కేవలం రెండు నెలల వ్యవధిలో ఇద్దరు దిగ్గజ ఆటగాళ్లను కోల్పోవడం అందరిని ద్రిగ్భాంతికి గురిచేస్తోంది. ఈ ఏడాది మార్చి 4న స్పిన్ మాంత్రికుడు షేన్ వార్న్ గుండెపోటుతో మరణించగా.. శనివారం (మే 14) మాజీ ఆల్‌రౌండర్ ఆండ్రూ సైమండ్స్ కారు ప్రమాదంలో మృతి చెందారు. ఈ ఇద్దరి మృతితో క్రికెట్ ప్రపంచంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. షేన్ వార్న్, ఆండ్రూ సైమండ్స్ వ్యవహార శైలి దాదాపుగా ఒకేలా ఉంటుంది. ఈ ఇద్దరు ఎన్నో వివాదాల్లో ఇరుక్కున్నారు. మందు, అమ్మాయిల విషయంలో వార్న్ చిక్కుకోగా.. మంకీ గేట్ వివాదంలో సైమండ్స్ ఇరుక్కున్నాడు. ఏదేమైనప్పటికీ ఇద్దరు దిగ్గజ ఆటగాళ్లను కోల్పోవడం తీరని లోటు. అయితే.. వీరిద్దరి మరణంతో.. వీరికి సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. వీరి మరణానికి ఆస్ట్రేలియా యువ క్రికెటర్ మార్నస్ లబుషేన్ కారణమంటూ పుకార్లు పుట్టుకొచ్చాయి.
గతేడాది సిడ్నీ వేదికగా టీమిండియాతో జరిగిన టెస్టు మ్యాచులో మార్నస్ లబూషేన్ 91 పరుగుల వద్ద ఔట్ అయ్యాడు. ఆ సమయంలో కామెంటేటర్లుగా ఉన్న షేన్ వార్న్, ఆండ్రూ సైమండ్స్.. లబుషేన్‌ను అసభ్య పదజాలంతో దూషించారు. అందుకు సబంధించిన వీడియో ఆస్ట్రేలియన్ స్పోర్ట్స్ ఛానెల్లో ప్రత్యక్ష ప్రసారం కూడా అయింది. ‘లబుషేన్‌కి అటెన్షన్ డిఫిసిట్ డిజార్డర్ ఉంది. దాన్ని తగ్గించడానికి ఏదైనా మందులు ఇవ్వాలి..***(బూతులు)’ అంటూ ఆండ్రూ సైమండ్స్ బూతు పురాణం మొదలెట్టగా, దాన్ని షేన్ వార్న్ కొనసాగించాడు. ‘ఫక్.. ముందు అతన్ని బ్యాటు సరిగా పట్టుకోమని చెప్పండి, నువ్వు ఇలాగే చెత్త ఆట ఆడుతూ ఉంటే.. నిన్ను ***లో తన్ని నీ గట్స్‌ను బయటపారేస్తాం’ అంటూ లబుషేన్‌పై షేన్ వార్న్ సైతం అనుచిత వ్యాఖ్యలు చేశాడు. అప్పట్లో ఈ విషయం పెద్ద దుమారాన్ని రేపింది.
Devastating news to wake up to… another Australian cricket legend taken from us way too soon.
Andrew Symonds, 46, killed in a car crash just two months after his great mate Shane Warne died.
Magnificent all-rounder, wonderful character, Aussie sporting icon. RIP ‘Roy’. 🙏 pic.twitter.com/rLY0ieOG8o— Piers Morgan (@piersmorgan) May 15, 2022
ఇది కూడా చదవండి: Mohammed Shami: కెప్టెన్ అంటే అలా ఉండాలి… అందుకే హార్థిక్‌కు సలహా ఇచ్చా: షమీ
అప్పట్లో ఈ విషయంపై షేన్ వార్న్, ఆండ్రూ సైమండ్స్‌పై తీవ్ర విమర్శలు వచ్చాయి. అయితే, కేవలం రెండు నెలల వ్యవధిలో ఇద్దరు ఆటగాళ్లు చనిపోవడంతో.. మార్నస్ లబూషేన్ పేరు సోషల్ మీడియాలో మారుమోగుతోంది. ‘లబూషేన్‌ను అనరాని మాటలు అన్నారు.. అనుభవించారు’ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ‘లబుషేన్‌ని ఎవ్వరూ ఏమనొద్దని, అంటే ఏం జరుగుతుందో చెప్పలేమంటూ’ పోస్టులు పెడుతున్నారు. ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.
We’ll always have a hot mic’d Andrew Symonds & Shane Warne heaping sh*t on Marnus Labuschagne’s annoying batting style & then referencing the famous “Hogg Pile” where they’d all literally jump onto Brad Hogg for similar annoying antics 😂 Rest easy Roy #RIPRoy pic.twitter.com/Y7lvN7X87O
— Heath (@riffwithbiff) May 15, 2022