ హాసన్ క్రికెట్ లోకం ముందు దోషిగా నిలబడాల్సిన పరిస్థితి తలెత్తింది. […]