ఆఫ్ సైడ్ బాల్స్ వెంటాడి వికెట్ కోల్పోవడం కోహ్లీకి ఎప్పటి నుంచో ఉన్న బలహీనత. ప్రత్యర్థి బౌలర్లు ఇలాంటి అస్త్రాన్నే ఉపయోగించి కోహ్లీ వికెట్ సంపాదిస్తారు. తాజాగా నిన్న జరిగిన డబ్ల్యూటీసీ ఫైనల్లో కూడా ఆస్ట్రేలియా బౌలర్లు పదే పదే ఆఫ్ సైడ్ బంతులను వేస్తూ కోహ్లీ వికెట్ తీయడంలో సఫలమయ్యారు. దీంతో ఇప్పుడు భారత్ మాజీ దిగ్గజం సునీల్ గవాస్కర్ విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీ కోసం ఆడి ఔటయ్యాడు అని ఫైర్ అయ్యాడు.
భారత టెస్టు ఛాంపియన్ షిప్ గెలవడానికి చివరి రోజు 80 ఓవర్లలో 280 పరుగులు చేయాలి. చేతిలో 7 వికెట్లు ఉన్నాయి. ఆస్ట్రేలియా పేస్ బౌలింగ్ ధాటికి చివరి రోజు ఈ లక్ష్యం ఛేజ్ చేయడం దాదాపు అసాధ్యమనే చెప్పాలి. కానీ గ్రీజ్ లో ఉంది ఛేజింగ్ కింగ్ విరాట్ కోహ్లీ. ఇలాంటి లక్ష్యాలను ఛేజ్ చేయడం కోహ్లీ లాంటి బ్యాటర్ కి వెన్నతో పెట్టిన విద్య. అందుకే యావత్తు భారత దేశం కోహ్లీ మీద ఎన్నో ఆశలు పెట్టుకుంది. కానీ కోహ్లీ మాత్రం ఒక చెత్త షాట్ కి ఔటవ్వడం అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆఫ్ సైడ్ బాల్స్ ఆడే విషయంలో మరోసారి తన బలహీనతను బయట పెట్టాడు. దీంతో ఇప్పుడు భారత్ మాజీ దిగ్గజం సునీల్ గవాస్కర్ విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీ కోసం ఆడి ఔటయ్యాడు అని ఫైర్ అయ్యాడు.
ఆఫ్ సైడ్ బాల్స్ వెంటాడి వికెట్ కోల్పోవడం కోహ్లీకి ఎప్పటి నుంచో ఉన్న బలహీనత. ప్రత్యర్థి బౌలర్లు ఇలాంటి అస్త్రాన్నే ఉపయోగించి కోహ్లీ వికెట్ సంపాదిస్తారు. తాజాగా నిన్న జరిగిన డబ్ల్యూటీసీ ఫైనల్లో కూడా ఆస్ట్రేలియా బౌలర్లు పదే పదే ఆఫ్ సైడ్ బంతులను వేస్తూ కోహ్లీ వికెట్ తీయడంలో సఫలమయ్యారు. బొలాండ్ వేసిన ఒక బంతిని డ్రైవ్ చేయబోయిన కోహ్లీ.. స్లిప్ లో స్మిత్ పట్టిన పట్టిన అద్భుతమైన క్యాచ్ కి పెవిలియన్ బాట పట్టాడు. దీంతో కోహ్లీ ఔటైన తీరుపై మాజీ దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కోహ్లీ ఔటైన తీరు గురించి యాంకర్ అడిగిన ప్రశ్నకు బదులిస్తూ.. అదో చెత్త షాట్ అని, సాధారణ ప్లేయర్ ఆడే షాట్ అని, నన్ను కాదు, కోహ్లీనే అడగండి అంటూ సునీల్ గవాస్కర్ సమాధానం ఇచ్చాడు.
ఈ సందర్భంగా స్టార్ స్పోర్ట్స్ ఛానల్‌తో లైవ్ ఇంటర్వ్యూ ఇస్తూ గవాస్కర్ మాట్లాడుతూ.. “అప్పటి వరకు ఆఫ్ సైడ్‌లో పడిన బంతిని వదిలేసిన కోహ్లీ.. హాఫ్ సెంచరీ కోసం ఒక్క పరుగు తీయాలనుకున్నాడు. ఏదైనా మైలురాయి దగ్గరపడినప్పుడు ఇలాగే ఉంటుంది. ఒక్క రన్ తీద్దామనుకుని, ఆఫ్ సైడ్ బంతిని కోహ్లీ చేజ్ చేసాడు. కోహ్లీ ఓ బ్యాడ్ షాట్ ఆడాడు. ఎలాంటి షాట్ ఆడాడో కోహ్లీనే అడగాలి. మ్యాచ్ గెలవాలంటే ఏం చేయాలో చాలా చెబుతాడు. అలాంటప్పుడు లాంగ్ ఇన్నింగ్స్ ఆడాల్సిన విషయం అతని తెలియదా? ఆఫ్ స్టంప్ బయటపడిన బంతిని అంత దూరం వెళ్లి ఆడాల్సిన అవసరం ఏమి వచ్చిందని గవాస్కర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మరి గవాస్కర్ చెప్పినట్లుగా కోహ్లీ నిజంగానే హాఫ్ సెంచరీ కోసం చూసుకున్నాడా.. లేదో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలపండి.
🤣🤣🤣🤣🤣 Sunny G has had enough. pic.twitter.com/gGI4P2oQQN
— ABVan (@ABVan) June 11, 2023