ఈసారి ఐపీఎల్లో విరాట్ కోహ్లీ, గౌతం గంభీర్ మధ్య జరిగిన గొడవ క్రికెటర్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ కాంట్రవర్సీపై ఫస్ట్ టైమ్ స్పందించాడు గౌతీ. ఇంతకీ అతడు ఏమన్నాడంటే..!
ఐపీఎల్ పదహారో సీజన్లో ప్లేయర్ల ఆట కంటే కూడా కాంట్రవర్సీలే మెయిన్ హైలైట్‌గా నిలిచాయి. ఆయా వివాదాల్లో ముఖ్యంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ పేరు ప్రముఖంగా వినిపించింది. తొలుత బీసీసీఐ మాజీ బాస్ సౌరవ్ గంగూలీతో వివాదంలో అతడు పేరు వినిపించగా.. ఆ తర్వాత గౌతం గంభీర్‌తో కాంట్రవర్సీలోనూ హైలైట్ అయింది. ఆర్సీబీ, లక్నో మ్యాచ్ తర్వాత కోహ్లీ, గంభీర్ ఒకరి మీదకు ఒకరు దూసుకెళ్లడం, మాటల యుద్ధానికి దిగడం అప్పట్లో హాట్ టాపిక్‌గా మారింది. ఇక, లక్నో సూపర్ జెయింట్స్ పేసర్ నవీన్ ఉల్ హక్ కోహ్లీని గెలికిన విషయం తెలిసిందే. ఈ గొడవ తర్వాత గంభీర్, నవీన్ ఎక్కడ కనిపించినా విరాట్ ఫ్యాన్స్ వారిని టార్గెట్ చేసుకొని రెచ్చగొట్టారు. ఈ నేపథ్యంలో తాజాగా కోహ్లీతో వివాదంపై గంభీర్ స్పందించాడు.
‘ఎంఎస్ ధోని, విరాట్ కోహ్లీతో నాకు ఒకే రకమైన సంబంధాలు ఉన్నాయి. ఒకవేళ మా మధ్య వాదన గనుక జరిగితే అది గ్రౌండ్‌కు మాత్రమే పరిమితం. కానీ ఫీల్డ్ బయట మేం మంచిగా ఉంటాం. వ్యక్తిగత విషయాలకు బయట చోటు లేదు. నాలాగే వాళ్లు (ధోని, కోహ్లీ) కూడా మ్యాచ్‌లో గెలవాలనే కోరుకుంటారు’ అని గంభీర్ చెప్పుకొచ్చాడు. ఈ వ్యాఖ్యలతో తమ గొడవ మైదానానికే పరిమితమని, బయట మిత్రులుగా ఉంటామని గంభీర్ చెప్పకనే చెప్పాడు. ఆ మ్యాచ్ గురించి ఇంకా మాట్లాడుతూ.. ‘నేనొక్కటే చెబుతా. ఆ టైమ్‌లో నేను చేసినదాన్ని సమర్థించుకుంటున్నా. నవీన్ ఉల్ హక్ తప్పు చేయలేదని భావించా. అందుకే అతడి వెంట నేను నిలబడ్డా. మీరు సరైనవారని నేను భావిస్తే.. మీ వైపే ఉంటా. నా టీమ్ ప్లేయర్ తప్పు చేస్తే.. అతడికి ఎట్టి పరిస్థితుల్లోనూ సపోర్ట్ ఇవ్వను. ఇన్నేళ్లలో నేను నేర్చుకున్నది ఇదే. దీన్నే ఎప్పటికీ కొనసాగిస్తా. ఇలాగే నేను బతుకుతా’ అని గంభీర్ స్పష్టం చేశాడు.
Gautam Gambhir said, “my relationship with MS Dhoni and Virat Kohli are the same. If there is an argument between us, it stays only on the field, not off field. There’s nothing personal. They want to win as much as I do. (On News18).
— Mufaddal Vohra (@mufaddal_vohra) June 11, 2023