ఇటివల మరణించిన ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ ఆండ్రూ సైమండ్స్ జ్ణాపకారక్ధం టౌన్స్‌విల్లే సిటీ కౌన్సిల్ కీలక నిర్ణయం తీసుకుంది. సైమండ్స్ పుట్టిన ఊరు టౌన్స్‌విల్లేలోని రివర్‌వే అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం పేరును ఆండ్రూ సైమండ్స్ స్టేడియంగా మార్చుతున్నట్లు శుక్రవారం ప్రకటించింది. కాగా సైమండ్స్ టౌన్స్‌విల్లేలోనే జన్మించాడు. ఎంతో మంది యువ క్రికెటర్లను సైమండ్స్ ఇదే స్టేడియంలో తీర్చిదిద్దాడు. అందుకే సైమండ్స్ పేరు శాశ్వతంగా నిలిచిపోవాలని ఈ నిర్ణయం తీసుకున్నట్లు టౌన్స్‌విల్లే సిటీ కౌన్సిలర్ మౌరీ సోర్స్ వెల్లడించారు. […]
కేవలం రెండు నెలల వ్యవధిలో ఇద్దరు దిగ్గజ ఆటగాళ్లను కోల్పోవడం అందరిని ద్రిగ్భాంతికి గురిచేస్తోంది. ఈ ఏడాది మార్చి 4న స్పిన్ మాంత్రికుడు షేన్ వార్న్ గుండెపోటుతో మరణించగా.. శనివారం (మే 14) మాజీ ఆల్‌రౌండర్ ఆండ్రూ సైమండ్స్ కారు ప్రమాదంలో మృతి చెందారు. ఈ ఇద్దరి మృతితో క్రికెట్ ప్రపంచంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. షేన్ వార్న్, ఆండ్రూ సైమండ్స్ వ్యవహార శైలి దాదాపుగా ఒకేలా ఉంటుంది. ఈ ఇద్దరు ఎన్నో వివాదాల్లో ఇరుక్కున్నారు. మందు, […]
ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్ ఆండ్రూ సైమండ్స్ ఆదివారం కారు ప్రమాదంలో మరణించిన విషయం తెలిసిందే. క్వీన్స్‌లాండ్‌లోని టౌన్స్‌విల్లే ఏరియా శివారులో కారు ప్రమాదం చోటు చేసుకుంది. సైమండ్స్ మృతిపై ప్రముఖ క్రికెటర్లందరూ సంతాపం తెలిపారు. సైమండ్స్‌తో తమకున్న జ్ఞాపకాలను సోషల్ మీడియాలో వేదికగా పంచుకున్నారు. కాగా.. సైమండ్స్ పెంచుకున్న రెండు పెంపుడు కుక్కలు కారు యాక్సిడెంట్లో త్రుటిలో బతికి బయటపడ్డాయి. ఇక అందులో ఓ పెంపుడు కుక్క చేసిన పనిని కన్నీళ్లు పెట్టిస్తుంది. సైమండ్స్ ప్రమాదానికి గురైన […]
ఇటీవల క్రీడా రంగంలో పలు విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఆస్ట్రేలియన్ క్రికెట్ లో తన బౌలింగ్ తో ప్రత్యర్థులకు చుక్కలు చూపించిన ప్రపంచ దిగ్గజ స్పిన్నర్ షేన్ వార్న్ కన్నుమూశారు. ఈ విషాదం మరువక ముందే.. మరో దిగ్గజ క్రికెటర్ ఆండ్రూ సైమండ్స్ మృతి చెందారు. శనివారం రాత్రి జరిగిన కారు ప్రమాదంలో సైమండ్స్ మరణించినట్లు తెలుస్తుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. క్వీన్స్ లాండ్ లో ఆండ్రూ సైమండ్స్ వేగంగా వెళ్తున్న కారు బోల్తాపడినట్లు ప్రాథమిక […]
ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL) గురించి క్రికెట్ అభిమానులకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ లీగ్ కే ప్రత్యేకంగా ఫ్యాన్స్ ఉన్నారంటే అతిశయోక్తి కాదు. ఐపీఎల్ ద్వారా అనేక మంది ప్రతిభావంతులైన యువ ఆటగాళ్లు వెలుగులోకి వచ్చారు. ఈ లీగ్ ద్వారా చాలా మందికి డబ్బు, పేరు వచ్చింది. అదే క్రమంలో ఐపీఎల్ అనేది కొంత మంది ప్లేయర్ల మధ్య మనస్పర్థలకు కారణం అయింది. తాజాగా IPL పై ఆస్ట్రేలియా మాజీ ఆల్ రౌండర్ ఆండ్రూ సైమండ్స్ ఆసక్తికర కామెంట్స్ […]