ఇటీవల టీమిండియా క్రికెటర్ అంబటి రాయుడు క్రికెట్ కు గుడ్ బై చెప్పిన విషయం తెలిసిందే. ఇప్పుడు తాజాగా మరో క్రికెటర్ రిటైర్మెంట్ ప్రకటించాడు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్లు తెలిపాడు.
క్రీడల్లో క్రికెట్ కు ఉన్న ఆధరణ మాటల్లో చెప్పలేనిది. ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ ను కోట్లాది మంది ఇష్టపడుతుంటారు. ఎప్పుడూ ఏదో ఒక సిరీస్ జరుగుతూ క్రికెట్ ప్రియులకు వినోదాన్ని పంచుతూ ఉంటుంది. క్రీడా రంగంలో దిగ్గజ క్రికెటర్లను దేవుళ్లతో సమానంగా భావిస్తుంటారు క్రికెట్ లవర్స్. కాగా క్రికెట్ అభిమానులకు షాకిస్తూ దగ్గజ బౌలర్ షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు. క్రికెట్ కు వీడ్కోలు పలుకుతు సంచలన ప్రకటన చేశాడు. దీంతో అభిమానులు తీవ్ర నిరాశ చెందుతున్నారు. ఇంతకీ ఆ క్రికెటర్ ఎవరు? ఆ వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఫాస్ట్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ గురించి క్రికెట్ ప్రియులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఇతడు ఇంగ్లాండ్ కు చెందిన క్రికెటర్. మరీ ముఖ్యంగా ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ కి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఎందుకంటే 2007లో టీ20 ప్రపంచ కప్ లో బ్రాడ్ పేరిట నెలకొన్న ఓ రికార్డు అందుకు కారణం. టీ20 వర్డల్ కప్ లో స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్ లో యువరాజ్ ఆరు బంతుల్లో ఆరు సిక్సులు బాది చెమటలు పట్టించాడు. కాగా స్టువర్డ్ బ్రాడ్ 17 ఏళ్ల అంతర్జాతీయ క్రికెట్‌నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు.
2006లో పాకిస్థాన్‌తో టీ20 మ్యాచ్ ద్వారా ఇంగ్లాండ్ జట్టు తరఫున అరంగేట్రం చేసిన బ్రాడ్ తనదైన ఆటతో క్రికెట్ చరిత్రలో చెరగని ముద్ర వేశాడు. ప్రస్తుతం ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న యాషెస్ ఐదో టెస్ట్ తనకు చివరి టెస్ట్ అని బ్రాడ్ వెల్లడించాడు. అన్ని ఫార్మాట్ లలో స్టువర్ట్ బ్రాడ్ సాధించిన పరుగులు, వికెట్లు.. 167 టెస్టుల్లో ఆడి 3656 పరుగులు సాధించి.. 602 వికెట్లు పడగొట్టాడు. 121 వన్డేల్లో 529 పరుగులు చేసి.. 178 వికెట్లు తీశాడు. 56 టి20ల్లో 118 పరుగులతో.. 65 వికెట్లు పడగొట్టాడు.