SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » sports » Stuart Broad Changed Bails Again

Stuart Broad: బ్రాడ్ బెయిల్స్ మారిస్తే.. బ్యాట్సమెన్ అవుట్! ఇది సైన్స్ అని తెలుసా?

స్తబ్దుగా సాగుతున్న మ్యాచ్ లో కాస్త ఉత్సాహం నింపేందుకు ఇంగ్లండ్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ చేసిన పని ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. బెయిల్స్ మార్చితే వికెట్ల పడటం వెనుక ఉన్న ఆసక్తికర అంశాలేంటో తెలుసా?

  • Written By: Babu Policharla
  • Published Date - Tue - 1 August 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Stuart Broad: బ్రాడ్ బెయిల్స్ మారిస్తే.. బ్యాట్సమెన్ అవుట్! ఇది సైన్స్ అని తెలుసా?

ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ మధ్య జరిగిన యాషెస్ సిరీస్ లో పలు ఆసక్తికర విశేషాలు చోటు చేసుకోగా.. అందులో ముఖ్యంగా ఒక విషయం క్రికెట్ అభిమానులను కట్టిపడేసింది. 146 ఏళ్ల ఘన చరిత్ర ఉన్న టెస్టు క్రికెట్ లో మైండ్ గేమ్ ప్రముఖ పాత్ర పోషిస్తుందనే విషయం తెలిసిందే. ఓ ఆటగాడి అత్యుత్తమ ఆటతీరును లెక్కించాలంటే.. అది సుదీర్ఘ ఫార్మాట్ తోనే సాధ్యమని ఎన్నోసార్లు నిరూపితమైంది. ఎర్రబంతితో సుదీర్ఘంగా సాగే టెస్టులే.. ఓ ఆటగాడి శక్తి సామర్థాలకు అసలైన పరీక్ష పడుతాయి. గంటల తరబడి క్రీజులో పాతుకుపోగల నైపుణ్యం, ఎలాంటి బంతినైనా డిఫెండ్ చేయగల నేర్పు, అవసరమైతే ధాటిగా ఆడగల దమ్ము ఇలా ఓ ప్లేయర్ ను పరిపూర్ణం చేయడంలో టెస్టు క్రికెట్ దే పెద్ద పాత్ర. మరి ఐదు రోజుల పాటు ప్రత్యర్థితో తలపడుతున్నప్పుడు.. శరీరంతో పాటు మనసును లగ్నం చేయక తప్పదు.

ఇందులో భాగంగా.. కొన్నిసార్లు ప్రత్యర్థి ప్లేయర్లపై పైచేయి సాధించేందుకు ఆటగాళ్లు మైండ్ గేమ్స్ ఆడుతుంటారు. అవతలి బ్యాటర్ ఏకాగ్రతను దెబ్బ తీసేందుకు కొన్ని సార్లు ఫీల్డర్లు.. మాటల దాడి చేస్తే.. మరి కొన్నిసార్లు బౌలర్లు కావాలనే టైమ్ వేస్ట్ చేస్తూ లయ కోల్పేయేలా చేసేందుకు ప్రయత్నిస్తుంటారు. తాజా యాషెస్ సిరీస్ లోనూ దాదాపు ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఉస్మాన్ ఖాజా, మార్నస్ లబుషేన్ క్రీజులో పాతుకుపోయారు. ముఖ్యంగా వన్ డౌన్ బ్యాటర్ లబుషేన్ ఇంగ్లండ్ ప్లేయర్లకు కొరుకుడు పడని కొయ్యలా మారాడు. రెండు గంటలకు పైగా క్రీజులో గడిపిన లబుషేన్.. 82 బంతులు ఎదుర్కొని కేవలం 9 పరుగులు మాత్రమే చేశాడు. అటు ఖాజా, ఇటు లబుషేన్ ఏ మాత్రం పొరబాట్లకు తావివ్వకపోవడంతో.. ఇంగ్లిష్ బౌలర్లు వికెట్ తీసేందుకు నానా తంటాలు పడ్డారు. ఆ సమయంలో మ్యాచ్ లో ఓ మ్యాజిక్ చోటు చేసుకుంది.

అప్పటికే పలుమార్లు లబుషేన్ తో మైండ్ గేమ్స్ ఆడిన బ్రాడ్.. ఎంతకీ ఔట్ కాకపోతుండటంతో వికెట్ల మీద ఉండే బెయిల్స్ అటు ఇటు మార్చాడు. దీన్ని సరదాగా తీసుకున్న లబుషేన్.. నవ్వుతూ కనిపించాడు. అయితే విచిత్రంగా.. ఆ తదుపరి బంతికే మార్క్ వుడ్ బౌలింగ్ లో లబుషేన్ స్లిప్ లో క్యాచ్ ఇచ్చి పెవిలియన్ కు చేరాడు. దీంతో బ్రాడ్ చేసిన పనికి జట్టు సభ్యులంతా అతడిని అభినందించగా.. రెండు గంటలకు పైగా క్రీజులో నిలిచిన ఓ ప్లేయర్ ను ఓ చిన్న ట్రిక్ ప్లే చేయడం ద్వారా వెనక్కి పంపాడని వ్యాఖ్యాతలు అభిప్రాయపడ్డారు. అయితే సాధారణంగా ఒక అంశాన్ని ఒకే కోణంలో చూస్తున్నప్పుడు అందులో ఏ మార్పు కనిపించకపోయినా.. ద్రుష్టి కోణాన్ని మారిస్తే ఫలితాలు భిన్నంగా వస్తాయనే సింపుల్ సైన్స్ ఇందులో దాగుంది. ఈ క్రమంలో యాషెస్ సిరీస్ లో 150 వికెట్లు పడగొట్టిన తొలి ఇంగ్లండ్ బౌలర్ గా రికార్డు నెలకొల్పిన బ్రాడ్.. ఈ సిరీస్ తో అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికాడు. ఆసీస్ రెండో ఇన్నింగ్స్ లోనూ మరోసారి వికెట్ల మీద బెయిల్స్ మార్చిన బ్రాడ్.. కెరీర్ చివరి బంతికి వికెట్ ఖాతాలో వేసుకొని ఘనంగా రిటైర్మెంట్ తీసుకున్నాడు.

Tags :

  • 2023 Ashes
  • Stuart Broad
  • Todd Murphy
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Moeen Ali: స్టోక్స్ మెసేజ్ చేస్తే డిలీట్ చేస్తా.. మోయిన్ అలీ ఆసక్తికర వ్యాఖ్యలు

Moeen Ali: స్టోక్స్ మెసేజ్ చేస్తే డిలీట్ చేస్తా.. మోయిన్ అలీ ఆసక్తికర వ్యాఖ్యలు

  • 2023 Ashes: అచ్చం గిబ్స్‌లాగే.. ఆ తొందరపాటే పనికి రాదనేది!

    2023 Ashes: అచ్చం గిబ్స్‌లాగే.. ఆ తొందరపాటే పనికి రాదనేది!

  • 2023 Ashes: క్రికెట్ చరిత్రలో ఒకే ఒక్కడు.. ఆహా ఇది కదా ఘనమైన వీడ్కోలంటే..

    2023 Ashes: క్రికెట్ చరిత్రలో ఒకే ఒక్కడు.. ఆహా ఇది కదా ఘనమైన వీడ్కోలంటే..

  • Stuart Broad: యువరాజ్ 6 సిక్స్ లు కొట్టాక.. బ్రాడ్ లెజండ్ గా ఎలా ఎదిగాడు?

    Stuart Broad: యువరాజ్ 6 సిక్స్ లు కొట్టాక.. బ్రాడ్ లెజండ్ గా ఎలా ఎదిగాడు?

  • అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికిన దిగ్గజ క్రికెటర్

    అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికిన దిగ్గజ క్రికెటర్

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam