క్రికెట్ ఆడే టైమ్‌లో గ్రౌండ్లో కొందరు ప్లేయర్లు చేసే పనులు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. ఇంకొందరు ఆటగాళ్ల చర్యలైతే వీళ్లేంటి ఇలా ప్రవర్తిస్తున్నారు అనేంతలా షాక్‌కు గురిచేస్తాయి. ఆసీస్ క్రికెటర్ లబుషేన్ చేసిన ఒక పని ఇలాగే హాట్ టాపిక్‌గా మారింది.
యాషెస్ రెండో టెస్టు ఆసక్తికరంగా సాగుతోంది. ఈ మ్యాచులోనూ రిజల్ట్ పక్కా వచ్చేలాగే ఉంది. ప్రస్తుతం ఆస్ట్రేలియా మంచి ఆధిక్యంలో ఉంది. తొలి టెస్టులో బజ్‌బాల్ వ్యూహంతో కంగారూలను ఓడించినంత పని చేసిన ఇంగ్లండ్.. రెండో టెస్టులో మాత్రం అదే ప్లాన్‌తో తేలిపోయింది. సంప్రదాయ ఫార్మాట్లో ఆస్ట్రేలియా తమదైన శైలిలో ఆడుతూ ఇంగ్లీష్ టీమ్ దూకుడుకు భలేగా కళ్లెం వేసింది. ఈ మ్యాచ్‌లో ఫస్ట్ ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 416 రన్స్‌కు ఆలౌట్ అయింది. స్టీవ్ స్మిత్ (110) సెంచరీతో ఆకట్టుకున్నాడు. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన ఇంగ్లండ్.. తొలి ఇన్నింగ్స్‌లో 325 రన్స్‌కే పరిమితమైంది. ఒక దశలో 3 వికెట్లకు 208 స్కోరుతో పటిష్టంగా కనిపించింది ఇంగ్లండ్. అయితే మిచెల్ స్టార్క్ (3 వికెట్లు), జోష్ హేజల్‌వుడ్ (2 వికెట్లు) అద్భుతమైన బౌలింగ్‌తో ప్రత్యర్థి పనిపట్టారు. రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్ ప్రస్తుతం వికెట్లు ఏమీ కోల్పోకుండా 25 రన్స్‌తో ఉంది.
ప్రస్తుతం ఉస్మాన్ ఖవాజా (19 నాటౌట్), డేవిడ్ వార్నర్ (5 నాటౌట్) క్రీజులో ఉన్నారు. దాదాపు రెండున్నర రోజుల ఆట ఇంకా మిగిలే ఉంది. ఈ నేపథ్యంలో రిజల్ట్ పక్కా అని చెప్పొచ్చు. ఆసీస్‌ను గనుక త్వరగా ఆలౌట్ చేయకపోతే ఛేజింగ్ చేయడం ఇంగ్లండ్‌కు చాలా కష్టమవుతుంది. ఇదిలా ఉంటే.. లార్డ్స్ టెస్టులో కంగారూ స్టార్ బ్యాటర్ మార్నస్ లబుషేన్ చేసిన ఒక పని ఫ్యాన్స్‌ను ఆశ్చర్యానికి గురిచేసింది. ఆసీస్ ఇన్నింగ్స్ 45వ ఓవర్లో లబుషేన్ తన గ్లవ్స్‌ను సరిచేసుకుంటూ ఉండగా.. అతడి నోట్లో ఉన్న బబుల్ గమ్ జారి కింద పడింది. సాధారణంగా అలా మట్టిపై పడిన ఆహారాన్ని తిరిగి తీసుకోవడానికి ఎవరూ ఇష్టపడరు. నోట్లో పెట్టుకొని నమిలే బబుల్ గమ్ లాంటివి కిందపడితే దాన్ని ముట్టుకునేందుకూ బ్యాడ్‌గా ఫీలవుతారు. కానీ లబుషేన్ కిందపడిన చూయింగ్ గమ్‌ను తీసుకొని నోట్లో పెట్టుకొని తిరిగి బ్యాటింగ్ కొనసాగించాడు. ఈ ఘటన కెమెరాల్లో రికార్డవడంతో నెట్టింట వైరల్‌గా మారింది. దీంతో అందరూ లబుషేన్‌ను ట్రోల్ చేస్తున్నారు.
Marnus dropping his gum on the pitch and then putting it back in his mouth????pic.twitter.com/tGdYqM3w72
— 🌈Stu 🇦🇺 (@stuwhy) June 29, 2023