క్రికెట్ లో విషాద ఛాయలు అలముకున్నాయి. బ్రెయిన్ ట్యూమర్ తో భాదపడుతున్న ఇద్దరు మాజీ క్రికెటర్లు సమియుర్ రెహ్మాన్, మొషారఫ్ హుస్సేన్ ఒకే రోజు ప్రాణాలు విడిచారు. 69 ఏళ్ల సమియుర్ రెహమాన్ బంగ్లాదేశ్ తొలితరం క్రికెటర్లలో ఒకడిగా గుర్తింపు పొందారు. సమియుర్ ఆటకు రిటైర్మెంట్ పరకటించిన అనంతరం దేశవాళీ క్రికెట్ లో అంపైర్ గా కొనసాగుతున్నారు.
ఇక.. మరో క్రికెటర్ మొషారఫ్ హుస్సేన్(40) లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ గా సేవలు అందించాడు. జాతీయ జట్టులో పెద్దగా రాణించని మొషారఫ్.. దేశవాళీ క్రికెట్లో మాత్రం పెద్ద స్టార్ గా పేరుగాంచాడు. దేశవాళీ మ్యాచుల్లో 572 వికెట్లు పడగొట్టాడు. సమియుర్, మొషారఫ్ వంటి మాజీలను కోల్పోవడం పట్ల బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు తీవ్ర విచారం వ్యక్తం చేసింది.ఈ రోజును ఒక చీకటి రోజుగా పేర్కొంది.
ఇది కూడా చదవండి: ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన పది మంది మృతి