వారం రోజులుగా ఏకాధిటిగా వర్షాలకు దేశం మొత్తం చిగురుటాకులా వణుకుతోంది. వర్ష బీభత్సానికి నదులు, వంకలు, వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. రోడ్లపైకి భారీగా వరద నీరు చేరడంతో రాకపోకలు నిలిచిపోయాయి. మన దగ్గర ఇలా ఉంటే.. గల్ఫ్ దేశమైన ఓమన్ లో సముద్రం అల్లకల్లోలంగా మారింది. అలా చొచ్చుకొచ్చిన సముద్రపు రాకాసి అలలు మహారాష్ట్రకు చెందిన ఒక కుటుంబంలో విషాదాన్ని నింపాయి.
మహారాష్ట్ర, సంఘ్లీకి చెందిన శశికాంత్ దుబాయిలో మెకానికల్ ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు. ఆయన తన భార్య, ముగ్గురు పిల్లలతో కలిసి సముద్ర స్నానానికి వెళ్లారు. అలా వారు సముద్రపు ఒడ్డున నిల్చొని చూస్తుండగా.. ఒక్కసారిగా చొచ్చుకొచ్చిన సముద్రపు అలలు తాకిడికి ఇద్దరు పిల్లలు కొట్టుకుపోయారు. వారిని కాపాడే ప్రయత్నం చేసిన శశికాంత్ సైతం అలల ఉధృతికి కొట్టుకుపోయారు. ఈ ప్రమాదంలో శశికాంత్, అయన కుమారుడు శ్రేయాస్ బాడీలను కోస్ట్ గార్డ్ సిబ్బంది కనుగొన్నారు. మరో కూతురు శ్రేయ కోసం పోలీసులు, కోస్ట్ గార్డ్ సిబ్బంది తీవ్రంగా గాలిస్తున్నారు.
ఇది కూడా చదవండి: Nagpur: కళ్ల ముందే నీటి పాలైన జీవితాలు.. చూడ్డం తప్ప కాపాడలేని పరిస్థితి!
ఇది కూడా చదవండి: బడికి వెళ్లాలంటే నదిని దాటాల్సిందే..