పాకిస్థాన్ క్రికెట్ లో కొన్నేళ్లపాటు రెగ్యులర్ ప్లేయర్ గా జట్టులో కొనసాగిన హసన్ అలీకి గత కొన్ని సిరీస్ ల నుంచి తుది జట్టులో స్థానం లభించడం లేదు. ఇదిలా ఉండగా వర్షం పడిన సమయంలో పాకిస్థాన్ క్రికెటర్ హసన్ అలీ చేసిన ఒక పని నవ్వు తెప్పించింది.
శ్రీలంక టూర్ లో పాకిస్థాన్ జట్టు అంచనాలకు మించి రాణిస్తుంది. సొంతగడ్డపై పటిష్టమైన శ్రీలంక జట్టుని తొలి టెస్టులో మట్టికరిపించిన పాకిస్థాన్ జట్టు.. ప్రస్తుతం జరుగుతున్న రెండో టెస్టులో భారీ ఆధిక్యం దిశగా దూసుకెళ్తుంది. తొలి ఇన్నింగ్స్ లో మొదట బౌలింగ్ లో అబ్రార్ అహ్మద్, నజీమ్ షా రాణించడంతో ఆతిధ్య జట్టుని కేవలం 166 పరుగులకే ఆలౌట్ చేసిన పాకిస్థాన్.. ఆ తర్వాత బ్యాటర్లు రాణించడంతో 2 వికెట్లను పరుగులు చేసి ఈ మ్యాచ్ మీద పట్టు బిగించింది. అయితే పాక్ జోరుని రెండో రోజు వరుణుడు అడ్డుకోవడంతో మ్యాచ్ కేవలం తొలి సెషన్ లో కొన్ని ఓవర్ల ఆటే జరిగింది. ఈ దశలో భారీ వర్షం రావడం వల్ల రెండు, మూడు సెషన్లు పూర్తిగా రద్దయ్యాయి. ఇదిలా ఉండగా వర్షం పడిన సమయంలో పాకిస్థాన్ క్రికెటర్ హసన్ అలీ చేసిన ఒక పని నవ్వు తెప్పించింది.
పాకిస్థాన్ క్రికెట్ లో కొన్నేళ్లపాటు రెగ్యులర్ ప్లేయర్ గా జట్టులో కొనసాగిన హసన్ అలీకి గత కొన్ని సిరీస్ ల నుంచి తుది జట్టులో స్థానం లభించడం లేదు. ఉపఖండపు పిచ్ లు కావడం, షాహీన్ ఆఫ్రిది పూర్తి ఫిట్ నెస్ సాధించడం, యంగ్ ప్లేయర్ నజీమ్ షా ప్రతి మ్యాచులో తనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపర్చుకోవడం లాంటి కారణాలు ఈ సీనియర్ బౌలర్ ని పక్కన పెట్టేలా చేశాయి. అయితే ఆ బాధ హసన్ అలీకి ముఖంలో అస్సలు కనిపించడం లేదు. వర్షం అంతరాయం కలిగించిన ఈ మ్యాచులో గ్రౌండ్ మొత్తం పూర్తిగా కవర్లతో కప్పేశారు. కొన్ని సార్లు వర్షం కాస్త తెరపిచ్చినప్పటికీ మరికాసేపటికీ భారీ వర్షం కురిసింది. ఈ లోపు ప్లేయర్లకు లంచ్ బ్రేక్, టీ బ్రేక్ కూడా ఇవ్వడం జరిగిపోయాయి. చివరి సెషన్ లో వర్షం తగ్గినప్పటికీ అప్పటికే జరగలాల్సిన నష్టం జరిగిపోయింది. దీంతో మ్యాచ్ ని మూడో రోజు కొనసాగిస్తున్నట్లుగా అంపైర్లు చెప్పేసారు.
ఇక ఈ టైంని బాగా ఎంజాయ్ చేయాలనుకున్నాడు హసన్ అలీ. గ్రౌండ్ లోకి వెళ్ళిపోయి నీళ్లల్లో దూకేసాడు. కవర్ల మీద ఉన్న నీటి మీద జారుకుంటూ ఇచ్చిన ఎక్స్ ప్రెషన్ లు హైలెట్ గా మారాయి. పిచ్ మీద కప్పి ఉంచిన కవర్ల మీద ఎక్కువ నీరు ఉండడంతో ఒక చిన్నపాటి ఈత కొడుతూ సహచర ఆటగాళ్ల వైపుగా సంకేతాలు ఇచ్చాడు. అలీ విన్యాసాలు చూసిన పాక్ క్రికెటర్లు నవ్వుతూనే ఉండడం విశేషం. ఈ వీడియో చూస్తే ఎవరికైనా నవ్వు వచ్చేస్తుంది. మొత్తానికి రెండో రోజు వర్షం అంతరాయం కలిగించిన ఈ మ్యాచులో హసన్ అలీ విన్యాసాలు పాక్ క్రికెటర్లకు కాస్త రిలాక్స్ ని ఇచ్చాయి. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలపండి.
Making the most of the rain delay in Colombo, with @RealHa55an leading the charge 🏊♀️😅#SLvPAK pic.twitter.com/Xi3w8lDrZp
— Pakistan Cricket (@TheRealPCB) July 25, 2023