టీ20 వరల్డ్ కప్ 2021లో భాగంగా ఆదివారం పీఎన్‌జీ, ఒమన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ ఒమన్ భారీ విజయం సాధించింది. ఏకంగా 10 వికెట్ల తేడాతో పీఎన్‌జీని చిత్తు చిత్తుగా ఓడించింది. ఒమన్ సాధించిన ఈ విక్టరీలో కీ రోల్ ప్లే చేసింది మన భారతీయ సంతతికి చెందిన వ్యక్తి. కేవలం 42 బంతుల్లో 73 పరుగులతో 130 పరుగుల లక్ష్యాన్ని 13.2 ఓవర్లలోనే ముగించాడు ఒమన్ ఆటగాడు జితేందర్ సింగ్. పంజాబ్‌లోని లుథియానాకు చెందిన జితేందర్ 2003లో మాస్కట్‌కు వెళ్లి అక్కడే స్థిరపడ్డాడు.
తరాలుగా జితేందర్ వంశీయులు కార్పెంటర్ పనిని వృత్తిగా చేసేవారు. జితేందర్ తండ్రి కూడా కార్పెంటర్‌గానే ఒమన్ పోలీస్ డిపార్ట్‌మెంట్‌కు చెందిన కార్పెంటర్ విభాగంలో పనిచేస్తున్నాడు. జితేందర్ 2003లో అక్కడికి వెళ్లి ఖిబ్జీ రామ్‌దాస్ కంపెనీలో కార్పొరేట్ అఫైర్స్ విభాగంలో ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. క్రికెట్ మీద ఉన్న ఆసక్తితో అక్కడి దేశవాళీ క్రికెట్‌లో ఆడి జాతీయ జట్టుకు ఎంపికయ్యాడు.
2015 నుంచి ఒమన్ జాతీయ జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. జితేందర్ సింగ్ టీమిండియా ఆటగాడు శిఖర్ ధావన్‌కు పెద్ద అభిమాని. ఆదివారం మ్యాచ్‌లో కూడా క్యాచ్ అందుకుని శిఖర్ ధావన్ స్లైల్‌లో తొడగొట్టి సెలబ్రెట్ చేసుకున్నాడు. ప్రస్తుతం జితేందర్ కుటుంబం మొత్తం ఒమన్‌లోనే స్థిరపడ్డారు. ఒమన్ జట్టులో ఇద్దరు భారతీయ సంతతికి చెందిన వారు ఉన్నారు. ఒకరు జితేందర్ అయితే ఇంకొకరు హైదరాబాద్‌కు చెందిన సందీప్ గౌడ్.
ఇదీ చదవండి: పేరు సందీప్.. ఊరు హైదరాబాద్.. టీ20 వరల్డ్‌కప్‌లో వేరే దేశం తరఫున బరిలోకి
Is that Jatinder or Dhawan? 😍 pic.twitter.com/2dxxOVr56V
— Sunaina Gosh (@Sunainagosh7) October 17, 2021