క్రికెట్.. అతి కొద్ది దేశాలు ఆడే ఆట. కానీ.., ఒక్కసారి ఈ గేమ్ అలవాటైతే దీనికి అడిక్ట్ అయిపోతారు. ఇలాంటి గేమ్ లో ఆట పరంగా సూపర్ పవర్ గా నిలిచిన దేశాలు కొన్ని ఉన్నాయి. మొదట్లో వెస్టిండీస్ క్రికెట్ ని రూల్ చేసింది. ఆ తరువాత ఆస్ట్రేలియా ఆ స్థానాన్ని సొంతం చేసుకుంది. తరువాత ఇండియా కూడా క్రికెట్ లో సూపర్ పవర్ గా నిలిచింది. కానీ.., ఇప్పుడు ఆ స్థానాన్ని న్యూజిలాండ్ భర్తీ చేయబోతుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది.
ఇండియా జనాభా 138 కోట్లు. ఇక్కడ ఒక ప్రొఫెషనల్ క్రికెటర్ తయారు కావాలంటే స్కూల్ క్రికెట్ , జోన్స్, అండర్-19, రంజీలు, లిస్ట్- ఏ, ఫస్ట్ క్లాస్ మ్యాచ్ లు అంటూ పెద్ద ప్రాసెస్ ఉంది. ఇన్ని దగ్గరలా గొప్పగా రాణించిన ఆటగాళ్లకి మాత్రమే టీమిండియా తలుపులు తెరుచుకుంటాయి. మరి.. ఇంత పర్ఫెక్ట్ స్ట్రెక్చర్ ఉన్న ఇండియన్ టీమ్ వల్ల కూడా సాధ్యం కాని.. నిలకడ ఆట ఒక్క న్యూజిలాండ్ కి మాత్రమే ఎలా సాధ్యం అవుతుంది? టెస్ట్, వన్డే, టీ20 అన్న తేడా లేకుండా కివీస్ ఆధిపత్యం కొనసాగడానికి కారణం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
న్యూజిలాండ్ లో డొమెస్టిక్ సిస్టం చాలా సింపుల్ అండ్ పవర్ ఫుల్ గా ఉంటుంది. ఇక్కడ ప్రొఫెషనల్ ఆటగాడిగా రాణించాలంటే క్లబ్ క్రికెట్ నుండి ఆట మొదలు పెట్టాలి. ఆ క్లబ్స్ లో కూడా డిఫరెంట్ లెవల్స్ ఉంటాయి. బేసిక్ లెవల్ లో ఎవరి టీమ్ ని వారు రెడీ చేసుకుని ఎంట్రీ తీసుకోవాల్సి ఉంటుంది. అక్కడ నుండి టీమ్ అంతా నిలకడగా ఆడితేనే, ఆ టీమ్ నెక్స్ట్ గ్రేడ్ కి అప్డేట్ అవుతుంది. సో.. ఇక్కడ ఆటగాడి ప్రదర్శన కన్నా.., టీమ్ ఓవరాల్ పెర్ఫార్మెన్స్ కీలకం అనమాట. అలా.. క్లబ్ క్రికెట్ లో మెరిసిన జట్ల నుండి మాత్రమే మంచి ఆటగాళ్లను అసోసియేషన్స్ కి సెలక్ట్ చేస్తారు.
అసోసియేషన్స్ లో కూడా ఆటగాడి పెర్ఫార్మెన్స్ కన్నా, టీమ్ గా విజయం సాధించడమే ముఖ్యం. ఎందుకంటే.. ఇక్కడ క్లిక్ అయిన అసోసియేషన్స్ మాత్రమే.. న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు గుర్తింపు ఉన్న ఫస్ట్ క్లాస్ మ్యాచ్ లు ఆడటానికి అర్హత సాధిస్తాయి. ఇక్కడ.. మెరుగైన ప్రదర్శన కనబరిచిన ఆటగాళ్ళకి మాత్రమే న్యూజిలాండ్ క్రికెట్ టీమ్ లో స్థానం లభిస్తుంది. ఇప్పుడు న్యూజిలాండ్ క్రికెట్ టీమ్ లో ఉన్న ఆటగాళ్లు జట్టులోకి ఇలా వచ్చిన వారే.
ఈ మొత్తం ప్రాసెస్ లో ఆటగాడి వ్యక్తిగత ప్రదర్శన కన్నా.., టీమ్ గా సక్సెస్ అవ్వడం చాలా ముఖ్యం. ఇందుకే న్యూజిలాండ్ జట్టులో స్టార్స్ కన్నా, మ్యాచ్ విన్నర్స్ అధికంగా ఉంటారు. వారెవ్వరు చివరి వరకు ఓటమిని ఒప్పుకోరు. లాస్ట్ బాల్ వరకు పోరాట పటిమ కనబరుస్తూనే ఉంటారు. డొమెస్టిక్ లెవల్ నుండి ఆటగాళ్లలో ఈ రకమైన భావన ఏర్పడటంతో న్యూజిలాండ్ క్రికెట్ టీమ్ ఇప్పుడు వరుస విజయాలను నమోదు చేస్తుంది.
మిగతా దేశాల్లో ఆటగాళ్ల ఎంపిక పూర్తి భిన్నంగా ఉంటుంది. ఆటగాడి వ్యక్తిగత ప్రదర్శనని మాత్రమే పరిగణంలోకి తీసుకుని అతన్ని జట్టులోకి ఎంపిక చేస్తారు. దీంతో.. ఆటగాళ్లు వ్యక్తిగత రికార్డ్స్ పై ద్రుష్టి పెట్టే ప్రమాదం ఏర్పడుతుంది. టీమ్ కోసం సమష్టిగా ఆలోచించే అవసరం కూడా వారికి లేకుండా పోతుంది. ఇండియన్ క్రికెట్ టీమ్ లో కూడా ఇప్పుడు ఇదే సమస్య ఉంది. ఇదే మిగతా జట్లకు, న్యూజిలాండ్ కి తేడా. ఈ ఫార్ములానే.. అరకోటి జనాభా ఉన్న న్యూజిలాండ్ ని క్రికెట్ పవర్ గా నిలబెడుతోంది. గత 4 ఏళ్ళ కాలం నుండి న్యూజిలాండ్ అన్నీ ఐసీసీ ట్రీఫీలలో సెమీస్ చేరింది. తృటిలో వన్డే వరల్డ్ కప్ చేజార్చుకుంది. టెస్ట్ ఛాంపియన్ షిప్ సొంతం చేసుకుంది. ఇప్పుడు టీ 20 వరల్డ్ కప్ లోనూ మెరిసింది. ఈ లెక్కన చూస్తే రాబోయే కాలంలో క్రికెట్ లో న్యూజిలాండ్ డామినేషన్ తప్పదన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరి.. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
High stakes, high pressure: enter James Neesham, ice cold, a cameo for the ages to steal victory from the jaws of defeat #ENGvNZ #T20WorldCup
— Karamdeep #T20WorldCup (@oyeekd) November 10, 2021