టెస్టు క్రికెట్ లో తనకంటూ ఒక చరిత్రను లిఖించుకున్నాడు ఇంగ్లాండ్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్. తాజాగా కెరీర్ కి గుడ్ బై చెప్పేసిన బ్రాడ్.. తాను లెజెండ్ గా మారడానికి ఒక ప్లేయర్ ఎంతో సహకరిచాడని తెలుస్తుంది.
ఇంగ్లాండ్ స్టార్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. అంతర్జాతీయ క్రికెట్ లో ఎన్నో రికార్డులు సాధించిన టెస్టు క్రికెట్ ఎక్కువగా చూసేవారికీ ఇతడొక లెజండ్. ఇంగ్లాండ్ క్రికెట్ కి ఇతడొక తీరని లోటు. అంతర్జాతీయ క్రికెట్ లో బ్రాడ్ సాధించిన ఘనతలు చెప్పుకోవాలంటే కోకొల్లలు. ముఖ్యంగా టెస్టు క్రికెట్ లో బ్రాడ్ వేసిన ముద్ర అంతా ఇంతా కాదు. ఒక ఫాస్ట్ బౌలర్ పట్టుమని పదేళ్లు టెస్టు క్రికెట్ లో కొనసాగడమే కష్టమన్న తరుణంలో బ్రాడ్ ఏకంగా 16 ఏళ్ళ పాటు తన ఆధిపత్యాన్ని చూపించాడు. టెస్టు క్రికెట్ లో ఫాస్ట్ బౌలర్లు 300, 400 వికెట్లు తీస్తేనే గ్రేట్ అని చెప్పుకునే ఈ రోజుల్లో 600 వికెట్లతో సంచలనం సృష్టించాడు. టెస్టు క్రికెట్ చరిత్రలో తనకంటూ ఒక చెరిగిపోని స్థానాన్ని సంపాదించాడు. ఒక ఫాస్ట్ బౌలర్ గా ఇంగ్లాండ్ క్రికెట్ కి ఎన్నో సేవలను అందించిన ఈ దిగ్గజ బౌలర్ తాజాగా యాషెస్ చివరిదైన ఐదవ టెస్టు తన కెరీర్ లో చివరిదని చెప్పేసాడు. దీంతో అంతర్జాతీయ క్రికెట్ నుండి ఇంగ్లాండ్ బ్రాడ్ సేవలను కోల్పోనుంది.
2007 లో దక్షిణాఫ్రికా వేదికగా టీ 20 ప్రపంచ కప్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ వరల్డ్ కప్ బ్రాడ్ కి పీడ కలను మిగిల్చింది. దానికి మన టీమిండియా డాషింగ్ బ్యాటర్ యువరాజ్ సింగ్ అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ వరల్డ్ కప్ లో జరిగిన లీగ్ మ్యాచు లో బ్రాడ్ వేసిన 19 ఓవర్లో యువీ 6 బంతులకి 6 సిక్సర్లు కొట్టడం ఇంకా ఎవరూ మర్చిపోలేదు. ఇప్పటికీ బ్రాడ్ అంటే సగటు ఇండియన్ అభిమానికి యువీ కొట్టిన 6 సిక్సులే గుర్తుకొస్తాయి. ఈ మ్యాచులో బ్రాడ్ దెబ్బకి ఇంగ్లాండ్ సెమి ఫైనల్ కి చేరకుండానే ఇంటి దారి పట్టింది. దీంతో ఇక బ్రాడ్ కెరీర్ ముగిసింది అనుకున్నారంతా. అయితే అందరి అంచనాలను తయారు మారు చేస్తూ బ్రాడ్ నమ్మశక్యం కానీ రీతిలో బౌన్స్ బ్యాక్ అయ్యాడు. ఒకదశలో బ్రాడ్ లేకపోతే ఇంగ్లాండ్ విజయం సాధించడం కష్టం అనేంతగా బ్రాడ్ కెరీర్ కొనసాగింది. అయితే తాజాగా తనలో కసి పెరగడానికి యువరాజ్ కారణం అని చెప్పినా.. సహచరుడు ఆండర్సన్ బ్రాడ్ ఎదగడానికి పరోక్షంగా చాలా కీలకంగా మారాడని తెలుస్తుంది.
బ్రాడ్ కెరీర్ తొలి నాళ్ళలో అండర్సన్ ఇంగ్లాండ్ కి కీలక బౌలర్ గా కొనసాగుతున్నాడు. ఇదిలా ఉండగా స్టీవ్ హర్మిషన్, హొగార్ద్, ఫ్లింటాఫ్ లాంటి స్టార్ బౌలర్లు చాలా తక్కువ వ్యవధిలోనే క్రికెట్ కి గుడ్ బై చెప్పడంతో స్టువర్ట్ బ్రాడ్ టెస్టు క్రికెట్ అరంగ్రేటం జరిగింది. అండర్సన్ ఇచ్చిన కీలక సలహాలతో రేటు తేలిన బ్రాడ్.. ఆ తర్వాత వెనుదిరిగి చూసుకోలేదు. చూస్తుండగానే 100, 200, 300 ఇలా 600 క్లబ్ లోకి చేరిపోయాడు. ఎంతో మంది బ్యాటర్లు బ్రాడ్ బౌలింగ్ ని ఎదుర్కోవడానికి ఇబ్బందిపడ్డారు. ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ అయితే బ్రాడ్ కి ఏకంగా 17 సార్లు తన వికెట్ సమ్పర్పించుకున్నాడు. ఫ్రాంచైజీ క్రికెట్ అంటూ డబ్బు కోసం చాలా మంది యువ క్రికెటర్లు వెంపర్లాడుతుంటే బ్రాడ్ మాత్రం తన కెరీర్ మొత్తాన్ని టెస్టు క్రికెట్ కే అంకితం చేసాడు.
ఇక బ్రాడ్ కెరీర్ గురించి చెప్పుకోవాలంటే 2006లో పాకిస్థాన్‌తో టీ20 మ్యాచ్ ద్వారా ఇంగ్లాండ్ జట్టు తరఫున అరంగేట్రం చేసాడు. ఇప్పటివరకు 167 టెస్టుల్లో 602 వికెట్లు, 121 వన్డేల్లో 178 వికెట్లు 56 టీ 20ల్లో 65 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక బ్యాటింగ్ విషయానికి వస్తే టెస్టుల్లో 3656, వన్డేల్లో 529, టీ 20ల్లో 118 పరుగులు చేసాడు. నాటింగ్ హోమ్ లో జరిగిన టెస్టులో బ్రాడ్ 15 పరుగులిచ్చి 8 వికెట్లు తీసి ఆసీస్ ని కుప్పకూల్చడం తన కెరీర్ లోనే హైలెట్. ఫాస్ట్ బౌలర్లలో 600 పైగా వికెట్లు తీసుకున్న ఇద్దరి పేస్ బౌలర్లలో బ్రాడ్ ఒకడు. అండర్సన్ ఈ లిస్టులో ప్రధమ స్థానంలో ఉన్నాడు. ఇక ఓవర్లా గా టెస్టు కెరీర్ లో ఆల్ టైం బెస్ట్ బౌలర్ల లిస్టులో నాలుగో స్థానంలో నిలిచాడు. మురళీధరన్, షేన్ వార్న్, అండర్సన్ తొలి మూడు స్థానాల్లో నిలిచారు. మరి ఇన్ని ఘనతలు సాధించిన బ్రాడ్ తాజాగా జరుగుతున్న యాషెస్ లో సత్తా చాటు చాటుతున్నాడు. కెరీర్ గొప్పగా ఉన్నప్పుడే యువకులకు అవకాశం ఇవ్వాలని గౌరవంగా క్రికెట్ నుంచి తప్పుకుంటున్న బ్రాడ్ కెరీర్ మీకెలా అనిపించిందో కామెంట్ల రూపంలో తెలపండి.