భారత్- ఆస్ట్రేలియా మధ్య ప్రతిష్టాత్మక డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్ మరో నాలుగు రోజుల్లో ప్రారంభం కానుంది. లండన్ లోని ఒవెల్ మైదానం ఈ మ్యాచ్ కి ఆతిధ్యమిస్తుంది. ఇదిలా ఉండగా.. ఈ మ్యాచ్ కి టీమిండియా ఒక కొత్త జెర్సీతో బరిలోకి దిగనుంది. అంతేకాదు పనిలో పనిగా మూడు ఫార్మాట్లకు కొత్త జెర్సీని ఆవిష్కరించారు.
భారత్- ఆస్ట్రేలియా మధ్య ప్రతిష్టాత్మక డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్ మరో నాలుగు రోజుల్లో ప్రారంభం కానుంది. లండన్ లోని ఒవెల్ మైదానం ఈ మ్యాచ్ కి ఆతిధ్యమిస్తుంది. ఏ జట్టు ఈ ఫైనల్ నెగ్గినా.. క్రికెట్ లో కొత్త చరిత్ర సృష్టించడం గ్యారంటీ. ఈ నేపథ్యంలో ఇరు జట్ల మధ్య హోరా హోరీ పోరు ఖాయం అని అందరూ అంచనా వేస్తున్నారు. స్టార్ స్పోర్ట్స్, డీడీ స్పోర్ట్స్ లో మధ్యాహ్నం 3:30 నిమిషాలకు ఈ మ్యాచ్ ప్రారంభం అవుతుంది. ఇక ఇటీవలే ఐపీఎల్ ముగించుకొని ఇంగ్లాండ్ గడ్డపై అడుగుపెట్టిన టీమిండియా.. కఠోరమైన ప్రాక్టీస్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. ఈ మ్యాచ్ కి టీమిండియా ఒక కొత్త జెర్సీతో బరిలోకి దిగనుంది. అంతేకాదు పనిలో పనిగా మూడు ఫార్మాట్లకు కొత్త జెర్సీని ఆవిష్కరించారు.
టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్ కోసం ధరించబోయే జెర్సీని ఇటీవలే అడిడాస్ అధికారికంగా ప్రకటించేసింది. ప్రస్తుతం అడిడాస్ భారత జట్టుకి అఫీషియల్ కిట్ స్పాన్సర్ గా వ్యవహరిస్తోంది. తాజాగా కోహ్లీ, రోహిత్ ఈ కొత్త జర్సీ ధరించుకొని ఫోజులిస్తూ సందడి చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తెలుపు నీలం రంగులో ఈ జెర్సీలో టీమిండియా ఆటగాళ్లు మెరిసిపోతున్నారు. భుజాలు, కాలర్ పై నీలం రంగు బార్డర్.. అదేవిధంగా ఎడమవైపు ఛాతీపై బీసీసీఐ ఎంబ్లెమ్.. కుడివైపు అడిడాస్ సింబల్ తో కూడిన ఈ జెర్సీ చాలా కొత్తగా ఉంది. ట్విట్టర్ లో అభిమానులు ఈ జెర్సీ చాలా బాగుందంటూ కామెంట్ చేస్తున్నారు.
సాంప్రదాయక టెస్టు క్రికెట్ లో ఒకప్పుడు కేవలం తెలుపు రంగు ఉన్న దుస్తులను మాత్రమే ధరించారు. చూడడానికి కూడా అభిమానులకి కాస్త బోరింగ్ గా ఉంటుంది. అయితే ఇప్పుడు ఈ వైట్ కలర్ ని పూర్తిగా మార్చకుండా.. చిన్న చిన్న మార్పులు చేసి ఆకట్టుకునే విధంగా ఈ జెర్సీని తయారు చేశారు. ఇక దీంతో పాటు వన్డే, టీ 20 జెర్సీలను కూడా ప్రకటించారు. అయితే ఇప్పుడు వీటి ధర కూడా ప్రకటించేశారు. టీమిండియా ధరించే ఈ జెర్సీ ధర 4999 రూపాయలు. సామాన్యులు కొనడానికి కాస్త కష్టమే అయినా.. మరీ కొనలేనంత రేట్ కూడా కాదు. క్రికెట్ మీద ఆసక్తి ఉన్నవారికి ఈ ధర చిన్నదిగానే కనిపిస్తుంది. మరి ఈ కొత్త జెర్సీ ఎలా ఉందో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలపండి.