ఇటీవలే టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్లో దారుణంగా ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఏ మాత్రం పోరాడకుండానే చేతులెత్తేసింది. ఈ నేపథ్యంలో పలువురు మాజీల నుంచి మన జట్టుపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ఇదిలా ఉండగా..ఇప్పుడు కోహ్లీలో దూకుడు ఉన్నా.. ఆట లేదు అని దాదా పరోక్షంగా వ్యాఖ్యానించాడు.
టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ గ్రౌండ్ లో ఎంత దూకుడుగా ఉంటాడో ప్రేత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆటతో పాటు ప్రత్యర్థుల పాలిట ఇలా అగ్రెస్సివ్ గా ఉంటూ.. ఇండియన్ క్రికెట్ లో తనదైన ముద్ర వేసాడు. ఈ క్రమంలో కెప్టెన్ గా టీమిండియాకు ఎన్నో మరపురాని విజయాలను అందించడంతో పాటు గొప్ప బ్యాటర్ నిలిచాడు. అయితే క్రికెట్ లో విరాట్ కోహ్లీ కూడా ఇలాంటి దూకుడునే ప్రదర్శించేవాడు. ఈ కారణంగా కోహ్లీని గంగూలీ తో పోల్చి చూసారు. కోహ్లీ కూడా కెప్టెన్ తో పాటు బ్యాటింగ్ లో కూడా టీమిండియాకు ఒంటి చేత్తో విజయాలనందించాడు. అయితే కోహ్లీలో దూకుడు ఉన్నా.. ఆట లేదు అని దాదా పరోక్షంగా వ్యాఖ్యానించాడు.
ఇటీవలే టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్లో దారుణంగా ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఏ మాత్రం పోరాడకుండానే చేతులెత్తేసింది. రహానే, శార్దూల పోరాడకుంటే ఇన్నింగ్స్ తేడాతో ఇన్నింగ్స్ తేడాతో ఓడిపోయినా పెద్దగా ఆశ్చర్యపడనవసరం లేదు. ఈ నేపథ్యంలో పలువురు మాజీల నుంచి మన జట్టుపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ఒక్క డబ్ల్యూటీసీ ఫైనల్ మాత్రమే కాదు.. గత కొంతకాలంగా మన జట్టు బ్యాటర్లు ఆశించిన స్థాయిలో రాణించడం లేదు. ఒక రకంగా చెప్పాలంటే లోయర్ ఆర్డర్ లో పంత్, జడేజా, అశ్విన్ మన టాప్ బ్యాటర్లకన్నా ఎక్కువగా పరుగులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గంగూలీ టీమిండియా మీద విమర్శలు గుప్పించాడు. గెలవడానికి దూకుడు ఒక్కటే ఉంటే సరిపోదని ఆట కూడా ఉండాలని చెప్పుకొచ్చాడు. అయితే గంగూలీ ఈ వ్యాఖ్యలు ప్రత్యక్షంగా టీమిండియాని ఉద్దేశించి చేసినప్పటికీ.. పరోక్షంగా కోహ్లీని అన్నట్లుగా ఫ్యాన్స్ తెగ ఫీల్ అయిపోతున్నారు.
గంగూలీ మాట్లాడుతూ “అగ్రెషన్ ఉండటం ఒక్కటే గెలవడానికి మార్గం కాదు ఆట కూడా ఉండాలి. నేను కెప్టెన్ గా ఉన్న సమయంలో టీమిండియా 2001 – 2006 మధ్య కాలంలో నిలకడగా రాణించింది. వేదికలపై టెస్టులలో మేం 500 – 600 పరుగులు చేసేవాళ్లం. అయితే టెస్టులో తొలి ఇన్నింగ్స్ స్కోరు చాలా కీలకం. ప్రత్యర్థుల ఎదుట కనీసం 350-400 అయినా చేస్తే ప్రత్యర్థిపై సైకలాజికల్ గా విజయం సాధించొచ్చు. కానీ కొద్దికాలంగా టీమిండియా ఇలా చేయడంలో విఫలమవుతోంది” అని చెప్పుకొచ్చాడు. అయితే టీంఇండియాలో కోహ్లీకి మించిన అగ్రెస్సివ్ ఎవరుంటారు అనే విషయం కూడా ఆలోచించాలి. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలపండి.