ప్రస్తుతం ఐపీఎల్ ఆడుతూ బిజీగా ఉన్న టీంఇండియా ప్లేయర్లు.. తర్వాత ప్రతీష్టాత్మకమైన WTC ఫైనల్ తో పాటు, ఆసియా కప్ కూడా ఆడాల్సి ఉంది. ఇక ఈ ఏడాది చివర్లో వరల్డ్ కప్ ఇండియాలోనే వరల్డ్ కప్ జరగనుండడడంతో టీమిండియా హాట్ ఫేవరేట్ గా బరిలోకి దిగుతుంది. ఇదిలా ఉండగా.. అప్పుడే పాక్ బ్యాటర్ ఓవర్ కాన్ఫిడెంట్ చూపిస్తూ సంచలన వ్యాఖ్యలు చేసాడు.
ఈ ఏడాది ప్రతిష్టాత్మక వన్డే ప్రపంచ కప్ కి భారత్ ఆతిధ్యమివ్వనుంది. చివరి సారి 2011 లో భారత్, శ్రీలంక, బంగ్లాదేశ్ లు వరల్డ్ కప్ కి సంయుక్తంగా ఆతిధ్యమివ్వగా.. మళ్ళీ దాదాపు 12 సంవత్సరాల తర్వాత ఈ మెగా ఈవెంట్ ని భారత్ లో నిర్వహించనున్నారు. ప్రస్తుతం ఐపీఎల్ ఆడుతూ బిజీగా ఉన్న టీంఇండియా ప్లేయర్లు తర్వాత WTC ఫైనల్ తో పాటు, ఆసియా కప్ కూడా ఆడాల్సి ఉంది. ఇక ఈ ఏడాది చివర్లో వరల్డ్ కప్ ఇండియాలోనే వరల్డ్ కప్ జరగనుండడడంతో టీమిండియా హాట్ ఫేవరేట్ గా బరిలోకి దిగుతుంది. ఇదిలా ఉండగా.. అప్పుడే పాక్ బ్యాటర్ ఇఫ్తికార్ అహ్మద్ ఓవర్ కాన్ఫిడెంట్ చూపిస్తూ సంచలన వ్యాఖ్యలు చేసాడు.
భారత్- పాకిస్థాన్ జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీసులు రద్దైన సంగతి తెలిసిందే. కొని భద్రత కారణాల వలన ఇరు జట్ల మధ్య మ్యాచులు నిలిపివేశారు. ఇక అప్పటినుంచి వీరి మ్యాచులను చూడటానికి ఐసీసీ ఈవెంట్లే కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఓవరాల్ పాకిస్థాన్ మీద రికార్డ్ ఎలా ఉన్నా.. ఐసీసీ టోర్నీల్లో భారత్ దే పై చేయి. 2021లో జరిగిన టీ 20 వరల్డ్ కప్ లీగ్ మ్యాచులో మినహా ప్రతిసారి టీమిండియాదే పై చేయి సాధిస్తూ వచ్చింది. ఈ సారి కూడా అలాంటి హాయ్ వోల్టేజ్ మ్యాచ్ కోసం రంగం సిద్ధమైంది. అన్ని అనుకున్నట్లు జరిగితే భారత్, పాక్ జట్లు ఫైనల్ కే వచ్చే అవకాశముంది. అయితే ఈ సారి పాక్ వరల్డ్ కప్ గెలిచే అవకాశాలను కొట్టిపారేయలేము.
ఉపఖండపు పిచ్ ల మీద భారత్ తర్వాత బాగా ఆడే దేశం పాకిస్థాన్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రస్తుతం పాకిస్థాన్ జట్టు వన్డేల్లో చాలా బలంగా తయారైంది. ఇటీవలే వన్డేల్లో నెంబర్ 1 స్థానాన్ని అందుకొని చరిత్ర సృష్టించింది. ఈ నేపథ్యంలో భారత్ లో జరగబోయే వరల్డ్ కప్ మీద కన్నేసింది. ఇంతవరకు బాగానే ఉన్నా.. ఆ జట్టు ఆ జట్టు బ్యాటర్ ఇఫ్తికార్ అహ్మద్ పాక్ వరల్డ్ కప్ గెలుస్తుందని జోస్యం చెప్పాడు. ఇఫ్తికార్ మాట్లాడుతూ “వన్డే వరల్డ్ కప్ ఆడడం నా కళ. మేము ట్రోఫీని గెలిచి లక్షమంది భారతీయులు ముందు ప్రపంచకప్ అందుకుంటాం”. అని ధీమా వ్యక్తం చేసాడు. అసలు జట్టులో స్థానం దక్కుతుందో లేదో తెలియదు గాని వరల్డ్ కప్ గెలిచేస్తాం అని చెప్పుకొని రావడం నవ్వు తెప్పిస్తుంది. మరి ఇఫ్తికార్ చెప్పినట్లు లక్ష మంది ముందు తమ జట్టుకు వరల్డ్ కప్ అందిస్తాడో లేదో చూడాలి. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలపండి.