క్రికెట్ అభిమానులకు అమితమైన వినోదాన్ని పంచే ఐపీఎల్.. వచ్చే సీజన్ నుంచి మరింత కొత్తగా రానుంది. మ్యాచ్‌ను స్టేడియంలో చూసేవారికే కాక.. డిజిటల్ వ్యూవర్స్‌కి కూడా సరికొత్త అనుభూతిని కలిగించనుంది. దీనికి కోసం నూతన టెక్నాలజీతో భారీ మార్పులతో ఐపీఎల్ 2023 ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఇప్పుడు ఆ ప్రత్యేకలేంటో చూద్దాం.. 2008లో ఐపీఎల్ ప్రారంభమైనప్పుడు ఎవ్వరికీ పెద్దగా అంచనాల్లేవు. జస్ట్ ఒక్క సంవత్సరం తిరిగేసరికి.. భారత్ క్రికెట్‌లో ఈ లీగ్ ఓ సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఎవ్వరికీ అందనంత ఎత్తులో నిలిచింది.
ఇక అప్పటినుంచి ఇప్పటివరకు.. ప్రతి ఏడాది ఐపీఎల్ రేంజ్ పెరుగుతూ వచ్చిందే తప్ప అస్సలు తగ్గలేదు. మిగతా దేశాల క్రికెటర్స్ కూడా ఐపీఎల్‌లో ఆడేందుకు తెగ ఉత్సాహపడుతుంటారు. ఇకపోతే ఐపీఎల్ మొదలైనప్పుడు… తొమ్మిదేళ్ల ప్రసార హక్కుల్ని బీసీసీఐ రూ.8,200 కోట్లకు అమ్మింది. సోనీ ఛానెల్ మ్యాచ్‌లను ప్రసారం చేసుకుంది. ఇక 2018-22 కాలానికి గాను స్టార్ నెట్ వర్క్.. రూ.16,348 కోట్లకు ప్రసార హక్కులను సొంతం చేసుకుంది. ఇక వచ్చే ఐదేళ్లకుగాను (2023-27) ప్రసార హక్కుల్ని నాలుగు విభాగాలుగా చేసి అమ్మడంతో బీసీసీఐ.. రూ.48,390 కోట్లు సొంతం చేసుకుంది. టీవీ ప్రసారాల్ని స్టార్ నెట్ వర్క్ రూ.23,575 కోట్లకు దక్కించుకోగా, డిజిటల్ ప్రసారాల్ని అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ రూ.23,773 కోట్లకు దక్కించుకుంది.
ఆ సంస్థకు చెందిన వయకామ్ ద్వారా మన దేశంతో పాటు విదేశాల్లోనూ ఐపీఎల్ మ్యాచుల్ని డిజిటల్‌గా ప్రసారం చేయనుంది. ఇప్పుడు ఇందులో భాగంగానే డిజిటల్ వ్యూయర్స్ కోసం సరికొత్త సదుపాయాలు తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న ఓటీటీ యాప్స్ తరహాలో.. కేవలం ఐపీఎల్ మ్యాచుల కోసమే వయకామ్ సంస్థ సరికొత్త యాప్‌ను తీసుకురానున్నట్లు సమాచారం. జియో టీవీ ద్వారా ఉచితంగా మ్యాచులు చూసే సదుపాయం కల్పిస్తుండగా.. కొత్తగా తీసుకొచ్చే యాప్ విషయంలో మాత్రం భారీగా ఛార్జ్ చేసేలా కనిపిస్తోంది. ఇకపోతే ఈ యాప్ లో ఉండే అద్భుతమైన ఫీచర్స్ ఇవే…
ఇప్పటివరకు మొబైల్స్ ఒకలా చూసిన ఐపీఎల్ మ్యాచుల్ని.. ఇకపై సరికొత్త అనుభూతి చూడనున్నారనే దాని గురించి మీరేం అనుకుంటున్నారు. ఆ ఫీచర్స్ కోసం మీలో ఎంతమంది ఎదురుచూస్తున్నారు. మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి.
ఇది కూడా చదవండి: వీడియో: ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్ తర్వాత ఏడుస్తూ గ్రౌండ్ వీడిన పాక్ పేసర్