స్లెడ్జింగ్ చేయడంలో, ఛీటింగ్ చేయడంలో ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు ముందు వరుసలో ఉంటుంది. ఇప్పటికే ఏ విషయం ఎన్నో సార్లు ప్రూవ్ అయింది. యాషెస్ లో భాగంగా తాజాగా అలాంటి ఛీటింగ్ ఒకటి చేసి దొరికిపోయింది. దీంతో ఇప్పుడు కంగారూల జట్టు మీద విమర్శలు ఎక్కువవుతున్నాయి.
గత కొంత కాలంగా ఆస్ట్రేలియా ప్లేయర్లు గ్రేట్ క్యాచులు అందుకుంటూ అందరినీ షాక్ కి గురి చేస్తున్నారు. ముఖ్యంగా స్లిప్స్, గల్లీలో తీసుకున్న కొన్ని క్యాచ్ లు అయితే వావ్ అనాల్సిందే. అయితే వీటిలో కొన్ని క్యాచ్ లు మాత్రం వివాదానికి దారి తీస్తున్నాయి. డబ్ల్యూటీసీ ఫైనల్లో భాగంగా రెండో ఇన్నింగ్స్ లో గిల్ క్యాచ్ ని అందుకున్న గ్రీన్.. బంతిని క్లియర్ గా కిందపెట్టినట్లు తెలిసినా ఆసీస్ కే అనుకూలంగా ఫలితం వచ్చింది. ఇక ప్రస్తుతం యాషెస్ లో కూడా గ్రీన్ దాదాపు అలాంటి క్యాచ్ నే అందుకోగా.. మరో సారి థర్డ్ అంపైర్ ఔట్ గా ప్రకటించడం గమనార్హం. ఇక తాజాగా.. నిన్న లబుషేన్ అందుకున్న క్యాచ్ చర్చనీయాంశమవుతోంది. ఇక పూర్తి వివరాల్లోకెళ్తే..
యాషెస్ లో భాగంగా తొలి టెస్టు రసవత్తరంగా జరుగుతుంది. నువ్వా, నేనా అన్నట్లుగా జరుగుతున్న ఈ మ్యాచులో చివరి రోజు ఆసీస్ గెలవాలంటే 174 పరుగులు కావాలి. చేతిలో 7 వికెట్లు ఉన్నాయి. ఇక ఇంగ్లాండ్ గెలవాలంటే 7 వికెట్లు తీయాల్సి ఉంది. నాలుగో రోజు అట ముగుస్తుంది అనుకుంటున్న తరుణంలో బ్రాడ్.. స్మిత్, లబుషేన్ వికెట్లు తీసి ఇంగ్లాండ్ శిభిరంలో ఆశలు నింపాడు. ఇక మ్యాచ్ లో భాగంగా ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ చేస్తుండగా.. ఒక ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. కమ్మిన్స్ విసిరిన బౌన్సర్ ని ఆడే క్రమంలో రాబిన్సన్ బ్యాట్ ని అడ్డు పెట్టడంతో షార్ట్ లెగ్ లో ఉన్న లబుషేన్ క్యాచ్ అందుకున్నాడు.
అయితే లబుషేన్ గ్రేట్ ఎఫర్ట్ ఇచ్చినప్పటికీ బంతిని క్లియర్ గా అందుకోవడంలో విఫలమయ్యాడు. ఆ విషయం లబుషేన్ కి తెలిసినా బంతి గాల్లోకి ఎగరేసి సెలబ్రేషన్ చేసుంటున్నాడు. ఇక ఆసీస్ ప్లేయర్లు కూడా ఈ క్యాచ్ ని కవర్ చేయడానికి బాగానే కష్టపడ్డారు. అయితే ఫీల్డ్ అంపైర్ థర్డ్ అంపైర్ ని సంప్రదించగా నాటౌట్ గా తేలింది. దీంతో ఇంగ్లాండ్ ప్లేయర్లు కూడా తమ అసహనాన్ని తెలియజేసారు. మొత్తానికి లబుషేన్ చేసిన ఈ పని స్పోర్ట్స్ మ్యాన్ షిప్ కి విరుద్ధం. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలపండి.
Whi this Not out . The way labuschagne was celebrating, it shows the great sportsmanship of Aussies 😂. @ShubmanGill pic.twitter.com/PgYdwIyase
— niraj kumar (@nirajku1234) June 19, 2023